Suryaa.co.in

National

ఈడీ, సీబీఐ, ఐటీ మీవే కదా…మోదీ

-బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లు లేరు
-కాంగ్రెస్‌ వస్తే వారికి రిజర్వేషన్‌ ప్రకారం పోస్టులు
-టెంపోలలో డబ్బులొస్తే ఎందుకు పట్టుకోలేదు?
-ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు

హిందు మహిళల మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు పంచుతా… రిజర్వేషన్లు తొలగిస్తా అని మోదీ అంటున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లలో ఎస్సీ, ఎస్టీ అధికారులు లేరు. మేము అధికారంలోకి రాగానే రిజర్వేషన్‌ ప్రకారం వాళ్లకు పోస్టులు కేటాయిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. గాంధీభవనలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తాం. లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తాం. యువతకు 30 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేస్తాం.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోను చూసి మోదీ, అమిత్‌ షాలకు భయం పట్టుకుంది. కాంగ్రెస్‌కు టెంపోలో డబ్బులు వస్తున్నాయంటున్నారు. మోదీ దగ్గర ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలు ఉన్నాయి కదా వాటిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. మంగళ సూత్రాల గురించి, మటన్‌, చికెన్‌ల గురించి మాట్లాడుతూ రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చాం..ఐదు అమలు చేస్తున్నాం. ఎన్నికల కోడ్‌ కాగానే మరో గ్యారంటీ అమలు చేస్తాంమని తెలిపారు. రైతు బంధు, అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన రైతులకు వెంటనే చెల్లిస్తాం. పదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయలేదు.. కాంగ్రెస్‌ కట్టించిన ప్రాజెక్టు లు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE