Suryaa.co.in

Andhra Pradesh Crime News

హిజ్రాపై అత్యాచారం

వైయస్సార్ కడప జిల్లా : ఓ హిజ్రా (60) పై పదిహేను మంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత హిజ్రా, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందుల పట్టణంలోని కదిరి రహదారిలో ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రాత్రి ఏడు గంటల సమయంలో బాధితురాలితో పాటు మరో హిజ్రా(35)ఉన్నారు.

ఈ క్రమంలో పులివెందుల నుంచి అనంతపురం జిల్లా కదిరికి రెండు కార్లలో వెళుతున్న పదిహేను మంది గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. ముందుగా 35 ఏళ్ల వయసున్న హిజ్రాపై అత్యాచారయత్నం చేయగా తప్పించుకుంది. అక్కడే ఉన్న మరో హిజ్రాపై వారంతా అత్యాచారం చేసి గాయపరిచారని బాధితులు తెలిపారు.

వెంటనే ఆ విషయాన్ని దిశ యాప్ లో ఫిర్యాదు చేయగా వారి ఆదేశాలతో స్థానిక పోలీసులు స్పందిం చారు. విషయం తెలుసుకున్న తోటి హిజ్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని అత్యా చారానికి పాల్పడిన వారిలో ఓ నిందితుడిని గుర్తించి పోలీసులకు అప్పగించారు.

ఈ విషయమై ఎస్.ఐ. గోపినాథ్ రెడ్డిని వివరణ కోరగా హిజ్రాల ఫిర్యారు మేరకు దర్యాప్తు చేపట్టామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.విచారణలో వాస్తవాలు తెలుస్తాయని ఎస్.ఐ అన్నారు..

LEAVE A RESPONSE