2019 డిసెంబర్లో ఊహించని విధంగా నేను అమరావతి ఉద్యమానికి వచ్చేనాటికి నేను గీతం యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ లో ప్రొఫెసర్ గా గీతం యూనివర్సిటీ సివిల్ సర్వీసెస్ క్లాసెస్ బాధ్యతలు నిర్వహిస్తున్నాను.
గచ్చిబౌలిలోని నా ఐఏఎస్ అకాడమీలో జూన్ లో మరియు నవంబర్ లో అడ్మిషన్లు జరిగే రెండు బ్యాచ్ ల తో పాటు…గీతం యూనివర్సిటీ క్లాసులతో కలిపి…చాలా మంచి ఆదాయంతో…చదువుకుంటూ… క్లాసులు చెబుతూ… షటిల్ ఆడుతూ… సినిమాలు చూస్తూ… జీవితం సాగిపోతా ఉండేది.
గీతం యూనివర్సిటీలో సివిల్ సర్వీస్ కోచింగ్ సంబంధించి- గీత యూనివర్సిటీ కి నా ఐఏఎస్అకాడమీకి మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా…ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ … చేసుకోవడం జరిగింది.
రెండు రోజులపాటు అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించాలి అని వచ్చిన నన్ను,రెండు నెలల పాటు ఉండమని ఓ పెద్దాయన కోరారు. ఫలితంగా నేను హైదరాబాదులో…నా సొంత అకాడమీలో మరియు గీతం యూనివర్సిటీలో రెగ్యులర్గా క్లాసులు తీసుకోలేకపోయాను. ఆ తర్వాత ఊహించిన విధంగా కరోనా రావడం…లాక్ డౌన్ ప్రారంభం…. వరసగా జరిగిపోయాయి.
90 రోజుల తర్వాత గీతం యూనివర్సిటీ నాతో చేసుకున్న ఎంఓయూను రద్దు చేసుకొని,బైజుస్తో ఒప్పందం చేసుకుంది. 1,75,000 వేల రూపాయలు కట్టి పోటీ పరీక్షలకు చదువుకునే పిల్లలకు ప్రతిరోజూ చాలా ముఖ్యమైనది కాబట్టి….యూనివర్సిటీ నిర్ణయాన్ని నేను అంగీకరించాను. 15 సంవత్సరాలుగా నాకు బాగా పరిచయమున్న బైజుస్ డైరెక్టర్ రవీంద్రన్ ని ఫోన్ చేసి అభినందించాను. ఆ సంవత్సరం వచ్చే 60 లక్షల కోసం కాకుండా,చేతిలో రెగ్యులర్ గా వచ్చే భారీ వ్యాపార లక్ష్యంతో బైజుస్ ఆ ప్రాజెక్టులో ప్రవేశించింది.
కరోనా తగ్గిపోయి…మళ్లీ సీజన్ మొదలయ్యే సమయానికి… మార్కెట్ మొత్తం ఆన్ లైన్ కి షిఫ్ట్ అయ్యింది. ఈలోపు నేను అమరావతి ఉద్యమంలో నాకు తెలియకుండానే చాలా దూరం ముందుకు వెళ్లిపోయాను. రెండు రోజులు, రెండు నెలలు… అనుకున్నది… సంవత్సరాలలోకి మారింది.
కొద్ది నెలల్లో మళ్లీ నా నార్మల్ షెడ్యూల్ కి వెళ్లిపోతాను కదా అనుకుంటూ…విస్తృతంగా తిరుగుతున్న కారణంగా,షార్ట్ టైమ్ సర్దుబాటు కోసం చేసిన లక్ష,రెండు లక్షలు… అప్పులు…చూస్తుండగానే ….భారీగా పెరిగాయి. దాంతో వత్తిడి కూడా పెరిగింది.
కొన్ని రోజుల తర్వాత స్పష్టంగా అర్థమైంది….. నా వృత్తిని…ఆదాయాన్ని… వదిలేసి….జగన్ ప్రభుత్వం మీద పోరాడుతూ….జగన్ బాటలోనే, అప్పుల మీద బండి నడిపిస్తున్నానని.
మరిప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి అమ్మాలి….
