Suryaa.co.in

Andhra Pradesh

ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గజ్జల వెంకటలక్ష్మి

అమ‌రావ‌తి:- అంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్‌గా గజ్జల వెంకటలక్ష్మిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వం జీవో ఉత్తర్వులు జారీ చేసింది. గజ్జల వెంకట లక్ష్మి ఇప్పటికే మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్నారు. ఇప్పటి వరకు కమిషన్ చైర్ పర్సన్‌గా పనిచేసిన వాసిరెడ్డి పద్మ ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీగా ఉన్న ఛైర్ పర్సన్ పదవికి గజ్జల వెంకట లక్ష్మిని నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా పూర్తి స్థాయి అధికారాలతో గజ్జల వెంకటలక్ష్మి కొనసాగనున్నారు.

LEAVE A RESPONSE