Suryaa.co.in

Andhra Pradesh

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో వికసిత ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌

రాష్ట్రంలో ప్రధాని మోదీ సుడిగాలి పర్యటనలు విజయవంతం అయ్యాయి. జగన్‌ పాలన మీద విసుగెత్తిన ప్రజాగ్రహం విజయవాడ మోదీ రోడ్‌ షోలో బయటపడిరది. మోదీ గారితో చంద్రబాబునాయుడు, పవన్‌కళ్యాణ్‌ గార్ల జోడీ రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు మలుపు. రాష్ట్రంలో ప్రజలు మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్‌ కమిట్మెంట్‌ తమకు దన్నుగా నిలుస్తుందని గ్రహించారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌ ద్యేయంగా వికసిత భారతంలో భాగస్వామ్యం చేయడానికి నరేంద్ర మోదీ సంకల్పం చాటారు. మోదీ గ్యారంటీ, బాబు ష్యూరిటీ, పవన్‌ కమిట్మెంట్‌తో ఈనెల 13న జరిగే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేనల ఎన్డీఏ కూటమి అభ్యర్థుల భారీ విజయం తథ్యం. జూన్‌ 4న ఎన్డీఏ కూటమి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఏర్పాటుతో వికసిత ఆంధ్రప్రదేశ్‌ తథ్యం.

యువత మరియు మహిళల అభివృద్ధితోనే వికసిత్‌ భరత్‌ – వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమని ప్రధాని మోదీ గారు విశ్వసిస్తున్నారు. స్టార్ట్‌ అప్‌, స్టాండ్‌ అప్‌, డిజిటల్‌ ఇండియాతో, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ప్రాధాన్యం ఇస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్న 18 రంగాలలో చేతి వృత్తుల వారికి ‘‘పీఎం విశ్వకర్మ’’, వీధి వ్యాపారులకు ‘‘పీఎం స్వనిధి’’తో మోదీ గారి చేయూత కొనసాగుతుంది. రాష్ట్రంలో గరీబ్‌ కల్యాణ అన్న యోజన 2.70 కోట్ల మంది ప్రజలకు కడుపు నిండా ఆహారం మరో 5 సంవత్సరాలు పొడిగించారు.

పీఎంఏవై కింద కేటాయించిన 25 లక్షల పేదల గృహాలను జగన్‌ గారు పూర్తి చేయడంలో విఫలం అయ్యారు. వాటిని పూర్తి చేసి అర్హులైన పేదలకు అందిస్తాం. ఇంకా రాష్ట్రంలో ఏన్ని ఇళ్లు అవసరమో అన్ని కూడా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ రాబోయే 5 సంవత్సరాలలో పూర్తి చేస్తుంది. జల్‌ జీవన్‌ మిషన్‌ కింద గ్రామాలకు, అమృత్‌ పథకం కింద పట్టణాలకు కొళాయి ద్వారా 100 శాతం గృహాలకు సురక్షిత తాగునీరు అందించడం మోదీ సంకల్పం. దాన్ని రాష్ట్రంలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పూర్తి చేస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలు పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి రూ.6,000 ‘‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’’ కింద, యూరియా బస్తాకు రూ.2000 చొప్పున సబ్సిడీని, ‘‘పీఎం ఫసల్‌ బీమా యోజన కింద పంట నష్టం సహా యాన్ని మోదీ అందిస్తున్నారు. వీటిని మరింత సమర్థవంతంగా రాష్ట్రంలో రాబోయే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ లబ్ధిదారులకు అందిస్తుంది.

జగన్‌ కేంద్ర ప్రభుత్వ పథకాలకు, ప్రాజెక్టులకు మ్యాచింగ్‌ గ్రాంట్లు పెట్టకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అటకెక్కించారు. వికసిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ మ్యాచింగ్‌ గ్రాంట్లను సమకూర్చి వికసిత్‌ భారత్‌లో ఏపీని భాగస్వామ్యం చేస్తుంది. జగన్‌ నిర్వీర్యం చేసిన అమరావతి రాజధానిగా అభివృద్ధి, విశాఖ – చెన్నై, బెంగుళూరు – చెన్నై, బెంగుళూరు – హైదరాబాద్‌ కారిడార్ల పరిధిలోని పారిశ్రామిక నోడల్‌ మరియు కనిగిరి, ఏర్పేడు నిమ్జ్‌లను పూర్తి చేసి ఉత్తరాంధ్ర, కోస్తా మరియు రాయలసీమల పారిశ్రామిక అభివృద్ధిని ‘‘ డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’’ పూర్తి చేసి మూడు ప్రాంతాల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్రంలో కేంద్ర ప్రభు త్వం గత 5 సంవత్సరాలు ఇచ్చిన 5 లక్షల కోట్లకు పైగా గ్రాంట్లు, నిధులలో సింహ భాగం దోచేసి అరకొర మాత్రమే పేదల చేతిలో పెట్టి పేదలకు చేసిన మోసాన్ని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఆపి అర్హులైన పేదలకు లబ్ధి చేకూర్చడానికి జూన్‌ 4న వస్తుంది. జగన్‌ దోచింది కొండంత, ప్రజలకు విదిల్చింది పిసరంత. జగన్‌ పాలనలో ప్రతి కుటుంబం నెత్తిన రూ.10 లక్షల అప్పు భారం పెట్టాడు. జగన్‌ రాష్ట్రం నెత్తిన రూ.13.50 లక్షల కోట్లు అప్పులు పెట్టాడు.

LEAVE A RESPONSE