Suryaa.co.in

Andhra Pradesh

డిసెంబరు నాటికి పూర్తిస్ధాయిలో ఇంటర్నెట్‌

పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

అమరావతి:
ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…
ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ప్రాజెక్టులు వీలైనంత త్వరగా ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకోండి: సీఎం
అన్నిరకాలుగా ఆయా సంస్థలకు చేయూత నివ్వండి:
పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే సంస్థలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి:
ఎస్‌ఐపీబీలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
ఇందులో సీఎస్, సీఎంఓ అధికారులు ఉండేలా చూడాలన్న సీఎం.
అనుమతుల్లో జాప్యంలేకుండా నిర్ణీత కాలవ్యవధిలోగా వాటికి క్లియరెన్స్‌ ఇచ్చేలా చూడాలన్న సీఎం

పోర్టులు, ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణంపై సీఎం సమీక్ష.
రామాయపట్నం పోర్టులో మార్చి 2024 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపిన అధికారులు.
2023 డిసెంబరు నాటికి పనులు పూర్తయ్యేలా ప్రయత్నించాలని అధికారులకు సూచించిన సీఎం.
మచిలీపట్నం పోర్టు పనులు నవంబరు నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన అధికారులు.
భావనపాడు పోర్టు పనులను డిసెంబర్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు.
మొదటి విడతలో నిర్మించనున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్భర్ల పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం.
2023 జూన్‌ నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం.

రాష్ట్రానికి మంజూరైన బల్క్‌డ్రగ్‌ పార్కు నిర్మాణ ప్రణాళికను సీఎంకు వివరించిన అధికారులు.
బల్క్‌ డ్రగ్‌పార్కులో కంపెనీలు పెట్టేందుకే మేజర్‌ ఫార్మా కంపెనీల నుంచి ఇప్పటికే ప్రతిపాదనలు వచ్చాయన్న అధికారులు.

డిసెంబరు నాటికి పూర్తిస్ధాయిలో ఇంటర్నెట్‌…
డిసెంబరు నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లు వీటన్నింటికీ కూడా ఫైబర్‌తో అనుసంధానంచేసి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలన్న సీఎం.
5జీ సేవలను గ్రామాలకు చేరవేయడంలో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపిన అధికారులు.
దీనికోసం టెలికాం దిగ్గజాలతో కలిసి పనిచేస్తున్నామన్న అధికారులు.
డిజిటల్‌ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయన్న సీఎం.
వైయస్సార్‌ జిల్లా వేల్పులలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడనుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన సీఎం.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ లైబ్రరీలు వస్తే.. తమ సొంత గ్రామాలనుంచే మెరుగైన ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుందన్న సీఎం.
అందుకే డిజిటల్‌ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెఫ్ట్‌ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్న సీఎం.
దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ అవుతుందన్న సీఎం. చాలామందికి ఆదర్శనీయంగా నిలుస్తుందన్న సీఎం.

ఎంఎస్‌ఎంఈలకు అధిక ప్రాధాన్యత….
గడచిన మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతిపై వివరాలు అందించిన అధికారులు.
ప్రతిజిల్లాలో 2 క్లస్టర్ల చొప్పున ఎంఎస్‌ఎంఈలను నెలకొల్పేందుకు కృషిచేస్తున్నామని తెలిపిన అధికారులు.
పరిశ్రమలు ప్రారంభం కావడమే కాదు, వాటిని నిలబెట్టే విధంగా కూడా చర్యలు తీసుకోవాలన్న సీఎం.
అధికంగా ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలన్న సీఎం.
వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభిస్తుందని, తద్వారా నిరుద్యోగం తగ్గుతుందన్న సీఎం.
ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వాలన్న సీఎం.
ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కుకునేలా వాటికి నిరంతరం చేయూతనివ్వాలన్న సీఎం.
ఎంఎస్‌ఎంఈలపై మన ప్రభుత్వం దృష్టిపెట్టినట్టుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదన్న సీఎం.
ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ను క్రియాశీలం చేయాలని సీఎం ఆదేశం.
ఇతర దేశాల్లో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌పై ఒక పరిశీలన చేయాలన్న సీఎం.
వాటికి ఏపీ ఒక వేదికగా నిలిచేలా ఆలోచన చేయాలన్న సీఎం.
ఏయే రంగాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్నాయి, వాటిని ఇక్కడకు తీసుకురావడంద్వారా ఇక్కడి వారికి ఆదాయాలు, ఉద్యోగాల కల్పన ఏరకంగా చేయవచ్చో ఆలోచన చేయాలన్న సీఎం.
ఇతరదేశాల్లో ఉన్న ప్రతిష్ట్మాత్మక ఎంఎస్‌ఎంఈ పార్కులతో టై అప్‌అయ్యే అంశంపైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం.

ఇండస్ట్రియల్ కారిడార్లపైనా సమీక్ష.
విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ఇప్పటికే ఉన్న పారిశ్రామిక నోడల్స్‌ను అభివృద్ధిచేయడంతోపాటు మచిలీపట్నం నోడ్, దొనకొండ నోడ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్న అధికారులు.
భావనపాడు నోడ్‌ను అభివృద్ధి చేయాలన్న సీఎం.
అలాగే రామాయపట్నం నోడ్‌ కూడా ఏర్పాటు చేయాలన్న సీఎం.
పోర్టులను ఆసరాగా చేసుకుని, పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలన్న సీఎం.

దీనికోసం ఇద్దరు లేదా ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు, విదేశాల్లో ఎంఎస్‌ఎంఈల రంగంలో మంచి విధానాలపై పరిశీలన చేసి, వాటిని ఇక్కడ అడాప్ట్‌ చేసుకునేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం.
ఉత్తమ పద్ధతుల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్వహణ విధానాలనూ పరిశీలించాలన్న సీఎం.
కాలుష్యాన్ని నివారించడం, ఉత్పత్తుల తయారీలో అత్యాధునిక విధానాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు పరిశీలనలో భాగం కావాలన్న సీఎం.
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న సీఎం.
మార్కెట్లో అవకాశాలున్న ఉత్పత్తులు ఎంఎస్‌ఎంఈల నుంచి వచ్చేలా తగిన విధంగా వారికి సహాయంగా ఉండాలని సీఎం ఆదేశం.

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలికసదుపాయాలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాలవలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌ భరత్‌ గుప్తా, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ షన్‌మోహన్, ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూధన్‌రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐడీసీ ఛైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, ఏపీటీపీసీ ఛైర్మన్‌ కె రవిచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఛైర్‌ పర్సన్‌ షమీమ్‌ అస్లాం, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఛైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి, ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ సలహాదారు రాజీవ్‌ కృష్ణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ సలహాదారు లంక శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE