అల్లు అర్జున్
సినీమాల్లోకి
వచ్చినప్పుడు …
నువ్వు
రాజకీయాల్లోకి
వచ్చినప్పుడు …
నాది ఒకే
రకమైన ఫీలింగ్ …
నాదే కాదు
ఆల్మోస్ట్ అందరిదీ అదే భావన…
అబ్బా –
వారసులైన కారణంగా
ఇప్పుడు వీళ్ళని భరించాలా అని..!!
రాష్ట్రం విడిపోయాక
మొదటి టర్ము పాలనలో
రాష్ట్రం మొత్తానికి ఓ
ట్రోలింగ్ ఐటంలా కనపడ్డావ్ …
కానీ –
పాఠాలు నేర్చుకున్నావు ..
నిత్య విద్యార్ధిలా మారావు..
పనిమంతుడవయ్యావు …
నిన్ను నువ్వొక అందమైన
శిల్పంలా చెక్కుకున్నావు …
ఎదురైన
ప్రతి అవమానాన్నీ
నీ విజయానికి పునాదిగా,
విజయ సౌధానికి మెట్టుగా మార్చుకున్నావు ..
ఓ తరాన్ని
ప్రభావితం చేసేలా
తయారయ్యావు – అవుతున్నావు …
నీలో మార్పుతో
మాట్లేడే నోళ్ళకి తాళం వేసావు.
తిరిగి చూసుకోనవసరం లేదు .
రాబోయేవన్నీ స్వర్ణకాంతుల
శుభోదయాలే – ఆనందోదయాలే …
నడువు –
నడిపించు
జనాలని కలువు –
కలుపుకుని ముందుకి సాగిపో …
విజయీభవ – దిగ్విజయీభవ
మరింత
విద్యా వినయ
సంపన్నుడవయి …
నడునడవోయ్
నవయువకా…
సుందర తీరాల వైపు
నడపవోయి దేశ నౌక …!!!