– పర్యాటకానికి కొత్త శోభ
– చంద్రబాబు మహిళా ద్వేషి
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి
పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోందని, గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్న 1100 ఎకరాల రెవెన్యూ భూమిని పర్యాటక శాఖకు అప్పగించాలని నిర్ణయించడం జరిగిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. పెన్నానది లోయ అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేస్తున్న రోప్ వే మరో మూడు నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానుందని తెలిపారు.
చంద్రబాబు మహిళా ద్వేషి అని, సొంత పార్టీలోని మహిళలకు అసలు స్థానమే లేకుండా అవమానాలు, గెంటివేతలు చేసాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల దగ్గర నుండి నామినేటెడ్ పోస్టుల దాకా అన్నింటిలోనూ దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా మహిళలకే అగ్రస్థానం కల్పించి అక్క చెల్లెమ్మలపై జగన్ తన అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. చంద్రబాబు మహిళా ద్వేషిగా తన స్వభావాన్ని చూపిస్తే, సీఎం జగన్ మహిళలకు ఎనలేని ప్రాధాన్యత కల్పిస్తూ మహిళా పక్షపాతిగా ఉన్నతమైన స్థానం సంపాదించుకున్నారని అన్నారు.
కుప్పంలో శివపురం దగ్గర చంద్రబాబు సొంత ఇంటి కోసం రెండెకరాల భూమి కొనుగోలు చేసి తన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాడని, బాబు ప్రయాణం మళ్లీ రెండు దగ్గరే ఆగిందని, ఎక్కడ మెదలెట్టాడో అక్కడే ఆగాడని ఏద్దేవా చేసారు.
కాలం గిర్రున తిరుగుతోందని రాబోయే వాతావరణ సంక్షోభం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి సమయం మించిపోతోందని హెచ్చరించారు. మన వినియోగ అలవాట్లను మార్చుకుని పర్యావరణహితమైన ఉత్పత్తుల వైపు మారాల్సిన అత్యవసర సమయం ఆసన్నమయ్యిందని, అందరూ త్వరపడాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.