లక్షకుపైగా విభిన్నప్రతిభావంతులు పింఛన్లు తొలగించిన దుర్మార్గుడు జగన్

Spread the love

తెలుగుదేశంపార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్రవిభాగ సమావేశం
మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ జాతీయకార్యాలయంలో శుక్రవారం జరిగిన టీడీపీ విభిన్నప్రతిభావంతుల రాష్ట్ర, పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధానకార్యదర్శుల సమావేశం.

రాష్ట్ర విభిన్నప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయసంస్థ మాజీఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి టీడీపీఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

విభిన్నప్రతిభావంతులకు గోనుగుంట్ల కోటేశ్వరరావు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు కొనియాడారు.

లక్షకు పైగా విభిన్నప్రతిభావంతుల పింఛన్లు తొలగించిన దుర్మార్గుడు జగన్. జగన్ ను రాష్ట్రంనుంచి తరిమికొట్టేవరకు విభిన్నప్రతిభావంతులు విశ్రమించకూడదు.

లక్షకుపైగా విభిన్నప్రతిభావంతులు పింఛన్లు తొలగించిన దుర్మార్గుడు జగన్ : గోనుగుంట్ల కోటేశ్వరరావు (టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహకకార్యదర్శి, టీడీపీ విభిన్నప్రతిభావంతుల రాష్ట్రవిభాగం గౌరవఅధ్యక్షులు)

“ తెలుగుదేశంపార్టీ విభిన్నప్రతిభావంతుల రాష్ట్రకార్యవర్గ సమావేశం జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. మనందరిదేవుడు చంద్రబాబు ఆదేశాలతోనే నేడుమనం ఇక్కడసమావేశమయ్యాం. 4ఏళ్లుగా దళితుల్ని, బీసీల్ని, మైనారిటీలను దారుణంగా హింసించిన జగన్ రెడ్డి, వారందరికంటే అధికంగా విభిన్నప్రతిభావంతుల్ని వేధించాడు. 5.60లక్షలమంది విభిన్నప్రతిభావంతులకు చంద్రబాబుపింఛన్లుఇస్తే, వాటిలో లక్షకు పైగా పింఛన్లుతొలగించిన దుర్మార్గుడు జగన్ రెడ్డి.

పింఛన్లు తొలగించారని నాసోద రులు ఎవరూబాధపడకండి. టీడీపీ ప్రభుత్వంరాగానే విభిన్నప్రతిభావంతులు కోల్పో యిన పింఛన్లను వడ్డీతోసహా తిరిగిఇప్పించేలా కాబోయేముఖ్యమంత్రి చంద్రబాబుని ఒప్పిస్తాను.

విభిన్నప్రతిభావంతులు బయటతిరగాలంటే వారికివాహానాలు అవసరమ ని భావించే, చంద్రబాబు పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా వాహనాలు ఇచ్చా రు. హోండా యాక్టివ్ ద్విచక్రవాహానాల్ని చంద్రబాబు విభిన్నప్రతిభావంతులకుఇస్తే, జగన్ నాసిరకంవాహానాల్ని, అదీ తనపార్టీ ఎమ్మెల్యేలుచెప్పినవారికే ఇచ్చాడు.

చంద్ర బాబు విభిన్నప్రతిభావంతులకు రూ.లక్షనుంచి రూ.5లక్షలవరకు స్వయంఉపాధి రుణాలు అందించారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క విభిన్నప్రతిభావంతుడికి పైసారుణం ఇవ్వలేదు. 2.30లక్షల ప్రభుత్వఉద్యోగాలు భర్తీచేస్తానన్న జగన్ ఆహామీని విస్మరించి, విభిన్నప్రతిభావంతులకు కూడా తీరనిఅన్యాయంచేశాడు. జగన్ తనహా మీని అమలుచేసిఉంటే, 8వేలమంది విభిన్నప్రతిభావంతులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చేవి.

టీడీపీప్రభుత్వం వచ్చాక ఇళ్లులేని విభిన్నప్రతిభావంతులకు అన్నివసతు లతోకూడిన ఇళ్లను ఉచితంగా నిర్మించిఇస్తాం. వివాహాప్రోత్సాహక బహుమతి కింద రాష్ట్రంలోని విభిన్నప్రతిభావంతుల్నిఎవరైతే పెళ్లిచేసుకుంటారో, వారికి ఎలాంటి షరతు లులేకుండా, రూ.2లక్షలు ఇవ్వమనిచంద్రబాబుని కోరతాను. జగన్ వివాహ ప్రోత్సాహకంకింద రూ.1.50లక్ష ఇస్తాననిచెప్పి ఒక్కరికీ ఇవ్వకుండా విభిన్న ప్రతిభా వంతుల్ని దారుణంగా మోసగించాడు.

2016దివ్యాంగుల చట్టాన్ని ప్రస్తుతం వారి కళ్ల నీళ్లుతుడిచేలా జగన్ తూతూమంత్రగా అమలుచేశాడు. అలాకాకుండా పకడ్బం దీగా, విభిన్నప్రతిభావంతులకు కచ్చితమైనమేలుజరిగేలా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కట్టుదిట్టంగా అమలుజరిగేవిధంగా అన్నిప్రభుత్వశాఖలకు జీవోలు విడుదల చేయిస్తాం. జీవోలవిడుదలతో పాటు ప్రత్యేకనిధి ఏర్పాటుచేయిస్తాం. ప్యారా స్పోర్ట్స్ కు ప్రత్యేకగుర్తింపు తీసుకొచ్చి, ఆక్రీడల్లోరాణించినవారికి ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశంకల్పిస్తాం.

ఒకకుటుంబంలో ఎందరు విభిన్నప్రతిభావంతులుంటే అందరికీ పింఛన్లు అందిస్తాం. యువగళంపాదయాత్రలో విభిన్నప్రతిభావంతులు లోకేశ్ నుకలిసి తమసమస్యలపై వినతిపత్రంఇచ్చిన సందర్భంలో వారికోసం టీడీపీప్రభుత్వం రూ.5వేలకోట్లు ప్రత్యేకంగా ఖర్చుపెడతామని చెప్పడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతి స్తున్నాం. విభిన్నప్రతిభావంతుల సమస్యల్ని అవగాహన చేసుకోవడానికి, వారిస మస్యల్ని తీర్చడానికి లోకేశ్ ఇచ్చినహామీ గొప్పఅవకాశంగా నిలుస్తుంది.

రాష్ట్రానికి, ప్రజలకు జగన్ చేసిన అన్యాయాన్ని, వంచనను అందరికీ తెలిసేలా చేయడానికి ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో లక్షమంది విభిన్నప్రతిభావంతులతో భారీబహిరంగసభ నిర్వహించబోతున్నాం. విభిన్నప్రతిభావంతులకు పింఛన్, ఉద్యోగాలు, స్వయంసహా యకరుణాలు ఏవీఇవ్వకుండా మోసగించిన జగన్ ను రాష్ట్రంనుంచి తరమి కొట్టే వరకు మనం విశ్రమించకూడదు. ”

విభిన్నప్రతిభావంతుల ప్రచారం ప్రజల్ని తీవ్రంగా ప్రభావితంచేస్తుంది. రాష్ట్రానికి, ప్రజలకు చంద్రబాబు నాయకత్వం చాలాఅవసరమని చాటిచెప్పండి : పంచుమర్తి అనురాధ (టీడీపీ ఎమ్మెల్సీ)

“విభిన్నప్రతిభావంతుల ప్రచారం ప్రజల్నితీవ్రంగా ప్రభావితంచేస్తుంది. చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి, ప్రజలకుజరిగే మేలుఏమిటో చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉంది. టీడీపీ విభిన్నప్రతిభావంతులు విభాగం దీనిలో కీలకభూమిక పోషించాలని కోరుతున్నాను. మాట్లాడితే బటన్ నొక్కాను అంటున్న జగన్, ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఎవరిఖాతాల్లోకి ఎంతమొత్తంవెళ్తుందో, ప్రభుత్వం ఎంతవిడుదలచేస్తుం దో చెప్పడు. అంకెలగారడీ, మాయమాటలతో ప్రజల్ని జగన్ మోసగిస్తున్నాడు.

ల్యాండ్, శాండ్, మైనింగ్, మద్యం మాఫియాలతో రాష్ట్రాన్నిదోచుకోవడం, కుల, మతాల పేరుతో ప్రజల్నివిచ్ఛిన్నంచేయడమే జగన్ నాలుగన్నరేళ్లలో సాధించింది. నాడు-నేడు పేరుతో జగన్ తీసుకున్న తలతిక్కనిర్ణయాలు రాష్ట్రవిద్యారంగానికి శాపంగా మారాయి. 27శాతం మంది విద్యార్థులు ప్రాథమికవిద్యకు దూరమయ్యారు. చెత్తమీద పన్నువేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు. చంద్రబాబు మరలా ముఖ్యమం త్రి కావడం రాష్ట్రానికి, ప్రజలకు చాలాఅవసరం.

ఆయన చూడనిపదవి, చేయని అభివృ ద్ధిలేదు. రాజకీయాలు ఆయనకుకొత్తకాదు. కానీఆయన అవసరం, ఆశీస్సులు రాష్ట్రా నికి, ప్రజలకు అవసరం.

లోకేశ్ యువగళంపాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్యస్పందన వస్తోంది. ఇంటిని, ఇల్లాలిని, తల్లిదండ్రుల్ని వదిలేసి లోకేశ్ ఎవరికోసం ఎండను, వానను లెక్కచేయకుం డా తిరగుగుతున్నాడో మనందరం తెలుసుకోవాలి. విభిన్నప్రతిభావంతులు ఎవరికీ ఎందులోనే తీసిపోరు.”

సమావేశంలో టీడీపీ విభిన్నప్రతిభావంతులవిభాగం రాష్ట్రఅధ్యక్షుడు పీ.జే.సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు మండవవెంకట్రావు, హరీశ్, ప్రధానకార్యదర్శులు జోజిబాబు, శ్రీనివాసులు, దుర్గారావు, ప్రభాకర్, గాంధీ, ఎల్లప్ప అధికారప్రతినిధులు సాయిజనార్ధన్, జాకబ్ ముఖ్యనాయకులు బాలు, శ్రీనివాస్ గౌడ్, మాధవి, చంద్రకళ, లక్ష్మీసునీత, కార్తీక్, మురళి, కడపశ్రీను, వీరారెడ్డి, భాస్కర్ రెడ్డి, అలీ, వెంకట్, శ్రీనివాస్, రాము, వెంకటరెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్ చౌదరి, లక్ష్మణ్, సురేశ్, వాసు, మరియు పార్లమెంట్ అధ్యక్షులు, ప్రధానకార్యదర్శులు పాల్గొన్నారు.

 

Leave a Reply