కేసీఆర్ ఋణం తీర్చుకోవాలి
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్,రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్
మంత్రి హరీష్ రావు
మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మీరు కొత్త చరిత్ర సృష్టిస్తారు.మిషన్ భగీరథ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ చేత ప్రారంభం చేయించుకున్నము.అదే మిషన్ భగీరథ ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిచింది. దేశానికి రోల్ మోడల్ గజ్వేల్ నియోజక వర్గం.ఇంటిగ్రేటెడ్ మార్కెట్,పునరుద్ధరణ చేసిన అడవులు,మిషన్ భగీరథ కార్యక్రమం చూసేందుకు ఇవాళ దేశంలో అనేక మంది ఇక్కడ వస్తున్నారు.
ఇవాళ రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసుకున్నాము.గజ్వేల్ కు రైల్వే స్టేషన్ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది. ఎన్నో రైల్వే స్టేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ హాస్పిటల్ లు ఇప్పుడు గజ్వెల్ లో నిర్మాణం చేసుకున్నాము.దానితో ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లడం లేదు. ఇవాళ కూడవెళ్లి వాగు,హల్దీ వాగు నిండు కుండల్లా నీళ్లు ఎప్పుడు ఉంటున్నాయి. ఇవాళ 3500 కోట్ల రూపాయల వడ్లు పండిస్తున్నారు. నాడు నీళ్ల కోసం ఖాళీ బిందలతో ధర్నాలు చేసేవారు. గజ్వేల్ కు ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. ఇవాళ ఇచ్చి చూపారు.
ఏ కార్యక్రమం అయిన గజ్వేల్ లో చేసి ఇవాళ రాష్ట్రం అంత అమలు చేశారు. దయచేసి ఇంత బాగా చేసిన కేసీఆర్ ఋణం తీర్చుకోవాలి అంటే రాష్ట్రంలో అతి ఎక్కువ మెజారిటీ తో గెలిపించాలని కోరుతున్న. ఇవాళ అనేక గ్రామాల్లో మూకుమ్మడిగా మా ఓటు కారు కు,కేసీఆర్ కు అంటూ ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. రానున్న 35 రోజులు బాగా కష్టపడి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం. గజ్వేల్ లో ఎవరు గెలిస్తే రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది.గజ్వేల్ లో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్,రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్.