Suryaa.co.in

Andhra Pradesh

ఎన్డీఏ సమన్వయ కమిటీల ఏర్పాటు కృషి

– ప.గో. జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు

భీమవరం: భీమవరం నియోజకవర్గం వీరవాసరం భీమవరం మండల కమిటీల సమావేశం నియోజకవర్గ ఇన్చార్జ్ రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప.గో. జిల్లా టిడిపి అధ్యక్షుడు మంతెన రామరాజు మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి మండల పట్టణ నియోజకవర్గస్థాయి వరకు ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీల ఏర్పాటుకు బిజెపి జనసేన టిడిపి అధిష్టాన నాయకులతో చర్చిస్తున్నామని, త్వరలోనే ఎన్డీఏ కూటమి నియోజకవర్గ సమన్వయ కమిటీలు నియామకాలు జరగనున్నాయని తెలిపారు.

నియోజకవర్గ ఇన్చార్జి తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కొరకు ఏపీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రణాళిక బద్దంగా ముందుకు వెళుతున్నారని గ్రామ సభలు విజయవంతం కావడంతో పనికి ఉపాధి పథకాల అభివృద్ధికీ నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు.

టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి నాయకత్వంతో ఎటువంటి విభేదాలు లేకుండా నాయకులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు వెండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ వైయస్ జగన్ రాక్షస పరిపాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లకు వెనుకబడిందని రాష్ట్ర అభివృద్ధిలో నాయకులు కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE