అమరావతి ఉద్యమానికి తాత్కాలిక విరామం

– ఉగాది తర్వాత మళ్లీ ప్రారంభిస్తాం
– కేంద్రమంత్రులను కలుస్తాం
అమరావతి ఉద్యమాన్ని నడుపుతూనే ఉంటాం
– అమరావతి రాజధాని జేఏసీ సభ్యులు డా. మాదల శ్రీనివాసరావు
: అమరావతి జేఏసీ సభ్యుల సమావేశం

అమరావతి రాజధాని ఐక్యకార్యాచరణ సమితి సభ్యులు, లీగల్,ఆర్ధిక మరియు లోకల్ లీగల్ కమిటీ సభ్యులతో ముఖ్య సమావేశం నిర్వహించారు.గుంటూరు నగరంలో మీడియా సమావేశంలో అమరావతి రాజధాని జేఏసీ సభ్యులు డా. మాదల శ్రీనివాసరావు మాట్లాడుతూ…

భారత దేశ చరిత్రలో అమరావతి రైతు సమాజం చేసిన ఉద్యమం అజరామంగా నిలిచింది.రైతుల పోరాట ఫలితంగా హైకోర్టు చరిత్రమాక తీర్పు ఇచ్చి విజయపథంలో రైతులను నడిపింది.ప్రభుత్వం భూములిచ్చిన రైతుల ఒప్పందాన్ని కాదని వారిని ఇబ్బందులు పెట్టినా రైతులు సంఘటితంగా పోరాటం చేస్తే వారికి గొప్ప విజయం సాధించింది. 29 గ్రామాల్లో ఉన్న కుటుంబాలన్నీ కలసి ఐకమత్యంగా పోరాటం చేసి విజయం సాధించింది. ఉద్యమ పోరాటంలోమహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.

అమరావతి ఉద్యమo ఇంతటితో పరిసమాప్తి కాదు ఉద్యమాన్ని నడుపుతూనే ఉంటాము.రైతులు అమరావతి అభివృద్ధి జరిగే వరకు పోరాటం చేస్తూనే ఉంటారు. అమరావతి ఉద్యమాన్ని గల్లీనుంచి ఢిల్లీ వరకు చేరేటట్టు ఉద్యమాన్ని చేసాము. త్వరలోనే ఢిల్లీలోని కేంద్ర మంత్రులు లను కలసి ఉద్యమాన్ని

చేస్తాము, మంత్రులను కలుస్తాము. ఉద్యమాన్ని ఉగాది పండుగ రోజు మరల ప్రారంభిస్తాము. తాత్కాలికంగా ఉద్యమాన్ని విరమించిన, ఉగాది తర్వాత ప్రారంభిస్తాము. గత రెండు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేయడంతో చాలావరకు ఉద్యమ బాటలు విజ్ఞానం తెలుసుకున్నారు.

కంభంపాటి శీరీష:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ కలసి అమరావతి ఉద్యమాన్ని రాబోయే రోజుల్లో సంఘటితంగా ఉండి ముందుకు వెళ్ళాలని అన్నారు.అమరావతి పోరాటానికి సహకారాన్ని అందించిన మీడియా వారికి ధన్యవాదాలు.రాజ్యాంగం కల్పించిన నిబంధనలు హైకోర్టు తీర్పు ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కల్పించింది.రైతులకు ఇవ్వాల్సిన పెంక్షన్లు, కౌలు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.గత ప్రభుత్వం అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. సభ్యసమాజంలో రైతులకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది.

జేఏసీ సభ్యులు పువ్వాడ సుధాకర్, మార్టిన్ లూథర్ బాబు, షేక్ షాహిద్ జాన్, కంభంపాటి శిరీష ,ఆకుల ఉమామహేశ్వరరావు, కళ్ళం రాజశేఖరరెడ్డి బెల్లంకొండ నరసింహారావు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply