Home » జగన్ పొత్తు కేసుల మాఫీ కోసం

జగన్ పొత్తు కేసుల మాఫీ కోసం

-నా పొత్తు రాష్ట్రం కోసం
-గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తారు
-పోలవరం పూర్తి చేస్తా…నిర్వాసితులకు న్యాయం చేస్తా
-రాష్ట్ర భవిష్యత్ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది
-మే 13న మీరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలి
-జగన్ చేసేవన్నీ చీకటి రాజకీయాలు
-వంద రోజుల్లో గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తా
-ప్రతి పేద కుటుంబానికి పెద్దకొడుగా ఉంటా
-ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలు, పెండింగ్ డీఏ,టీఏ, జీపీఎఫ్ మెరుగైన పీఆర్సీ ఇస్తా
-పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తాం
-ఏలూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

ఏలూరు: మన రాష్ట్ర భవిష్యత్, మన బిడ్డల భవిష్యత్ మార్చుకునేందుకు మరో 3 రోజులే సమయం ఉంది. వైసీపీ అవినీతి, దోపిడి ప్రభుత్వానికి ముగింపు పలికి ప్రజాస్వామ్యానికి, స్చేచ్చకు నాంది పలకాలి. కూటమికి మీరు వేసే ఓటు రాష్ట్ర భవిష్యత్ కోసం వేస్తున్న ఓటు. మీరు వేసే ఓటు రైతులకు గిట్టుబాటు ధర తెస్తుంది, యువతకు ఉద్యోగాలు కల్పిస్తుంది, మహిళలకు రక్షణ కల్పిస్తుంది. నిత్యవసర ధరలు, కరెంట్ చార్జీలు తగ్గిస్తుంది. జగన్ నాసిరకం మద్యంతో మందుబాబుల ఇళ్లు గుళ్ల చేస్తున్నాడు. రూ. 60 ఉన్న క్వాటర్ రూ. 200 కి అమ్ముతూ నాసికరం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రజల రక్తం తాగే జలగ జగన్. మే 13 న మీరు వేసే ఓటుతో తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కావాలి.

జగన్ ఒక సైకో, దోపిడిదారుడు, దొంగ, అరాచకవాది. ఏ కారణం లేకుండా అక్రమ కేసులతో నన్ను జైల్లో పెట్టారు. పోలవరం పూర్తయిఉంటే రాష్ట్రం సశ్యశ్యామలం అయ్యేది. అలాంటి ప్రాజెక్టు ఆపేశారు. నాపై , నాకుటుంబంపై వైసీపీ మూక చేసిన దాడి కంటే రాష్ట్రంపై కొట్టిన దెబ్బకే ఎక్కువ బాధ కలుగుతోంది. వైసీపీ పాలనలో ప్రజల జీవితాలు 30 ఏళ్లు వెనక్కి వెళ్లాయి. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కి కేంద్రంగా మార్చారు. నేను అధికారంలోకి రాగానే 100 రోజుల్లో గంజాయి మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేస్తా. మీ బిడ్డల భవిష్యత్తు కాపాడుతా.

సంపద సృష్టించటం తెలిసిన పార్టీ టీడీపీ. ఆదాయం పెంచి ఆ ఆదాయం ప్రజలకు పంచుతా. మహాశక్తి పథకం కింద ప్రతి మహిళలకు నెలకు రూ.1500 అందజేస్తాం. ఐదేళ్లలో ప్రతి ఆడబిడ్డకు రూ.90 వేలు ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం పథకం కింద స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15000 ఇస్తాం. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం అమలు చేస్తాం. దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. నేను రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నెలకు రూ. 3 వేలు నిరుద్యోగభృతి ఇస్తాం. ప్రతి ఒక్కరికి రూ. 25 లక్షల ఆరోగ్య భీమా ఇస్తాం. చందన్న భీమా 5 లక్షలిస్తాం.

పింఛన్లు ప్రవేశపెట్టిన నాయకుడు నందమూరి తారకరామారావు. 1985లో పింఛన్ ప్రవేశపెట్టాడు. టీడీపీ హయాంలో రూ.200 నుంచి పదిరెట్లు పెంచి రూ.2 వేలు పెంచిన ఘనత టీడీపీది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.4 వేలకు పెంచి మీ ఇంటిదగ్గరకే ఇస్తాం. వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తాం. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు రూ.వెయ్యి అదనంగా కలిపి జూలై‍లో రూ.7 వేలు పింఛన్ ఇంటివద్దకే అందజేస్తాం. జగన్ మాత్రం 2029కి రూ. 500 పెంచుతాడంట. ఎవరు పేదల మనిషో ఆలోచించండి. ప్రతి పేద కుటుంబానికి పెద్దకొడుగా ఉంటా.

జగన్ ….నాఎస్సీలు,ఎస్టీలు,బీసీలు,మైనార్టీలు అంటాడు, ఆయన వాళ్లకు చేసిందేంటి? దళితుల్ని చంపి డోర్ డెలివరి చేసినా చర్యలు లేవు. ముస్లింలకు రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య రద్దు చేశాడు. 4 శాతం రిజర్వేషన్లపై జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లపై న్యాయస్దానాల్లో పోరాటం చేసి రిజర్వేషన్లు కాపాడుతా. షాధీఖానాలు కట్టిన పార్టీ టీడీపీ. ఉర్దూను రెండో భాషగా చేశాం. ఉర్దూయూనివర్సిటీ ఏర్పాటు చేశాం. మక్కా యాత్రకు వెళ్లే వారికి రూ. లక్ష ఆర్దిక సాయం చేస్తాం. రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలిస్తాం. ఎన్.ఆర్సీ, సీఏఏ అంశాల్లో కేంద్రానికి వైసీపీ మద్దతు తెలపింది. జగన్ డిల్లీలో మద్దతు తెలిపి గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తారు. నేను ఏదైనా చెప్పే చేస్తా..బహిరంగంగా చేస్తా. జగన్ చేసేవన్నీ చీకటి రాజకీయాలు. జగన్ పొత్తు కేసుల మాఫీ కోసం నా పొత్తు రాష్ట్రం కోసం. ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకురావటం కోసం.

ప్రజల పట్టాదారు పాసుపుస్తకాలపై సైకో జగన్ ఫోటో ఏంటి?
మీ తాతలు, తల్లితండ్రులు ఇచ్చిన పట్టాదారు పాసుపుస్తకాలపై సైకో జగన్ బొమ్మ ఏంటి? నేను రాగానే ఇవన్నీ చింపి చెత్తబుట్టలో వేసి రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలిస్తా. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారు. మీ భూములు మీ పేరు మీద ఉండవు, పట్టణాల్లో ఉండేవాళ్లు ఈ చట్టంతో మాకేం పని అనుకోవద్దు. మీ ఇంటి పట్టాలు కూడా వేరే వారి పేర్లపై రాసి మీకు తెలియకుండా మీ ఆస్తిని సైకో అమ్ముకుంటాడు. నేను రాగానే ఈ చట్టం రద్దు చేస్తా.

ఉద్యోగుల సంక్షేమం భాద్యత నాది
వైసీపీ డబ్బులిస్తున్నా..తీసుకోకుండా ఉద్యోగులంతా ఎన్డీయేకు ఏకపక్షంగా ఓట్లేశారు. వాడలు, ఊర్లు అన్నీ ఏకమై వైసీపీకి డిఫాజిట్లు రాకుండా చిత్తు చిత్తుగా ఓడించాలి. నేను రాగానే ఉద్యోగులకు ప్రతి నెలా 1 వతేదీనే జీతాలిస్తా. పెండింగ్ డీఏ,టీఏ, జీపీఎఫ్ సాద్యమైనంత త్వరలో ఇస్తా. ఐఆర్ ఇస్తాం, మెరుగైన పీ ఆర్సీ ఇస్తాం. హెల్త్ స్కీం తెస్తాం, 6 నెలల్లో సమస్య పరిష్కరిస్తా. ఉద్యోగులందరికీ తక్కువ ధరకే ఇంటి స్ధలాలిస్తా. పోలీసులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ ని సొమ్ము చేసుకునే అవకాశమిస్తా. రద్దైన అలవెన్సులు ఇస్తా, వీక్లీ ఆఫ్ అమలు చేస్తాం.

హోంగార్డుల రూ. 9 వేలు ఉన్న జీతం రూ. 18 వేలు నేనే చేశా. దాన్ని రూ. 25 వేలకు పెంచుతా. పోలీసులు రిక్రూట్ మెంట్ లో హోంగార్డులకు రిజర్వేషన్లు ఇస్తాం. అంగన్వాడీ, ఆశావర్కర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాం. పొదుపు సంఘాల యానిమేటర్లుకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. గోపాల మిత్ర, ఆరోగ్య మిత్ర, భీమా మిత్రలకు న్యాయం చేస్తాం. జూనియర్ డాక్టర్ల సమస్య పరిస్కరిస్తాం.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తా
ఏలూరులో ప్లాప్ సంస్ధ నిర్మించిన శ్మశాన వాటికను కూల్చేశాడు దుర్మార్గుడు. చంటి నాయకత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. జిల్లాల వారీగా ఏబీ.సీడీ వర్గీకరణ చేస్తానని ఎమ్మార్పీఎస్ నాయకులకు హామీ ఇస్తున్నా. జగన్ పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు, పోలవరం నిర్వాసితులందరికీ ఆర్ .అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తా. వారికి అన్ని విధాల న్యాయం చేస్తాం. నేను రాగానే అన్న క్యాంటీన్ తో పేదలకు అన్నం పెడతా, చంద్రన్న భీమా, విదేశీ విద్య వంటి సంక్షేమ పధకాలు పునరుద్దిస్తాం. మీరంతా ఎన్డీయే కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు నాయుడు కోరారు.

Leave a Reply