Suryaa.co.in

Andhra Pradesh

అటవీ భూములు ఆక్రమిస్తున్నారు.. అడ్డుకోండి

– కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి భూపేందర్ యాదవ్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ
– పశ్చిమ గోదావరి జిల్లా టి.నర్సాపురం మండలం అల్లంచెర్లరాజు పాలెం లో అటవీ భూముల ఆక్రమణలపై తక్షణ చర్యలు కోరుతూ లేఖ

లేఖలోని అంశాలు:-
•అల్లంచెర్లరాజుపాలెం గ్రామంలోని పాత స.నెం.453లో పర్యావరణ పరంగా విలువైన అటవీ భూమి అన్యాక్రాంతం అవుతోంది
• అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతం కింద 3255 ఎకరాల అటవీ భూమి 1950 నుంచి అటవీ శాఖ అధీనంలో ఉంది.
• అటవీ శాఖ అధికారులకు చెప్పకుండా రెవెన్యూ అధికారులు కొంతమేర అటవీ భూమిని గతంలో సాగుభూమిగా ప్రకటించారు.
• న్యాయ సూత్రాలకు విరుద్దంగా రెవెన్యూ అధికారులు నాడు తీసుకున్న నిర్ణయంపై కోర్టులలో వివాదం నడుస్తుంది.
• దీన్ని ఆసరాగా చేసుకుని తాజాగా అల్లంచెర్ల రాజుపాలెం పాలెం ఫారెస్ట్‌ బ్లాక్‌ పరిధిలోని 226, 227, 231, 232, 233 సర్వే నంబర్లలోని భూమి తమ ఆధీనంలో ఉందని ఆక్రమణదారులు, వారి వారసులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
• ఈ భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేస్తున్నారు, బోరు బావులు తవ్వుతున్నారు.
• తద్వారా భూమి తమ ఆధీనంలో ఉందని, దానిని అటవీ భూమిగా ప్రకటించడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు తప్పుడు వాదనలకు దిగుతున్నారు.
• అటవీ భూముల అక్రమణకు జరుగుతున్న ఈ ప్రయత్నాలకు, అక్రమ రెవెన్యూ రికార్డులు సృష్టించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తోంది.
• ఈ కారణంగా కేంద్ర ప్రభుత్వ శాఖ వెంటనే ఈవిషయంలో జోక్యం చేసుకుని అటవీ భూములను కాపాడాల్సిన అవసరం ఉంది.
• తక్షణమే మొత్తం అటవీ భూమిని సర్వే చేసి స్పష్టమైన సరిహద్దులను ఏర్పాటు చేయాలి
• వివిధ న్యాయస్థానాలలో పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభుత్వం గట్టిగా పోరాడాలి
• భూ కబ్జాదారులను నుంచి అల్లంచెర్లరాజుపాలెం అటవీ ప్రాంతాన్ని కాపాడడానికి అక్కడ నిరంతరం నిఘా ఉంచాలి
• అల్లంచెర్లరాజుపాలెం ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతం చేయడానికి భూ కబ్జాదారులతో కుమ్మక్కైన సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE