‘జస్టిస్ ఫర్ సునీత’ పేరిట పోరు మొదలెట్టిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి
– వైఎస్ వివేకా హత్య కేసులో కుమార్తె సునీత న్యాయ పోరాటం
– సునీత పోరాటానికి మద్దతు తెలుపుతున్నానన్న ఆనం
– జస్టిస్ ఫర్ సునీత పేరిట కొత్త పోరును ప్రకటించిన వైనం
నెల్లూరు : టీడీపీ నేత ఆనం వెంకట రమణా రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త పోరాటాన్ని ప్రారంభించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో ఆయన కుమార్తె సునీత న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి తాను మద్దతు తెలుపుతున్నానంటూ రమణా రెడ్డి బుధవారం ప్రకటించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన జస్టిస్ ఫర్ సునీత పేరిట పోరాటాన్ని మొదలుపెట్టారు. ‘ఆనం అనే నేను వైఎస్ సునీత గారి పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నాను. మీరు కూడా చేయండి’ అంటూ ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఓ ఫొటోను విడుదల చేసిన ఆనం… అందులో వివేకానందరెడ్డి బ్యాక్ డ్రాప్‌గా ఓ వైపున సునీత, మరోవైపున సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలను జత చేశారు. ఆ ఫొటోకు జత చేసిన తన కామెంట్ కింద జస్టిస్ ఫర్ సునీత అని ఆయన పేర్కొన్నారు.