Suryaa.co.in

Andhra Pradesh

లొల్ల లాకుల ఆధునీకరణ పై దృష్టి సారించండి

– ఎమ్మెల్యే బండారు సత్యానందరావు

ధవళేశ్వరం: ఆనకట్ట పరిధిలో బొబ్బర్లంక వంతెనపై ఉన్న రహదారి పూర్తిగా పాడైపోయిందని ఆ రహదారిని కలెక్టర్ నిధులతో అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. అలాగే లొల్లలాకులు శిథిలావస్థకు గురైన అంశాన్ని కలెక్టర్ కు ఆయన వివరించారు.

కోనసీమ రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని లొల్లలాకుల ఆధునీకరణను వెంటనే చేపట్టాలని గత శాసనసభ లో సభ దృష్టికి శాసనసభ్యులు తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. సోమవారం లొల్ల లాకుల దుస్థితిని కలెక్టర్ కు ఎమ్మెల్యే దగ్గరుండి చూపించారు.

సుమారు రూ.75 కోట్ల అంచనా విలువతో ఈ లాకుల పునర్నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని, లాకుల నిర్మాణం జరిగి 137 సంవత్సరాలు పూర్తయిపోవడంతో దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయని మూడు ప్రధాన కాలువల ద్వారా రెండు లక్షల ఎకరాలు సాగునీరు కోనసీమలోని ఐదు నియోజకవర్గాలకు ఈ లొల్ల లాకుల ద్వారానే అందుతుందని ఆయన కలెక్టర్ కు వివరించారు.

లొల్ల లాకులు, ర్యాలీ లాకులు ఆధునీకరణ అంశంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను శాసనసభ్యులు బండారు సత్యానందరావు కోరారు. ఈ కార్యక్రమం లో కొత్తపేట జనసేన పార్టీ ఇంచార్జి బండారు శ్రీనివాస్,ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ),కరుటూరి నరసింహారావు,ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాధం మరియు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE