– అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మంత్రి అనిత క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రిని కలిసిన రాష్ట్ర పాస్టర్ల యూనియన్
– ప్రవీణ్ పగడాల కేసుపై హోంమంత్రితో చర్చించిన పాస్టర్లు
– హోం మంత్రి అనిత
నక్కపల్లి: పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. ఈరోజో,రేపో డిటైల్ రిపోర్ట్ వస్తుంది. ప్రవీణ్ పగడాల అంటే మాకు కూడా గౌరవమే. ప్రతీరోజు ఈ కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారు. కొంతమంది కావాలనే ఈ కేసు విషయంలో రాజకీయం చేస్తున్నారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడతున్నారు. సోషల్ మీడియాలో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై దృష్టి సారించాం.