క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది.. కోడి గుడ్డు బ్యాచ్ కి భయపడతామా?

-నువ్వు లండన్ పారిపోయినా నీకు కోడిగుడ్లతో సన్మానం ఖాయం
-సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తావ్
-బాబాయ్ ఆత్మ జగన్ ని వదిలిపెట్టదు
-సొంత తల్లిని, చెల్లిని రోడ్డు మీదకి గెంటేసినోడు కడప బిడ్డని అని బిల్డప్ ఇస్తున్నాడు
-జగన్ కి మైథోమానియా సిండ్రోమ్ జబ్బు
-పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు
సిద్దవటం బహిరంగ సభలో నారా లోకేష్

రాజంపేట రాజసం అదిరిపోయింది. కలియుగ దైవం శ్రీ వారికి 33 వేల సంకీర్తనలు రాసిన అన్నమాచార్యులు జన్మించిన గొప్ప నేల. శివ భక్తుడు శ్రీ భక్త కన్నప్ప జన్మించిన పుణ్య భూమి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం, సౌమ్యనాథస్వామి దేవాలయం ఉన్న ఆధ్యాత్మిక కేంద్రం రాజంపేట.రాజంపేట రాజసానికి గుర్తు సిద్దవటం కోట.ఘన చరిత్ర ఉన్న రాజంపేట గడ్డ పై పాదయాత్ర చెయ్యడం నా అదృష్టం.

యువగళం…మనగళం…ప్రజాబలం.యువగళం దెబ్బకి వైసిపి నాయకుల ప్యాంట్లు తడిసిపోతున్నాయి. కడప గడ్డ పై యువగళం గర్జన చూసి జగన్ ప్యాలస్ లో నాలుగు టీవీలు పగలగొట్టాడు. నా సొంత నా సొంత జిల్లా లో యువగళంకి అంత మంది జనం ఎందుకు వెళ్తున్నారు అని ప్యాలస్ బ్రోకర్ సజ్జలని జగన్ అడిగాడట.వెంటనే ప్యాలస్ బ్రోకర్ ఆవేశంగా కడప జిల్లా నేతలకి కాల్ చేసి అడిగితే ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు, ఒక్క రూపాయి విడుదల కాలేదు, అన్ని శిలాఫలకాల స్టేజ్ లోనే ఉన్నాయి. నాలుగేళ్లలో మనం పీకింది ఏమి లేదు. అందుకే అంత జనం వస్తున్నారు అని వైసిపి ఎమ్మెల్యేలు చెప్పారట.

అప్పుడు జగన్ ఆవేశంతో ఊగిపోయి ఎలా అయినా యువగళాన్ని అడ్డుకోవాలని కోడి గుడ్డు అటాక్ ప్లాన్ చేసాడు. క్లైమోర్ మైన్లకే భయపడని ఫ్యామిలీ మాది కోడి గుడ్డు బ్యాచ్ కి భయపడతామా? ఏదో ఒక వెధవ పని చెయ్యడం దానికి ఒక కథ అల్లడం జగన్ కి అలవాటు.సెల్ఫీ ఇవ్వనందుకే కోడిగుడ్డు విసిరారు అని ఒక పోలీసు అధికారి ప్రెస్ మీట్ పెడతాడు. అయ్యా అబద్దాలు చెప్పడంలో మీరు జగన్ దగ్గర ట్రైనింగ్ తీసుకోండి.నేను ప్రతి రోజూ వెయ్యి మందికి సెల్ఫీలు ఇస్తాను, అదంతా లైవ్ లో వస్తుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.ఇంకో మంచి స్టోరీ ఏదైనా చెప్పండి అని ఆ పోలీసు అధికారికి నా సలహా.

నా మీద కోడిగుడ్డు వేయించి ఎక్కడికి పారిపోతావ్ జగన్. ఏపీలోనే గా ఉండాల్సింది. ఒక వేళ నువ్వు లండన్ పారిపోయినా నీకు కోడిగుడ్ల తో సన్మానం ఖాయం.నా దారి రహదారి. అడ్డొస్తే అడ్రస్ లేకుండా చేస్తా. మళ్లీ చెబుతున్నా సాగనిస్తే పాదయాత్ర..అడ్డుకుంటే దండయాత్ర. భయం నా బయోడేటా లో లేదు, బ్లూ సైకోలకు బాదుడే బాదుడు.

మోసానికి మానవ రూపం జగన్. అందుకే మోసగాడు జగన్ అని పేరు పెట్టా. ఈ మధ్య జరిగిన మూడు ఘటనల గురించి మీకు చెబుతాను. మొదటిది సిపిఎస్ మోసం. ప్రతి సారి చర్చలు అంటూ నమ్మించడం ఉద్యోగుల గొంతు కొయ్యడం. 3 లక్షల మంది ఉద్యోగులు నష్టపోయేలా ఇప్పుడు మళ్లీ జిపిఎస్ అంటున్నాడు. పైగా ఇచ్చిన హామీ నుండి తప్పించుకోవడానికి ,జగన్ ఒక అవగాహన లేని వ్యక్తి అని ఏకంగా ప్యాలస్ బ్రోకర్ సజ్జల ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసాడు.

నేను ఒక్కటే అడుగుతున్నా మాట తప్పను, మడమ తిప్పను అని బిల్డప్ ఇచ్చావ్ కదా సిపిఎస్ ఎప్పుడు రద్దు చేస్తావ్? రెండోవది పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు. ఎన్నికల ముందు ఇళ్లు కట్టించి ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఇళ్లు కట్టలేదు అని సుమారు లక్ష మందికి ఇళ్ల పట్టాలు రద్దు చేసాడు. మరో 3 లక్షల మంది పట్టాలు వెనక్కి తీసుకోవడానికి స్కెచ్ వేసాడు. ఈయనకి పేదలు అంటే ఎంత కక్షో నిన్నే చూసా. ఈయన దేశంలోనే ధనిక సీఎం, ఊరికో ప్యాలస్. కానీ సొంత జిల్లా కడప లో పేదలకు సెంటు స్థలం ఎక్కడ ఇచ్చాడో తెలుసా కనీసం వెళ్ళడానికి రోడ్డు కూడా లేని కొండ మీద.

మూడోవది మార్గదర్శి అంశం. మోసగాడు జగన్ ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అందరి కంపెనీలు నీ కంపెనీల్లా సూట్ కేసు కంపెనీలు కాదు.అసలు మార్గదర్శి మీద ఫిర్యాదే లేదు. వీళ్లు విచారణ అంటూ హడావిడి చేస్తారు.అందులో కూడా ఎంత విచిత్రం అంటే విచారణ పూర్తి అయిన తరువాత మంగళవారం రాత్రి సిఐడి అడిషనల్ ఎస్పీ రవికుమార్ గారు మీడియా తో మాట్లాడుతూ ఎండీ శైలజా కిరణ్ గారు విచారణ కు సహకరించారు అని చెప్పారు. తాడేపల్లి ప్యాలస్ నుండి కోటింగ్ పడే సరికి స్వరం మారింది 14 గంటల్లోనే ఆయన కూడా మాట మార్చాడు విచారణ కు సహకరించలేదు అని మళ్లీ ప్రెస్ మీట్ పెట్టారు. కక్ష సాధింపు కి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్.

మోసగాడు జగన్ సొంత బాబాయ్ ని లేపేసి బురద మా పైన వేసాడు. కడప గడ్డ పై నిలబడి అడుగుతున్నా హూ కిల్డ్ బాబాయ్…హూ కిల్డ్ బాబాయ్? బాబాయ్ ని లేపేసిన కేసులో అవినాష్ అరెస్ట్ అయ్యాడు. ఆ విషయం బయటకి రాకుండా డ్రామాలు ఆడారు. జగన్ అండ్ అవినాష్ కిల్డ్ బాబాయ్. నీ సొంత జిల్లా ప్రజలు చెబుతున్నారు అది జగనాసుర రక్త చరిత్ర అని.

బాబాయ్ ఆత్మ జగన్ ని వదిలిపెట్టదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు.చెల్లి ఉసురు తగులుతుంది. సొంత తల్లిని, చెల్లిని రోడ్డు మీదకి గెంటేసినోడు కడప బిడ్డని అని బిల్డప్ ఇస్తున్నాడు. వర్ధంతికి కి, జయంతి కి తప్ప ఎప్పుడైనా ఉమ్మడి కడప జిల్లా గుర్తొచ్చిందా?కడప ఉక్కు ఫ్యాక్టరీ ఎం అయ్యింది? అన్నమయ్య బాధితులకు న్యాయం ఎప్పుడు చేస్తావ్? నేను సవాల్ చేస్తున్నా టిడిపి హయాంలో ఉమ్మడి కడప అభివృద్ధి, వైసిపి హయాంలో అభివృద్ధి పై చర్చకు నేను సిద్ధం. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు జగన్. జగన్ కడప బిడ్డ కాదు ఉమ్మడి కడప జిల్లా కి పట్టిన శని.

జగన్ కి ఒక జబ్బు ఉంది. మైథోమానియా సిండ్రోమ్(mythomania syndrome) తో జగన్ బాధపడుతున్నాడు. ఈ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అబద్దాలు చెప్పడం ఈ జబ్బు లక్షణం. మైథోమానియా సిండ్రోమ్ వలనే జగన్ నేను పేదవాడ్ని అంటూ పదే పదే అబద్దం చెబుతున్నాడు.లక్ష కోట్లు ఆస్తి ఉన్నా, లక్ష రూపాయల చెప్పులు వేసుకొని తిరుగుతున్నా, వెయ్యి రూపాయల వాటర్ బాటిల్ తాగుతున్నా పేదవాడ్ని అంటూ అబద్దం చెబుతాడు.

బెంగుళూరు లో ప్యాలస్, హైదరాబాద్ లో ప్యాలస్, తాడేపల్లి లో ప్యాలస్, ఇడుపులపాయలో ప్యాలస్, ఇప్పుడు వైజాగ్ లో మరో ప్యాలస్ కడుతున్నాడు. ఇన్ని ప్యాలస్ లు ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు.సిమెంట్ కంపెనీలు, పవర్ ప్లాంట్లు, సొంత టివి, ఛానల్ ఉన్నా పేదవాడ్ని అని చెబుతాడు. మైథోమానియా సిండ్రోమ్ వలన జగన్ అబద్దాలు చెబుతూ అబద్దంలోనే బ్రతికేస్తాడు.

మోసగాడు జగన్ కట్టింగ్ అండ్ ఫిట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో చెబుతా. మోసగాడు జగన్ కి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి బ్లూ బటన్. రెండోవది రెడ్ బటన్. బ్లూ బటన్ నొక్కగానే మీ అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. రెడ్ బటన్ నొక్కగానే మీ అకౌంట్ నుండి 100 రూపాయలు పోతుంది.

అది ఎలాగో మీకు చెబుతా. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు బాదుడే బాదుడు, ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు బాదుడే బాదుడు, ఇంటి పన్ను బాదుడే బాదుడు, చెత్త పన్ను బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు, నిత్యావసర సరుకుల ధరలు బాదుడే బాదుడు. మీకు ఇంకో ప్రమాదం కూడా ఉంది త్వరలోనే వాలంటీర్ వాసు మీ ఇంటికి వస్తాడు. మీరు పీల్చే గాలిపై కూడా పన్నేస్తాడు. మోసగాడు జగన్ కి దమ్ముంటే ఇంటికి స్టిక్కర్ కాదు కరెంట్ బిల్లుకి, బస్సు టికెట్ మీద, పెట్రోల్, డీజిల్ బిల్లు మీద, చెత్త పన్ను మీద, ఇంటి పన్ను మీదా స్టిక్కర్ వెయ్యాలి.

మోసగాడు జగన్ కట్టింగ్ మాస్టర్. అది ఎలాగో చెబుతాను.అన్న క్యాంటిన్ కట్, పండుగ కానుక కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న భీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్, ఫీజు రీయింబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్.100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం ఈ మోసగాడు జగన్.

యువగళం లో కష్టాలు చూసాను…కన్నీళ్లు తుడుస్తాను.భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో మ్యానిఫెస్టో విడుదల చేసాం.మోసగాడు జగన్ మహిళల్ని మోసం చేసాడు, మద్యపాన నిషేదం, ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి, 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ అని మోసం చేసాడు. నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల పెంపు తో బ్రతుకు భారం గా మారిన మహిళల కష్టాలు నేను చూసాను. నా అక్క, చెల్లెమ్మల కన్నీళ్లు తుడిచే బాధ్యత నాది.

ప్రజల కష్టాలు తెలుసుకున్నాకే చంద్రబాబునాయుడు మహానాడులో మినీ మ్యానిఫెస్టో ప్రకటించారు. మహాశక్తి పథకం కింద… ఆడబిడ్డ నిధి:- 18 ఏళ్లు నిండిన మహిళలకు – నెలకు రూ.1500 అంటే ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు. 2) తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు 3) దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం.

ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం. జగన్ మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచితే..మీ అన్న చంద్రన్న టికెట్ లేకుండా చెయ్యబోతున్నారు.ఉద్యోగాలు ఇస్తానని యువతను చీట్ చేసాడు జగన్. 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, ప్రతి ఏడాది 6,500 కానిస్టేబుల్ పోస్టులు, మెగా డిఎస్సీ అని ఒక్క హామీ నిలబెట్టుకోలేదు.

యువగళాన్ని విన్నాం. ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి ద్వారా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.నిరుద్యోగ యువతకు యువగళం నిధి కింద నెలకు రూ.3000 ఇస్తాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఏడాది నోటిఫికేషన్ ఇస్తాం. అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేస్తాం. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు దొరకని దిక్కుమాలిన పరిస్థితి జగన్ పాలనలో ఉంది. రైతు రాజ్యం తెస్తానని రైతులు లేని రాజ్యం తెచ్చాడు. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపి నంబర్ 3 గా ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2 గా ఉంది.

రైతుల బాధలు చూసాం. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించి గిట్టుబాటు ధర కల్పిస్తాం.పోలీసులకు 4 సరెండర్స్, 8 టిఎ, డీఏలు పెండింగ్ పెట్టాడు. ఆఖరికి జిపిఎఫ్ డబ్బులు కూడా లేపేశారు. మెడికల్ బిల్లులు కూడా ఇవ్వడం లేదు.

పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడు. నేను ప్రతి రోజూ మాట్లాడుతుంటే భయపడి కొంత బకాయి తీర్చాడు. ఇంకా రావాల్సింది చాలా ఉంది.ఆఖరికి పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేని చెత్త ప్రభుత్వం ఇది. బీసీలు పడుతున్న కష్టాలు నేను చూసాను. 26 వేల అక్రమ కేసులు, నిధులు, కుర్చీలు లేని కార్పొరేషన్లు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపకులాల వారీగా నిధులు, బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం.

డాక్టర్ సుధాకర్ దగ్గర నుండి డాక్టర్ అచ్చెన్న వరకూ జగన్ పాలనలో దళితుల్ని ఎలా చంపారో చూసారు.ళితుల్ని చంపడానికి జగన్ వైసిపి నాయకులకు స్పెషల్ లైసెన్స్ ఇచ్చాడు. 27 దళిత సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే దళితులను వేధించిన వారిని కఠినంగా శిక్షిస్తాం. జగన్ రద్దు చేసిన 27 దళిత సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం.

జగన్ పాలనలో మైనార్టీలను చిత్ర హింసలకు గురిచేసాడు. అబ్దుల్ సలాం, కరీముల్లా, ఇబ్రహీం, మిస్బా, హాజిరా. ఇలా ఎంతో మంది బాధితులు.మైనార్టీలకు ఉన్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసాడు. దుల్హన్, విదేశీ విద్య, రంజాన్ తోఫా, ఇమామ్, మౌజమ్ లకు గౌరవ వేతనం, మసీదుల అభివృద్ధి కి నిధులు కూడా ఇవ్వడం లేదు.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చెయ్యడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తాం.

రెడ్డి సోదరులు కూడా ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో మీరు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు చేసి జగన్ ని గెలిపించుకున్నారు.ఇప్పుడు మీకు కనీస గౌరవం అయినా ఉందా. నాడు-నేడు అన్ని సామాజిక వర్గాలకు సమాన గౌరవం ఇచ్చింది ఒక్క టిడిపి మాత్రమే.

2019 ఎన్నికల్లో రాజంపేట రూపురేఖలు మార్చేస్తారని మేడా మల్లిఖార్జున రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారు.నియోజకవర్గంలో జరిగిన భూకబ్జాలు, ప్రజలకు జరిగిన అన్యాయం, సొంత పార్టీ కార్యకర్తలే వేసిన కర పత్రాలు గురించి తెలుసుకున్న తరువాత స్టేట్ లో ఇంత చేతగాని ఎమ్మెల్యే ఎవరూ ఉండరు అని తేలిపోయింది.

అందుకే పేరు మార్చాను అయన మేడా మల్లిఖార్జున్ కాదు చేతగాని మల్లిఖార్జున్.చేతగాని మల్లిఖార్జున్ బినామీల పేరుతో వేల ఎకరాలు కొట్టేసాడు.చేతగాని మల్లిఖార్జున్, జెడ్పి ఛైర్మెన్ అమర్నాధ్ రెడ్డి లు కలిసి భారీగా భూకబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ, పేదల భూములు కబ్జా చేస్తున్నారు. బాధితులు అంతా ఫిర్యాదు చెయ్యడంతో కలెక్టర్ ఆర్డీఓ పై చర్యలు తీసుకున్నారు. మరి భూములు కొట్టేసిన వారిపై చర్యలు ఉండవా?

చేతగాని మల్లిఖార్జున్, జెడ్పి ఛైర్మెన్ అమర్నాథ్ రెడ్డి కలిసి రూ.15 కోట్లు జెడ్పి సొమ్ము కాజేసారు. జగన్ ని ఆదర్శంగా తీసుకోని ఊరుకో ప్యాలస్ కట్టుకున్నారు ఈ ఇద్దరు.హైదరాబాదులో ఒక ప్యాలెస్, బెంగుళూరులో మరో ప్యాలెస్, తిరుపతిలో ఒక ప్యాలెస్, రాజంపేటలో మరో ప్యాలెస్, స్వగ్రామం చెన్నాయగారి పల్లెలో మరో ప్యాలెస్ మొత్తం ఐదు ప్యాలెస్ లను కట్టుకొని జగన్ ను మించిపోయాడు.

నందలూరు తన సొంత మండలమైన చెన్నాయగారి పల్లె చుట్టూ సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమిని తన చిన్నాన్న మేడా భాస్కర్ రెడ్డితో కలిసి కబ్జా చేసాడు చేతగాని మల్లిఖార్జున్.
ఎమ్మెల్యే ని మించి జడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి తమ స్వగ్రామమైన రాజింపేట మండలం ఆకేపాడులో మూడు స్మశానాలున్న గుట్టనే ఆక్రమించి అక్కడ మైసూర్ ప్యాలెస్ లాంటి ఇల్లును కట్టి చుట్టూ వందలాది ఎకరాలు భూకబ్జాలకు పాల్పడ్డాడు.

ఒకవైపు ఎమ్మెల్యే చేతగాని మల్లిఖార్జున్ మరోవైపు జడ్పీ చైర్మన్ అమర్నాథరెడ్డి తమ స్వార్ధ ప్రయోజనాల కోసం రాజంపేటను సర్వనాశనం చేశారు. నాలుగేళ్లలో మీరు ఏం సాధించారు అని చేతగాని మల్లిఖార్జున్ ని అడిగితే ఎం చెప్పాడో తెలుసా?రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా అడ్డుకోవడం, మెడికల్ కాలేజీ రాకుండా అడ్డుకోవడం, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చెయ్యడం, ప్రభుత్వ భూములు కబ్జా చెయ్యడం, మున్సిపాలిటీకి వంద కోట్లు తెస్తానని హామీ ఇచ్చి రూపాయి తేకపోవడం అని సమాధానం చెప్పాడట.

చేతగాని మల్లిఖార్జున్ స్వార్థం వలనే అన్నమయ్య, పించా డ్యాంలు కొట్టుకుపోయాయి. 38 మంది చనిపోయారు, పశువులు, వందల కొద్ది ఇళ్లు అన్ని కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. బాధితులను ఆదుకోలేని చెత్త ప్రభుత్వం ఇది. ఇసుకని దోచేసి టిప్పర్లలో బెంగుళూరు,చెన్నై, హైదరాబాద్ ఎక్స్ పోర్ట్ చేసి కోట్లు గడిస్తున్నాడు చేతగాని మల్లిఖార్జున్.చేతగాని మల్లిఖార్జున్ ని కొన్ని అంశాల పై ప్రశ్నిస్తున్నాను.రాజంపేటను జిల్లా కేంద్రం కాకుండా ఎందుకు అడ్డుకున్నారు? మెడికల్ కాలేజీ ఎందుకు రాలేదు? అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడానికి మీరు కారణం కాదా? ప్రభుత్వ భూములు కబ్జా చేసింది నిజం కాదా? గెలిస్తే 100 కోట్లు తెచ్చి మున్సిపాలిటీ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆ నిధులు ఎక్కడ?

రాజంపేటలోని ఆరు మండలాలను ఆరుగురు కుటుంబ సబ్యులకు వాటాలు వేసి పంచేసాడు చేతగాని మల్లిఖార్జున్.టి సుండుపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు ప్రభుత్వ స్థలాలైన కొండలు, గుట్టలు చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటున్నాడు. ఒక దళిత మహిళ తోటపై కన్ను వేసి మామిడి చెట్లను కూడా నరికించి, వారి కుటుంబ సభ్యులను బెదిరించాడు.

నందలూరు మండలంలో ఎమ్మెల్యే చిన్నాన్న అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఆఖరికి మాట వినకపోతే అధికారుల పై దాడులు, ట్రాన్స్ ఫర్లు చేయిస్తున్నాడు.సిద్దవటం మండలంలో ఒక మహిళ ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడింది. పోలీసులు ప్రశ్నిస్తే ఎమ్మెల్యే మరదలని అని చెప్పింది.

చేతగాని మల్లిఖార్జున్ అనుచరులు భూకబ్జాలు, ఇసుక దోపిడీ, దాడులు, ఆఖరికి దళితుల స్మశానాలు కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు.వీళ్ల అరాచకాలు పరాకాష్టకు చేరాయి, ఎంపీటీసీ అభ్యర్థి గా పోటీ చేసిన జింకా శివ నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోతే అతని ఇంట్లో లిక్కర్ బాటిల్స్ పెట్టి అరెస్ట్ చేసారు.

రాజంపేటను అభివృద్ధి చేసింది టిడిపి సాగు, తాగునీటి ప్రాజెక్టులు, పేదలకు ఇళ్లు, రోడ్లు అభివృద్ధి చేసింది టిడిపి. టిడిపి హయాంలో రూ.1500 కోట్లు ఖర్చు చేసి రాజంపేట నియోజకవర్గంని అభివృద్ది చేసాం.ఒంటిమిట్టను ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా అభివృద్ధి చేసింది టిడిపి. 100 కోట్లు ఖర్చు చేసాం. ఒంటిమిట్ట చెరువుకు సోమశిల జలాలు అందించడానికి 30 కోట్లు ఖర్చు చేసాం.

మీరు పాలిచ్చే ఆవుని వద్దనుకుని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు.జగన్ రాజంపేటకు అనేక హామీలు ఇచ్చారు. ఒక అసమర్ధ సీఎం వలన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది. 38 మంది చనిపోయారు. ఎంతో మంది ఇళ్లు కోల్పోయారు. రోడ్డున పడ్డారు. ఇప్పటికీ గుడారాల్లో ఉంటున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు బాధితులకు రెండు నెలల్లో ఇళ్లు కట్టిస్తా అన్నాడు. 18 నెలలు అయ్యింది, ఒక్క ఇటుక పెట్టలేదు.

ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ని జిల్లా చేస్తామని చెప్పి రాజంపేట ప్రజలను మోసం చేసాడు.రాజంపేటకు మెడికల్ కాలేజీ ఇస్తామని మోసం చేసాడు.నందలూరు లో ఆల్విన్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తానని మోసం చేసాడు. నందులూరు లో రైల్వే లోకో షెడ్ ఓపెన్ చేయిస్తానని మోసం చేసాడు.జరికోన ప్రాజెక్ట్ నుండి సుండుపల్లి మండలానికి త్రాగు, సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చాడు. రాజంపేట నుండి వీరబల్లి, సుండుపల్లి వెళ్ళే రోడ్ల విస్తరణ చేస్తానని హామీ ఇచ్చాడు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
అన్నమయ్య ప్రాజెక్టు బాధితులను టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకుంటుంది.

వాటర్ గ్రిడ్ పధకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం.సోమశిల బ్యాక్ వాటర్ వలన ఇబ్బంది పడుతున్న గ్రామాల ప్రజలకు న్యాయం చేస్తాం.రాజంపేట అండర్ బ్రిడ్జ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తిచేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం. మార్కెట్ యార్డ్ ని అభివృద్ధి చేస్తాం. నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకుంటాం. పట్టు, కలర్ సబ్సిడీలు అందిస్తాం. జీఎస్టీ భారం లేకుండా చేస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మాచుపల్లి బ్రిడ్జ్ రెండేళ్ల లో పూర్తి చేస్తాం.టిడిపి కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలి పెట్టను. రాజంపేటలో ఉన్నా రష్యా పారిపోయినా పట్టుకొచ్చి లోపలేస్తా.