Suryaa.co.in

Andhra Pradesh

ఆదోని డిగ్రీ కళాశాలకు ఆఘమేఘాలపై జి.ఓ

– యువగళం దెబ్బకు ప్రభుత్వంలో చలనం

యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ క్షేత్రస్థాయి సమస్యలపై నిలదీస్తుండటంతో అధికారపార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. ఆదోనిలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా డిగ్రీకాలేజి లేక అక్కడి విద్యార్థులు తాము పడుతున్న ఇబ్బందులను లోకేష్ దృష్టికి తెచ్చారు.

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన లోకేష్ 21-4-2023న ఆదోనిలో జరిగిన బహిరంగసభలో అధికారంలోకి వచ్చాక ఆదోనిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుచేస్తానని ప్రకటించారు. సర్కారు తీరుపై ప్రజల్లో నెలకొన్న ఆగ్రహజ్వాలలను పసిగట్టిన ప్రభుత్వం ఆదోనిలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తూ 31-5-2023న ఆగమేఘాలపై జిఓ జారీచేసింది. యువగళం ప్రజల్లో చైతన్యాన్ని రగల్చడమేగాక దున్నుపోతు సర్కారులో సైతం చలనం కలిగిస్తోంది అనడానికి ఈ జిఓనే ఉదాహరణ.

– చైతన్య

LEAVE A RESPONSE