దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకి,
మండలానికి, ప్రాంతానికి
కాపు, పాలకుడు అనగా రక్షకుడు వున్నట్లే ;
దేహానికి, ప్రాణానికి కూడా
రక్షకుడు వుంటాడు.
ఆ వ్యక్తి కి
ప్రాంతీయ బేధం లేదు.
భాషా బేధం లేదు.
లింగ బేధం లేదు.
వయో బేధం లేదు
వయో పరిమితి లేదు.
మత బేధం లేదు.
వర్ణ బేధం లేదు.
ధనిక, పేద బేధం లేదు.
ఆ వ్యక్తే ఆత్మ బంధువు.
ఆజన్మాంతం ఆనంద క్రతువు.
కష్టాలలో ఆదుకుంటాడు.
సమస్యల వలయం లో
వున్నప్పుడు సహాయకుడు గా నేనున్నానంటాడు
పరిష్కారం చేసే
పరమాత్ముడు అవుతాడు.
కృష్ణ, కుచేల (సుధాముడు)
మైత్రి కి సాక్షీ భూతుడు
అనిపించుకుంటాడు.
అతడే … స్నేహితుడు.
సేద తీర్చే స్నే … హితుడు.
– చింతపల్లి వెంకటరమణ