ఫిబ్రవరి న విజయవాడలో దళిత ప్రతిఘటన మహాసభ
– తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్ రాజు
నూతన సంవత్సరం 2022 జనవరి 3 వ తేది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దళిత ప్రతిఘటన సభలు నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్ష్యులు ఎం.ఎస్ రాజు ప్రకటించారు. ఈ మేరకు ఆత్మకూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాజు మాట్లాడుతూ……
రాష్ట్రంలో జగన్ రెడ్డి నాయకత్వంలో అరాచక పాలన సాగుతోంది. ఈ అరాచక పాలనకు దళితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో బలౌతున్నారు. ప్రశ్నిస్తే దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. రూ.4426 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లించారు. 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం పెద్దలు సాధించిన అట్రాసిటీ చట్టాన్ని దళితులు పైనే ప్రయోగిస్తున్నారు. జగన్ రెడ్డికి పోగాలం దగ్గర పడింది. అందుకే దళితులతో ఆటలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ దళితులు చాలా చైతన్యవంతులని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి. దళిత ఓట్లతో అధికార పీఠం ఎక్కిన జగన్ రెడ్డి దళితులు తలచుకుంటే దిగిపోవాల్సి ఉంటుందని కూడా తెలుసుకోవాలి.
ఎస్సీ కార్పొరేషన్ ను మూడుగా విభజించి వాటిల్లో కనీసం లక్ష రూపాయిలు కూడా నిధులు ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. తెలుగుదేశం హయాంలో ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి జేసీబీలు, ఇన్నోవా కార్లు, ట్రాక్టర్లు, రాయితీ లోన్లు అందించాం. కానీ, ఇప్పుడు కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలివ్వలేని పరిస్థితి నెలకొంది.
అక్రమ మధ్యంపై ప్రశ్నించినందుకు ఓం ప్రతాప్ ను పొట్టన పెట్టుకున్నారు. అక్రమ ఇసుకపై ప్రశ్నించినందుకు వరప్రసాద్ కు గుండు గీయించారు. కరోనా కిట్లు అడిగినందుకు డా. సుధాకర్ ను పిచ్చివాడ్ని చేసి చంపారు. చీరాలలో కిరణ్,. మాచర్లలో విక్రం, పులివెదులలో నాగమ్మ, అనంతపురంలో
స్నేహలత, గుంటూరు నకరికల్లులో మంత్రూ బాయి ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలనలో దళితులపై 4,950 నేరాలు జరిగాయని స్వయంగా డీజీపి ప్రకటించారు. అప్పటి కేంద్ర ప్రభుత్వం అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లను తొలగించాలని చూస్తే వాటిని యదాతదంగా ఉంచాలని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెడితే పారిపోయిన వ్యక్తి జగన్ రెడ్డి. ఆ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన నేత చంద్రబాబు.
రాష్ట్ర వ్యాప్తంగా దళితులను చైతన్యం చేసి దళిత వ్యతిరేక జగన్ రెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు ఉద్యమాలకు సిద్దం చేయడానికి దళిత ప్రతిఘటన సదస్సులు.కార్యక్రమంలో తెదేపా అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్, నాయకులు దేవతోటి నాగరాజు, దాసరి ఆంజనేయులు పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షులు డా. బాబు-తిరుపతి, కాకి ప్రసాద్ – నెల్లూరు, మానుకొండ శివప్రసాద్, – శ్యాం – ఒంగోలు, దరూరి జేమ్స్ – కర్నూలు, సురేష్ – బాపట్ల, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు అఖిల్ అన్ని పార్లమెంటుల ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.