Suryaa.co.in

Andhra Pradesh

ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

ప్రత్తిపాడు: కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.

అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్‌ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురితో పాటు అదే మార్గంలో అటువైపుగా వస్తున్న మరో వ్యక్తిపైకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో నలుగురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు ఇచ్చిన సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు ఎస్సై పవన్‌కుమార్‌ వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

LEAVE A RESPONSE