Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల తీర్పును గౌరవిస్తాం

-ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం
-నోటి దురుసు వల్ల ఓడిపోతే సరిదిద్దుకుంటా
-మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

అమరావతి: ప్రజల తీర్పు ను గౌరవిస్తాం. నాకు ఓటు వేసిన 6 లక్షల ప్రజలకి ధన్యవాదాలు. మాకు ఓటు వేసిన వాళ్లపై దాడులు చేస్తున్నారు.. వాళ్ళకి అండగా ఉంటాం. గెలిచిన వాళ్ళు ప్రజలకు మంచి చేయాలి..ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తాం.. ప్రజలకు అందుబాటులో ఉంటాం.

మేమెక్కడికి పారిపోము..నాకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం..మళ్ళీ ఉంటాం. లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం. మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయారు అంటున్నారు.. అదే నిజం అయితే సరిదిద్దుకుంటాం. ఓడిపోతే కృంగిపోయి మూలన కూర్చునే పరిస్థితి ఉండదు.

జగన్ వెంటే ఉంటాం.. ఆయనతోనే నడుస్తాం. మా కార్యకర్తలు, నాయకుల పై దాడులు మంచి పద్దతి కాదు.. ప్రజలు అన్ని చూస్తున్నారు. నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అని చాలెంజ్ చేశాను నిజమే. నా సవాల్ ను అవతల వాళ్ళు ఆనాడు స్వీకరించలేదు. ఆనాడు స్వీకరించినట్లు చెప్పి ఉంటే బాగుండేది.. ఈరోజు ట్రోల్ చేయడం వల్ల ఉపయోగం లేదు.

LEAVE A RESPONSE