– నగరాల నేతలు రాంపిళ్ళ, పిల్లా
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిని అత్యధిక మెజారిటీ గెలిపించుకుంటామని నగరాల సామాజిక వర్గ నేతలు తెలిపారు. బీజేపీ ఎన్నికల కార్యాలయంలో నగరాల సంఘ నేతలు రాంపిల్ల శ్రీనివాసరావు, పిల్లా శ్రీను, బాయన శేఖర్ బాబు, బాయన అచ్యుత రావు, గుజ్జారీ అమర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. పశ్చిమానికి సరైన అభ్యర్థిగా సుజనాను భగవంతుడే పంపించారని, నియోజకవర్గ అభివృద్ధికి ఆయన కంకణ బద్ధులయి ఉన్నారని రాంపిల్ల శ్రీను అన్నారు.
మౌలిక వసతుల కల్పన కు సుజనా తన ప్రణాళికను వివరించాక వెస్ట్ కు ఆయనే సరైన నాయకుడిగా తాము గుర్తించామని తెలిపారు. సుజనాను భారీ మెజారిటీ గెలిపించుకునేందుకు నగరాల సామాజిక వర్గం తీర్మానించుకుందని తెలిపారు. సైకో జగన్ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. పిల్లా శ్రీను మాట్లాడుతూ నగరాలకు కళ్యాణ మండపానికి వేయి గజాల స్థలం కోరితే సుజనా అంగీకరించారని, తమ దేవస్థానం అభివృద్ధికి కూడా ఆయన కృషి చేస్తానని చెప్పారనీ ఈ కారణంగా సుజనాని గెలిపించేందుకు తాము అందరం నిర్ణయించుకున్నామని శ్రీను తెలిపారు.