Suryaa.co.in

Andhra Pradesh

పోలవరం ప్రాజెక్ట్ లో గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యామ్ పనులకు శ్రీకారం

పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యామ్ పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీ పీ ఏ ), మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

గ్యాప్ 1 రాక్ఫిల్ డ్యామ్ ను సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ, పీ పీ ఏ అధికారులు, ఎం ఏఐ ఆల్ ప్రతినిధులు మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ పనులు వేగవంతం చేసి ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పూజా కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు సీఈ కే నరసింహమూర్తి, ఎస్ఈ రెడ్డి రామచంద్రరావు, ఈఈ కే బాలకృష్ణ, పీ పీ ఏ సీఈ రమేష్ కుమార్, ఎం ఈ ఐ ఎల్ జాయింట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు అంగర, జీ ఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE