Suryaa.co.in

Andhra Pradesh

ముస్లింల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయిస్తున్న నిధులు,వారి దాకా చేరడం లేదు

– జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక్క ముస్లిం యువకుడైనా ప్రభుత్వ సాయంతో స్వయం ఉపాధి పొందాడా?
• నవరత్నాలతో సంబంధంలేకుండా ఈమూడేళ్లలో జగన్ రెడ్డి ముస్లింల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్నినిధులు కేటాయించాడో చెప్పగలడా?
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ

రాష్ట్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన 2022-23 బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి అత్తెసరునిధులే కేటాయించారని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకబడ్జెట్ ను ప్రహాసనంగా మార్చాడని, మసి పూసిమారేడుకాయ చేస్తూ ప్రజలను మోసగిస్తున్నాడని టీడీపీ రాష్ట్రఅధికారప్రతినిది సయ్యద్ రఫీ స్పష్టంచేశారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

ప్రజా క్షేమానికి, వారిసంతోషానికి ఉపయోగపడాల్సిన బడ్జెట్ ను జగన్ రెడ్డి ఉత్తుత్తి బడ్జెట్ గా మార్చేశాడు. మైనారిటీల సంక్షేమాని కి గతబడ్జెట్లో రూ.1,434కోట్లు కేటాయించిన జగన్ ప్రభుత్వం, రూ.1243కోట్లు ఖర్చుచేసినట్టుచెప్పుకుంది. కానీవాస్తవంలో రాష్ట్రంలో ఎక్కడా ఏ మైనారిటీ యువకుడికి స్వయంఉపాధికింద ఒక్క రూపాయికూడా ఇచ్చిన దాఖలాలు లేవు.

తాజాబడ్జెట్లో మైనారిటీలకోసం రూ.2630కోట్లు కేటాయిస్తే, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి రూ.988.97కోట్లు కేటాయించారు. ఈబడ్జెట్లో మైనారిటీలకోసం కేటాయించిననిధుల్ని సక్రమంగా ఆయావర్గాలకే ఖర్చుచేస్తారా అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈమూడేళ్లలో జగన్ రెడ్డి ఎక్కడా ముస్లింమైనారిటీలకోసం గతప్రభుత్వం అమలుచేసిన దుల్హన్, దుకాన్ మకాన్, విదేశీవిద్య, రంజాన్ తోఫా పథకాలుగానీ, ఇతరత్రావాటికి రూపాయికూడా ఖర్చు చేయలేదు.

నవరత్నాలు అనేవి రాష్ట్రంలోఅందరికీ అరకొరగా ఇస్తున్నారుకానీ, ప్రత్యేకంగా మైనారిటీవర్గాలకోసం ఈ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఏంచేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ రెడ్డి హాయాంలో ముస్లింయువతకు ఎక్కడారూపాయిస్వయం ఉపాధిరుణంకూడా అందలేదు. టీడీపీహాయాంలో 25,374మంది ముస్లిం యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించేలా వారికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంలో శిక్షణ ఇవ్వడం జరిగింది.

జగన్ రెడ్డి వచ్చాక మైనారిటీ యువతకు నైపుణ్యాభివృద్ధికల్పించే పథకాలను మూలనపడేశా డు. విదేశాల్లో చదువుకోవడానికి ముస్లింయువతకు చంద్రబాబు ప్రభుత్వం పెద్దఎత్తునసహాయంచేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పథకమే లేకుండాచేశాడు. ముస్లిం యువతులకు టీడీపీహాయాంలో పెళ్లికానుక కింద రూ.50వేల నుంచి, రూ.80వేల వరకు సహాయం చేశారు.

పాదయాత్రసమయంలో దుల్హన్ పథకంకింద ఇచ్చేమొత్తాన్ని రూ.లక్షకుపెంచుతానని చెప్పిన జగన్ రెడ్డి, ముఖ్యమంత్రి అయి మూడేళ్లైనా ఏ ఒక్క పెళ్లి కూతురికి రూపాయి ఇవ్వలేదు.టీడీపీ హాయాంలో రాష్ట్రవ్యాప్తంగా 316దర్గాలు, 1365 మసీదులు, 43ఖబరిస్తాన్ లు, 1,548 అగార్ ఖానాలు, 66ఈద్గాలు, 164 వరకు ముస్లిం ప్రార్థనా మందిరాలకు మరమ్మతుల కోసం నిధులు కేటాయించారు. అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కోజిల్లాకు రూ.2కోట్ల50లక్షలు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమం త్రి అయ్యాక టీడీపీ హాయాంలో మొదలైన అనేకపనులు ఎక్కడివ క్కడేనిలిచిపోయాయి. అనేకకట్డడాలు బోసిపోయి కనిపిస్తున్నాయి.

టీడీపీ హయాంలో ప్రారంభమైన హజ్ హౌస్ నిర్మాణం కూడా ఈ ప్రభుత్వంవచ్చాక నిలిచిపోయింది. ఈవిధంగా ముస్లిం మైనారి టీలసంక్షేమానికి, వారిఅభివృద్ధికి అదనంగా రూపాయికూడా కేటాయించకపోవడం ముఖ్యమంత్రి వారికిచేసిన థోకా కాదా అని ప్రశ్నిస్తున్నాం. వాలంటీర్, సచివాలయ వ్యవస్థలో పనిచేసే వారే ఉద్యోగులన్నట్లుగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి, ఏటా ఇస్తానన్న జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నోటిఫికేషన్లను పూర్తిగా విస్మరించాడు.

ముఖ్యమంత్రి నిరుద్యోగులనోట్లో మట్టికొట్టడంవల్ల ముఖ్యంగా నష్టపోయింది ముస్లింయువతే. అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డ్ ఆస్తులను స్వాధీనంచేసుకుంటామని, అందుకోసం ప్రత్యేకాధి కారాలతో ఒకవ్యవస్థనుఏర్పాటుచేస్తామని గతంలో జగన్ రెడ్డి చెప్పాడు. కానీనేడు గుంటూరు, నంద్యాల, కర్నూల్లో వైసీపీ నేతలే వక్ఫ్ఆస్తులు ఆక్రమిస్తుంటే ముఖ్యమంత్రి చూస్తూ ఊరు కున్నది నిజంకాదా? ఇకరద్దుల విషయానికివస్తే ముస్లింలపథకా ల్లో చాలావాటిని జగన్ రెడ్డి రద్దుచేశాడు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకనే ముస్లింలపైదాడులు పెరిగాయి.అబ్దుల్ సలాం కుటుంబం మొత్తంరైలుకింద పడి చని పోయిందంటే అందుకుకారణం ముఖ్యమంత్రి వైఫల్యమే. జరిగిన ఘటనపై సీబీఐతో విచారణజరిపిస్తామనిచెప్పిన హోంమంత్రిఇంత వరకు ఆపనిచేయలేకపోయారు. నిన్నటికినిన్న కడపజిల్లా మైదుకూరు, చాపాడుమండలం, అయ్యవారిపల్లెలో టీడీపీకిచెంది న మైనారిటీవర్గానికిచెందిన సర్పంచ్ ను వైసీపీవారు రాడ్లతోదాడిచేశారు. టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్అహ్మద్ ఇప్పటికే బాధితసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటామని ధైర్యంచెప్పారు.

దాడిచేసిన వారిపై హత్యాయత్నంకేసులుపెట్టకుండా, పోలీసులు తూతూమం త్రంగా కేసులుపెట్టి ఊరుకున్నారు. ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభు త్వం ముస్లిం సమాజంకోసంచేసిందేమీలేదు. జగన్ రెడ్డి పనితన మంతా మాటలకే పరిమితమవుతోందితప్ప, ఆచరణలోముస్లిం వర్గాలకు ఒరిగిందేమీలేదు. కేవలంకాగితాలకే పరిమితమయ్యేలా బడ్జెట్లో ముస్లింలకు ప్రకటించిన నిధులను పరిమితంచేయకుండా, నేరుగా ఆసొమ్ములో ఆఖరిపైసావరకు ముస్లింమైనారిటీలకు చేరేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరుతున్నాం.

LEAVE A RESPONSE