– మహా జనానికి మరదలు పిల్ల అయిన రోజా
– నీకు పార్టీ లో సీటు ఇచ్చే పరిస్థితే లేదు
– జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు
టీడీపీ జనసేన కూటమి సీట్ల ప్రకటన చూసి వైసీపీ ప్రభుత్వ నికి భయం పట్టుకుంది. సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో గ్రావెల్, మట్టి, మాఫియా చేసుకోవడానికే అంబటి కి మంత్రి పదవి ఇచ్చారు. తన శాఖ ఏమిటో తనకే తెలియని అంబటి కి జనసేన కూటమి గురించి మాట్లాడే అర్హత ఉందా?
వైసీపీ ప్రభుత్వం ప్రకృతి సంపదను నిలువునా దోచుకుంటున్నారు.నియోజకవర్గం లో ఓట్లు అడగడానికి వెళితే ఆడవాళ్లు చెప్పులతో కొడతారు. కులం పేరు చెప్పుకుని లబ్ది పొందిన నీకు పార్టీ లో సీటు ఇచ్చే పరిస్థితే లేదు.2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమి వైపు ప్రజలు ఉన్నారు.అంబటి రాంబాబూ.. రాజకీయ నేతగా విజ్ఞతతో మాట్లాడటం నేర్చుకో.
మహా జనానికి మరదలు పిల్ల అయిన రోజా కూడా మా పార్టీ గురించి మాట్లాడటం చూస్తే విడ్డూరంగా ఉంది. చెల్లని వేణుగోపాల్ నీ నియోజకవర్గ లో వద్దంటే ఎక్కడో పోటీ చేయడానికి వెళ్లిన నువ్వు కూడా మాట్లాడతావా? మా అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేయమంటే అది చేయడానికి జనసేన కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ శిఖా బాలు, జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లికా, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, చింత శివ, గోపిశెట్టి సాయి,భాష, యర్రంశెట్టి సాయి పాల్గొన్నారు