-మండలాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా! కాకాణి
-పదేళ్లు దోచుకుని ఇప్పుడు ప్రమాణాలు చేసి ప్రయోజనం ఏంటి?
-కాకాణి అవినీతి,అక్రమాలతో వెనుకబడిన సర్వేపల్లి నియోజకవర్గానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తానని మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
– పొదలకూరు పట్టణంలోని అయ్యప్ప నగర్, శ్రీహరి కాలనీలో వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి ,నాయకులు,కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సోమిరెడ్డి
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రెండుసార్లు ప్రజల ఓట్లతో గెలిచిన కాకాణి హయాంలో అభివృద్ధి జరిగిదా.. లేదా తన హాయంలో అభివృద్ధి జరిగిందో..తనతో చర్చికి రావడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. పదేళ్ల జనాలను పట్టించుకోకుండా,కక్షపూరిత రాజకీయాలు చేసి, ఇప్పుడు నాయకుల వద్ద మిమ్మల్ని నేను బాగా చూసుకుంటా అని కాకాణి ప్రమాణాలు చేస్తున్నారని ఆ ప్రమాణాలను ప్రజలు నమ్మరన్నారు.
కాకాణి అరాచకాలు పులిస్టాప్ పడిందన్నారు. మొగళ్లూరు, వరదాపురం, మరుపూరు, వైట్ క్వార్ట్జ్ దోపిడీతో కోట్లకు పడగలెత్తారన్నారు. ఆరు నెలల్లో కరోనా ప్యాలెస్ నిర్మించుకున్న మంత్రి కాకాణి నియోజకవర్గం లోని పేదలకు మాత్రం ఐదు ఏళ్ళు జగనన్న గృహాలు ఇవ్వలేదని, అక్కడక్కడ అరకొర ఇళ్లు ఇచ్చిన నాసిరకం నిర్మాణాలు జరిపారని ఎద్దేవా చేశారు
ఒకే పార్టీలో 40 ఏళ్లుగా సేవలందిన తన కోసం కాకపోయినా, జనం కోసం నియోజకవర్గ భవిష్యత్తు కోసం తనకి ఈసారి ఓటెయ్యాలన్నారు. మంత్రి కాకాణి కాంగ్రెస్ లో జడ్పీ చైర్మన్‌గా పనిచేస్తూ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పొదలకూరులో పెట్టడాన్ని వ్యతిరేకించారని గుర్తు చేశారు. పొదలకూరు కి మంత్రి కాకాణి ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలన్నారు. పొదలకూరు చుట్టూ ప్రక్కల బినామీలతో 300 ఎకరాలను భూమిని కొనుగోలు చేశారన్నారు. అనేక భూ కుంభకోణాలకు పాల్పడ్డ మంత్రి కాకాని రాబోవు ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావ్ అని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తలచీరు మస్తాన్ బాబు ,బొద్దులూరి మల్లికార్జున్ నాయుడు ,కలిచేటి ప్రభాకర్ రెడ్డి ,పులిపాటివెంకటరత్నం నాయుడు,మస్తాన్ భాష, అక్కెం సుధాకర్ రెడ్డి,బక్కయ్య నాయుడు, కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి,ఆదాల సుగుణమ్మ అరుణమ్మ, మస్తానమ్మ వెన్నపూస రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు