-కంప్యూటర్,టైలరింగ్ తరగతులు
– నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొంగర దుర్గాప్రసాద్
యన్టీఆర్ జిల్లా సుజనా ఫౌండేషన్ ఇన్చార్జ్ వీరమాచినేని కిరణ్ వారి సారధ్యంలో నందిగామ నియోజకవర్గ సుజనా ఫౌండేషన్ ఇన్చార్జ్ కొంగర దుర్గాప్రసాద్ వారి ఆధ్వర్యం లో రైతుపేట లో గల చైతన్య కాలేజీ ఎదురుగా ఉన్న యాక్సిస్ బ్యాంక్ పైన కంప్యూటర్,టైలరింగ్ ఉచితంగా శిక్షణా తరగతులు ప్రారంబించామని నందిగామ నియోజకవర్గ ఇన్చార్జ్ కొంగర దుర్గాప్రసాద్ తెలియజేశారు.
సుజనా ఫౌండేషన్ అధ్యక్షులు సుజనా చౌదరి వారి ఆశయాల మేరకు ఉమెన్ ఎంపవర్ మెంట్, మహిళా సాధికారత సాధించాలనే లక్ష్యంతో ఈ ఉచిత శిక్షణలు ప్రారంబిచామని నిర్వాహకులు తెలియజేశారు.
ఈ ఉచిత శిక్షణ 300 రూ.,, లతో అతి తక్కువ ఫీజులతో నిరుద్యోగ యువతకు శిక్షణ మరియు ఉపాధి కల్పన కల్పించటం కోసం విధ్యార్ధులు ఎంచుకొనే కంప్యూటర్ కోర్సులు ఆధారంగా మహిళలు, పురుషులు బ్యాచ్ ల వారీగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు.
ఎంచుకొనే కంప్యూటర్ కోర్సులు ఆధారంగా నెల రోజులు, మూడు నెలలు శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలియజేశారు. ముందు ముందు సుజనా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవాకార్యక్రమాలు చేయబోతున్నామని సుజనా ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టైలరింగ్ టీచర్ కోమలీ కుమారి, కంప్యూటర్ కోర్సులు టీచర్ విరజ,తరుణ్,హరి, ఇంతియాజ్ మరియు విధ్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.