మోడీ వ్యవసాయ రంగంలో విప్లవాలు సృష్టించారు
బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప
ప్రపంచంలోనే భారత అభివృద్ధి రేటు అద్భుతం: బిజెపి సీనియర్ నేత ఎస్ మల్లారెడ్డి
మోడీ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యే విజయ్ పాల్ రెడ్డి
నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ఉండి ఉండకపోతే కరోనా టైం లో భారత్ అల్ల- కల్లోలం అయ్యేదని ప్రపంచ దేశాలు భావించాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవరి జనవాడే సంగప్ప అన్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న భారత్ కరోనా దెబ్బతో నాశనం అయినట్టే అని ప్రపంచ దేశాలు జోష్యం చెప్పాయని… అయితే నరేంద్ర మోడీ తన దూర దృష్టితో భవిష్యత్తులో తలెత్తే పరిణామాల పరిణామాలను ముందే గుర్తించి కరోనాని అరికట్టారని సంగప్ప చెప్పారు.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం వల్లనే నేడు భారత్ పట్ల ప్రపంచ దేశాలకు విపరీతమైన గౌరవం పెరిగిందని అన్నారు. అంతర్గతంగానూ, విదేశాల్లో భారత్ సమగ్ర అభివృద్ధి కోసం మోడీ గారు ఎంతో దూర దృష్టితో పనిచేస్తున్నారని ఆయన వివరించారు నారాయణఖేడ్ సాయిబాబా ఫంక్షన్ హాల్ లో జరిగిన బిజెపి మోర్చాల సంయుక్త సమ్మేళనంలో సంగప్ప తోపాటు బిజెపి మెదక్ జిల్లా ఇన్చార్జి ఎస్ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. మోడీ గారు వచ్చాక వ్యవసాయ రంగానికి భారీ స్థాయిలో బడ్జెట్ పెంచారని సంగప్ప పేర్కొన్నారు.
ఆరుతడి పంటలకు ఎరువులపై ఒక్క ఎకరానికి రూ. 24 వేల సబ్సిడీ ఇస్తున్నారని రూ. 6, వేల పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అదనం అని… ఏ విధంగా చూసినా రైతుకు ప్రతి ఎకరాకు రూ.30 వేలు నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా సాయం చేస్తున్నారని సంగప్ప వివరించారు. మోడీ గారి పాలనలో భారత దేశంలో జాతీయ రహదారులకు మహర్దశ ఉందని తద్వారా ఆ రహదారులకు ఇరువైపులా 50 కిలోమీటర్ల మేర భూముల రేట్లు విపరీతంగా పెరిగాయని సంగప్ప చెప్పారు.
సంగారెడ్డి – నాందేడ్ జాతీయ రహదారి నారాయణఖేడ్ ఆర్థిక గమనాన్ని మార్చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని ఎస్ మల్లారెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు నిర్మాణం జరుగుతుందని చెప్పారు. విద్యా, వైద్యం, ఆధ్యాత్మిక రంగాల్లో మోడీ పాలనలో భారత్ విప్లవాన్ని చూస్తుందని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ మోడీ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని చెప్పారు. జనసంపర్ కళ్యాణ్ ద్వారా మోడీ అభివృద్ధి ఫలాలను గ్రామాల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమావేశంలో జహీరాబాద్ బిజెపి లోక్సభ కన్వీనర్ డాక్టర్ రవికుమార్ గౌడ్, నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నాయకులు మారుతి రెడ్డి, సాయిరాం, నగరేశం, సంగమేశ్వర్ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. దశాబ్దాలుగా బిజెపి పార్టీతో ఉండి సేవలు చేసిన సీనియర్ కార్యకర్తలను బిజెపి నేతలు సన్మానం చేశారు.