శ్రీలంకలో ఓ వ్యక్తి గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరిపోయిన వీడియో వైరల్ అయింది . ఆ దేశంలోని జాఫ్నాలో తై పొంగల్ వేడుక సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు . ఆరుగురు స్నేహితులు
జనపనారతో తయారు చేసిన తాడుతో పెద్ద గాలిపటాన్ని ఎగురవేశారు . ఈ క్రమంలో వారిలోని ఓ వ్యక్తి తాడును పట్టుకుని గాల్లోకి వెళ్లిపోయాడు .కొన్ని సెకండ్లు గాల్లోనే ఉన్నాడు . కాసేపటికి తాడు కాస్త కిందకి రావడంతో దాన్ని వదిలేసి దూకేశాడు .