Suryaa.co.in

Andhra Pradesh

స్వచ్ఛ ఆంధ్రా కార్పోరేషన్ ఎండిగా గంధం చంద్రుడు

విజయవాడ :సీనియర్ ఐఎఎస్ అధికారి గంధం చంద్రుడు శుక్రవారం ఎపి స్వచ్ఛ ఆంధ్రా కార్పోరేషన్ ఎండిగా బాధ్యతలు స్వీకరించారు. స్టడీ లీవ్ తరువాత పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న చంద్రుడుకు ప్రభుత్వం తాజాగా ఈ బాధ్యతలు అప్పగించింది. 2010 బ్యాచ్ కు చెందిన గంధం చంద్రుడు ఇప్పటి వరకు పలు కీలక బాధ్యతలను పోషించారు. గిరిజన సంక్షేమ శాఖ కమీషనర్ గా, అనంతపురం కలెక్టర్ గా ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలు ప్రత్యేకతను ఆపాదించుకున్నాయి. స్వచ్ఛ ఆంధ్రా కార్పోరేషన్ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా గంధం చంద్రుడు అన్నారు

LEAVE A RESPONSE