హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితర నాయకులు కలిసి పుష్పగుచ్ఛమిచ్చి శాలువాతో సత్కరించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ఎంపీ రవిచంద్రను శనివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,ఆయన అనుచరులు కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
ఈ సందర్భంగా జైపాల్ యాదవ్ వెంట రవిచంద్రను కలిసిన వారిలో ఎల్.ఎన్.రెడ్డి, గోదె పర్వతాలు యాదవ్, కేశవులు గౌడ్, వెంకట్రాములు గౌడ్, గోరటి జంగయ్య యాదవ్, వరికుప్పల ఆంజనేయులు, వరికుప్పల యాదయ్య, శివరామకృష్ణ, పిప్పల వెంకటేష్ తదితర నాయకులు ఉన్నారు.