-వైసీపీ ప్రభుత్వ అరాచకాలు తిప్పికొట్టడంలో లోకేష్ పోరాటం అమోఘం
-రాష్ట్రంలో మతిస్థిమితం లేని మహిళల నుంచి చిన్న పిల్లల వరకు రక్షణ లేదు
-ప్రకృతి ప్రసాదించే వనరులను దోచుకొని జగన్ రెడ్డి జె- గ్యాంగ్ లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు
-తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల -అభ్యునతి కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రకటించిన మినీ మేనిఫెస్టో వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలపడానికి చేపట్టిన చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) కార్యక్రమం
జోన్ -1 కు సంబంధించి
విజయనగరం పార్లమెంట్ పరిధిలోని నెల్లిమర్ల నియోజకవర్గంలో నియోజకవర్గం ఇంఛార్జి కర్రోతు బంగార్రాజు ఆధ్వర్యంలో చైతన్య రథయాత్ర జరిగింది. ముందుగా నెల్లిమర్ల నగర పంచాయతీ NTR విగ్రహనకి పూలమాల వేసి నివాళులర్పించారు. రామతీర్థం శ్రీరామాలయం దేవాలయంలో పూజలు నిర్వహించిన తంగుడుబిల్లి మీదుగా కమావరం వద్ద పార్టీ చేరికలు సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తరువాత గునపురెడ్డిపాలెం గ్రామంలో పల్లి రిజర్వాయర్ కాలువను సందర్శించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సెల్ఫీ చాలెంజ్ చేపట్టారు.
భోగాపురం మండలం కంచేరపాలెం గ్రామం వద్ద హూద్ హూద్ ఎన్టీఆర్ ప్రత్యేక గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన తుఫాన్ ఇళ్లను నిర్మాణం పూర్తయినప్పటికీ నేటికీ లబ్ధిదారునికి ఇవ్వకపోవడంతో సెల్ఫీ చాలెంజ్ చేశారు. తిరిగి కంచేరు బైరెడ్డిపాలెం మరియు రాయవలస మీదుగా రావాడ గ్రామంలోని ఏర్పాటుచేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమం నిర్వహించి.రాత్రి స్థానికులతో కలిసి భోజనం చేసిన అనంతరం అదే గ్రామంలో పల్లెనిద్ర చేశారు.
ఈ కార్యక్రమంలో పూసపాటి అశోక్ గజపతిరాజు , కిమిడి నాగార్జున గారు, గుమ్మడి సంధ్యారాణి, కావలి ప్రతిభా భారతి , కొండ్రు మురళీ , కిమిడి రాం మల్లిక్ నాయుడు గారు,వేపాడ చిరంజీవి రావు ,కొండపల్లి అప్పలనాయుడు, కోళ్ల లలిత కుమారి , బేబీ నాయన, LL నాయుడు ,మహంతి చిన్నంనాయుడు, ఐ.వి.పి.రాజు, సువ్వాడ రవి శేఖర్ , కంది చంద్రశేఖర్ రావు , కడగల ఆనంద్ కుమార్ ,కర్రోతు సత్యనారాయణ , సువ్వాడ వనజాక్షి , పతివాడ తమ్మినాయుడు , పతివాడ అప్పలనారాయణ , పతివాడ అప్పలనాయుడు ,మహంతి శంకర్రావు , పల్లె భాస్కరరావు , బైరెడ్డి లీలావతి, గేదెల రాజారావు ,లంక అప్పలనాయుడు , అట్టాడ శ్రీధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.
జోన్-2
టిడిపి చైతన్య రథయాత్ర బుధవారం నాడు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో నిర్వహించారు. టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్వంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు పెద్దాపురం మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజా సూరిబాబు నివాసం నుంచి బస్సుయాత్ర ప్రారంభమైంది. పెద్దాపురం మరిడమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బస్సుయాత్ర ముందుకు సాగింది.
అక్కడ నుండి పెద్దాపురం మున్సిపల్ సెంటర్, మెయిన్ రోడ్, సినిమా సెంటర్ మీదుగా వాలుతిమ్మాపురం చేరుకుని టిడిపి హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళ వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అక్కడ నుండి కొత్తపేట, దర్గా సెంటర్, గుడివాడ, సిరివాడ, కాండ్రకోట, మర్లావ, తిరుపతి, చంద్రమాంపల్లి, దివిలి, పులిమేరు, గోరింట, వడ్లమూరు, డి.రాగంపేటల మీదుగా సామర్లకోట చేరుకుంది. సామర్లకోట పట్టణంలో గాంధీబొమ్మ సెంటర్, బ్రౌన్ పేట, క్లాత్ సెంటర్, మఠం సెంటర్ మీదుగా పూర్ణ కళ్యాణ మండపం వరకూ చైతన్యరథ యాత్ర సాగింది.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ…. రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజలందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయి టిడిపికి ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. పెద్దాపురం నియోజకవర్గంలో బస్సుయాత్రలో గ్రామగ్రామాన ప్రజల నుండి లభించిన స్పందన అపూర్వమని చెప్పారు. టిడిపి హయాంలో పెద్దాపురం నియోజకవర్గాన్ని సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దామని తెలిపారు.
ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని మండిపడ్డారు. వచ్చేది మళ్ళీ టిడిపి ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు ప్రకటించిన హామీలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకువస్తాయని చినరాజప్ప చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లలో టిడిపిని గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇద్దామని ఆయన అన్నారు.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ… వైసీపీ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కుపోయిందన్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనపై నాలుగేళ్లుగా టిడిపి చేస్తున్న పోరాటం ఫలిస్తోందన్నారు. ప్రజల్లో చైతన్యం మొదలైందని, వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. టిడిపి మినీ మేనిఫెస్టోను ఇంటింటికీ ప్రచారం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు.
బాదుడే బాదుడు, ఇదేంఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలను మించి మన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పారు. చినరాజప్ప సారధ్యంలో పెద్దాపురం నియోజకవర్గం చక్కటి అభివృద్ధి సాధించిందని, చినరాజప్పకు హ్యాట్రిక్ విజయాన్ని అందించి మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
టిడిపి ఇంఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ… టిడిపి మినీ మేనిఫెస్టోలోని అంశాలను సమగ్రంగా వివరించారు. దేశంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందే టిడిపి అని, ఎన్టీఆర్ నాడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చంద్రబాబు మరిన్ని పెంచి ప్రజలకు అందించారని తెలిపారు. టిడిపి హయాంలో అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను రద్దు చేసి వైసీపీ పేదల పొట్టకొట్టిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైపోయిందని, అందుకే రాష్ట్ర పునర్నిర్మాణం కోసం భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ చంద్రబాబు మినీ మేనిఫెస్టో ప్రకటించారని చెప్పారు.
మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మాట్లాడుతూ… సామాజిక న్యాయానికి పుట్టినిల్లు తెలుగుదేశం అని చెప్పారు. దళితులు, బిసిల అభ్యున్నతికి టిడిపి ప్రభుత్వమే పెద్దపీట వేసిందన్నారు. దళితులు నా మేనమామలు అని చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆ దళితుల పైనే హత్యలు, అత్యాచారాలు చేయిస్తున్నాడని ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు దళిత యువకుడు వరప్రసాదుకు శిరోముండనం చేశారని, కరోనా సమయంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడని ముద్ర వేసి చంపేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు సన్మానాలు చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు.
మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ.. రాక్షస పాలనకు నిదర్శనం వైసీపీ ప్రభుత్వం అన్నారు. అరాచకం, విధ్వంసం అజెండాగా వైసీపీ ఈ రాష్ట్రాన్ని పాలిస్తోందని, అదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి వేధిస్తోందన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే తిరిగి చంద్రబాబు పాలన రావాలన్నారు. పెద్దాపురం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో చైతన్య రథయాత్రకు విశేష స్పందన లభించడంతో సభా ప్రాంగణానికి రావడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సభకు అధ్యక్షత వహించి నడిపించారు.
ఈ సభలో మాజీ మంత్రులు చిక్కాల రామచంద్రరావు, పీతల సుజాత, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ ఎంపి ఎజెవి బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అయితాబత్తుల ఆనందరావు, పెందుర్తి వెంకటేష్, దాట్ల బుచ్చిబాబు, బూరుగుపల్లి శేషారావు, పిల్లి అనంతలక్ష్మి, చిల్లా జగదీశ్వరి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, నర్సాపురం టిడిపి ఇంఛార్జి పొత్తూరి రామరాజు, ప్రత్తిపాడు టిడిపి ఇంఛార్జి వరుపుల సత్యప్రభ, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్ సుంకర పావని, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధి మోకా ఆనందసాగర్, పెద్దాపురం మున్సిపల్ మాజీ ఛైర్మన్ రాజా సూరిబాబు రాజు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు డొక్కా నాథ్ బాబు, యర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి కటకంశెట్టి ప్రభాకర్, కాలా సత్తిబాబు, కాకినాడ రూరల్ టిడిపి నాయకులు పెంకే శ్రీనివాసబాబా, పేరాబత్తుల రాజశేఖర్, వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జోన్-3 పరిధిలోని
గుంటూరు పార్లమెంట్ మంగళగిరి నియోజకవర్గంలో బుధవారం జరిగింది. దుగ్గిరాల మండలం, దుగ్గిరాల హెచ్.పి గ్యాస్ కంపెనీ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. ముస్లీం సెంటర్ లోని కొత్త లాకులు జెండా చెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి ర్యాలీగా మార్కెట్ యార్డు వరకు నాయకులు నడుచుకుంటూ వెళ్ళారు. దుగ్గిరాల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై ఆధ్వానంగా ఉన్న నీటి గుంత వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. తర్వాత గాంధీ, అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఎన్.టి ఆర్, పొట్టి శ్రీములు, ఏకలవ్యుని విగ్రహాలకు నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి చర్చిలో ప్రార్థనలలో పాల్గొన్నారు.
దారిపొడవునా మహిళలు హారతులతో నాయకులకు స్వాగతం పలికారు. ప్రజలకు భవిష్యత్తు టీడీపీతోనే సాధ్యం అంటూ భరోసా కల్పిస్తూ టీడీపీ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డును పరిశీలించి రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మార్కెట్ యార్డులో టీడీపీ హాయాంలో ఏర్పాటు చేసిన శిలాపలకం వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
తదుపరి రేవేంద్రపాడులో శిథిలావస్థకు చేరిన పెద్ద బ్రిడ్జి వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేశారు. మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలోని వై గార్డెన్స్ నందు నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టీడీపీ హయాంలో నిర్మించిన ఏపీఐఐసి మరియు టిడ్కోఇళ్ల వద్ద సెల్ఫీ ఛాలెంజ్ చేశారు.
మాజీ మంత్రి కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ… జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో దోపిడి, అరాచకం ఒక్కటే జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో అసమర్థ ప్రభుత్వం పాలన చేస్తుందని దుయ్యబట్టారు. ఏపీలో పూర్తిగా వ్యవసాయ రంగం నష్టపోయేలా జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రైతులకు విత్తనం దొరకదని పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వంలో దక్కడం లేదని విమర్శించారు. ఆరుగాలం శ్రమించిన పసుపు రైతులకు సరైన ధర లభించడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.
నాలుగు సంవత్సరాలుగా పసుపు రైతులు నష్టపోతూనే ఉన్నారన్నారు. వైసీపీ అనుసరిస్తున్న విధానాల వలన రైతు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యనించారు. హమాలీలకు ఇవ్వాల్సిన డబ్బులు, బట్టలు కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిని రైతుల నష్టపోతే రైతులను ఆదుకోకపోగా పంట నష్టం అంచనా కూడా చేయలేదని ఆరోపించారు.
లోకేష్ ను గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ది చెందటంతో పాటు మార్కెట్ యార్డ్ కూడా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యనించారు. దోపిడీ, హత్యా రాజకీయాలకు రాష్ట్రంలో చోటులేదని, రాష్ట్రాభివృద్ధికి పాటుపడే చంద్రబాబునాయుడుకే ఈ సారి ప్రజలు పట్టం కడతారని చెప్పారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. రాష్ట్ర సంపదను అమూల్‌కు దోచిపెడుతూ సీఎం జగన్ క్విడ్‌ప్రోకోకు పాల్పడుతున్నారని వందల కోట్ల విలువైన రాష్ట్ర సంపదను అప్పనంగా కట్టబెడుతున్నారని ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సంపదను అమూల్‌కు దోచిపెడుతున్నారని… విజయ డెయిరీని అభివృద్ధి చేసే ఉద్దేశం ఈ ముఖ్యమంత్రికి లేదన్నారు. తెలుగుజాతి నిర్మించుకున్న డెయిరీలను వదిలేసి గుజరాత్‌కు చెందిన అమూల్‌ను ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… టీడీపీ హయాంలోనే దుగ్గిరాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రైతులకు న్యాయం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క టీడీపీ పార్టీయే అని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ కెటాయించిందన్నారు. ఇప్పుడు ఉన్న వ్యవసాయ మంత్రికి దొంగతనాలు చేయించడం తప్ప మరొకటి తెలియదని విమర్శించారు. మార్కెట్ లో టమాటా ధర 160 ఉంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ… దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రాలలో ఏపీ ముందంజలో ఉందన్నారు. ఆకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. గ్రావేల్ గజదొంగ ఆర్కే అని విమర్శించారు. ఆర్కే అక్రమ ఇసుకలోనే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హయాంలోనే రైతులకు నూరు శాతం న్యాయం జరిగిందని చెప్పారు. సంపద సృష్టించాలన్న చంద్రబాబు, సంపదను పంచాలన్నా చంద్రబాబుకే సాధ్యం అన్నారు. వైసీపీ నాయకులు రాష్ట్రం సంపద లక్షల కోట్లరూపాయలు దోచుకొని జేబులో దాచుకున్నారని ఆరోపించారు. రైతులు పండించిన పంటకు గత 4సం. లుగా గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎద్దెవా చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మంగళగిరి ఎమ్మెల్యేగా లక్ష ఓట్లతో కార్యకర్తలు గెలిపించబోతున్నారని జ్యోస్యం చెప్పారు. ప్రాజెక్టులు అన్నీ పూర్తి అవ్వాలంటే మరల చంద్రబాబు అధికారంలోకి రావాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ .. 2014లో లోటు బడ్జెట్లో ఉన్న సమయంలో ఎలాంటి అప్పు చేయకుండా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించామన్నారు. మంగలిగిరిలో టిడ్కో ఇళ్ళ నుంచి ఐటి పార్క్ వరకు అభివృద్ధి చేసిన ఘనత టీడీపీ పార్టీదే అని వ్యాఖ్యనించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం ప్రచార లోపం అని చెప్పారు. రాష్ట్రంలో మతిస్థిమితం లేని మహిళల నుంచి చిన్న పిల్లల వరకు రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు నుంచి నాయకులు వరకు ప్రాణాలు పనంగా పెట్టి పార్టీని నడిపిస్తున్నట్లు తెలిపారు. మన భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం వైసీపీని రాష్ట్రం నుంచి పారదోలాలని పిలుపునిచ్చారు. నా మీద కూడా కేసులు నమోదు చేశారు. గత మూడేళ్ళ కిందట ఓ మహిళ వచ్చి తన కొడుకు గంజాయికి బానిస అయ్యాడని వాపోతే నా మీదే ఆ మహిళతోనే తిరిగి కేసు పెట్టించారు. వారి కుమారుడు గత కొద్దిరోజులు కిందటరైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని అని అన్నారు.
వైసీపీ నేతలు కులం గొప్పది గుణం గుడిచేతిది అన్న చందంగా తయారైందన్నారు. లోకేష్ కల్మషం లేని వ్యక్తి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి, వారిని ఆర్ధికంగా బలోపేతంగా చేసినట్లు తెలిపారు. కార్యకర్తలు లే ప్రాణంగా పనిచేస్తున్న కల్మషం లేనివ్యక్తి లోకేష్ అని పేర్కొన్నారు. వైసీపీ నేతలు రామా అన్న బుతుమాటగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.
రాజకీయంగా ఎదగాలంటే పదవి గర్వం, అధికార గర్వం ఉంటే ఎప్పుడు రాజకీయ్యంగా ఎదగలేరుని పేర్కొన్నారు. వైసీపీ నేతలు తీరు మార్చుకోరు టీడీపీ నేతలు మాత్రమే తీరు మార్చుకొని పోరాటాలు చేయాలని సూచించారు. మంగళగిరి నియోజకవర్గన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవద్దు దెబ్బకు దెబ్బ… ఢీ అంటే ఢీ అని మంగళగిరిలో లోకేష్ ను గెలిపించుకుందామన్నారు.
చంద్రబాబు ,లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు దగ్గరుండి గెలిపించారు. అమరావతి పై అక్కస్సుతో మహిళా రైతులు ఉద్యమం చేస్తుంటే వైసీపీ అధినేత సమక్షంలో తీవ్ర హింసలకుపాల్పడ్డారు. మంగళగిరి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఆళ్ల రామకృష్ణ రెడ్డి తరిమి తరిమి కొట్టాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బాపట్ల టీడీపీ ఇంచార్జ్ వేగిసేన నరేంద్ర వర్మ మాట్లాడుతూ.. కుటుంబానికి మహిళఎంత ముఖ్యమో అలాగో రాష్ట్రానికి టీడీపీ పార్టీ అంత ముఖ్యం..మంగళగిరి నియోజకవర్గo లో 40వేల ఓట్ల మెజారిటీతో లోకేష్ విజయబావుటా ఎగురవేయబోతున్నారు. యువగళం పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలో కార్యకర్తలు ఇంటింటికి టీడీపీ జెండాను అందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా యువగళం పాదయాత్ర మిగిలిపోతుంది. టీడీపీ పార్టీకి బలం… బలగం లోకేష్ కానున్నారు.
మాచర్ల ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లోలో మంగళగిరి నియోజకవర్గo మంచి నేతను కాలదన్నుకున్నారు. లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో కులాన్నిమతాన్ని నమ్మలేదు మనస్సాక్షిని, ఆత్మవిశ్వాసాన్ని నమ్మి వచ్చాడని వ్యాఖ్యనించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్ కోసం పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితిని టీడీపీ ఛాలెంజ్ గా తీసుకుంది,మన అత్యుత్సాహంతో లోకేష్ ను మనంతట మనమే ఓడించుకున్నాం అని పేర్కొన్నారు. టీడీపీ పార్టీని నియోజకవర్గంలో ప్రతిఒక్కరు నడిపించాలని పిలుపునిచ్చారు. లోకేష్ ఓడిపోయినా తన నియోజకవర్గలో అభివృధ్ధికోసం పాటుపడుతూనే ఉన్నారని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రానికి వెలుగుల దివిటిగా వెలుగులో యువగళం పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం బాధ్యత నారా లోకేష్ మొస్తుంటే…మంగళగిరి నియోజకవర్గo బాధ్యత కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ నేతల అగచాట్లు ఎలావుంటాయో చూస్తూ వుండండి అని ఎద్దెవా చేశారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు తిప్పికొట్టడంలో లోకేష్ పోరాటం అమోఘం అని పేర్కొన్నారు. లోకేష్ మనస్తత్వం…అన్న నందమూరి తారకరామారావు మనస్తత్వం ఒక్కట్టిగా అనిపిస్తున్నాయన్నారు. కార్యకర్తలు కష్టం వస్తే క్షణకాలంలో మీ సమస్యలను పరిస్కారం చూపిస్తూ నడుస్తున్నారని అన్నారు.
ఈ బస్సు యాత్రలో గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, బాపట్ల నియోజకవర్గ ఇంచార్జ్ వేగేసన నరేంద్ర వర్మ, గుంటూరు తూర్పు ఇంచార్జ్ మొహమ్మద్ నసీర్ అహ్మద్, మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యరావు, పాతర్ల రమేష్, తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు చిట్టాబత్తిన శ్రీనివాసరావు (చిట్టిబాబు), దాసరి రాజామాష్టారు, కలపటపు బుచ్చి రాంప్రసాద్, మానుకొండ శివప్రసాద్, కూచిపూడి విజయ, మద్దిరాల ఇమ్మానుయేల్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి బొంతు శివ సాంబిరెడ్డి, కాండ్రు శ్రీనివాసరావు, జిల్లా బిసి విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీ కృష్ణ, జిల్లా రైతు అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, జిల్లా ఎస్సి సెల్ అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు, మంగళగిరి నియోజకవర్గ టౌన్, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
జోన్ -4
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యునతి కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రకటించిన మినీ మేనిఫెస్టో వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలపడానికి చేపట్టిన చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) చిత్తూరు నియోజకవర్గంలో బస్సు యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేష్, బాలాజీ,ఈశ్వర్, శశికర్ బాబు* తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.
జోన్ 5 పరిధిలోని
కర్నూలు పార్లమెంట్, ఆలూరు నియోజకవర్గం నుందు నియోజకవర్గం ఇంచార్జీ కోట్ల సుజాతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం ఇంచార్జీ సుజాతమ్మ పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనాయకులు, స్థానిక నాయకులతో కలిసి బస్సుయాత్రను ప్రారంభించడం జరిగింది. మొదటగా ఆస్పరి నందు డాక్టర్ బి.ఆర్.అంబెద్కర్ విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం స్థానిక సర్కిల్ నందు అక్కడికి చేరిన నాయకులు, కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి నాయకులు ప్రసంగించడం జరిగింది.
అనంతరం జొహరాపురం నందు నీటి ఎద్దడి వల్ల బీడుపడిన పంటపొలాల దెగ్గర సెల్ఫీ తీకోవడం జరిగింది. అక్కడ నుండి చిన్నహొత్తూరు గ్రామం నందు స్థానిక ప్రజలతో సమావేశం కావడం జరిగింది. అక్కడ నుండి పెద్దహొతూరు గ్రామం నందు వీరబ్రహ్మేంద్రస్వామి మటం ను నాయకులు సందర్శించి ప్రతేయక పూజలు నిర్వహించడం జరిగింది.
ఆలూరు గ్రామంలోకి స్థానిక నాయకులు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ తో బస్సుయాత్రను ఆహ్వానించడమైనది. ఆలూరు మొదలు నుంచి స్థానిక అంబెద్కర్ సర్కిల్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంబెద్కర్ సర్కిల్ నందు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నాయకులు పాల్గొని భవిష్యత్ కు గ్యారెంటీ మిని మానిఫెస్టో ను ప్రజలు వివరించడం జరిగింది. అనంతరం మైనారిటీ సోదరులతొ సమావేశం కావడమైనది. అనంతరం కమ్మరచేదు గ్రామం నందు రచబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, యం.ఎల్.సి బి.టి.నాయుడు, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు (అనంతపురం), బి.కె.పార్థసారథి (హిందూపురం), మాజి మంత్రివర్యులు పరిటాల సునీత, నియోజకం పార్టీ పరిశీలకులు ఆదినారాయణ, మాజి మంత్రివర్యులు కె.ఇ.ప్రభాకర్, నియోజకవర్గం ఇంచార్జీలు కె.ఇ.శ్యాం కుమార్ (పత్తికొండ), ఆకేపోగు ప్రభాకర్ (కోడుమూరు), పి.తిక్కా రెడ్డి (మంత్రాలయం), కె.మీనాక్షి నాయుడు (ఆదోని), నియోజకవర్గం మాజి ఇంచార్జి వైకుంటం శివప్రసాద్, వైకుంటం జ్యోతి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి పి.జి.నరసిమ్హులు యాదవ్, పి.జి.రాంపుల్లయ్య యాదవ్, సి.ఎస్.నారాయణ రెడ్డి, రాంభీం నాయుడు, పార్లమెంట్ బి.సి సెల్ అధ్యక్షులు సత్రం రామక్రిష్ణుడు మొదలగు వారితో పాటు అన్ని మండలాల మండలపార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.