– ఢిల్లీ, మహారాష్ట్ర లో రిజర్వేషన్లు లేవా? అది రద్దు చేసే దమ్ముందా?
– మీరు కూటమి లో ఉన్న ప్రభుత్వం దగ్గర రిజర్వేషన్లు తొలగించి ఇక్కడికి రండి
– ఉదయం లేస్తే మతం..ఎన్నికలస్తే మతం
– బండి.. ఆ మాటను కేంద్రంతో చెప్పించండి
– 24 గంటల్లో బీసీ రిజర్వేషన్లు అమలుచేస్తాం
– 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో ముస్లింలను కాదని రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా?
– బీసీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్
– బీజేపీని కడిగేసిన పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం
ఢిల్లీ: బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లు రాష్ట్రమే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు కేంద్ర మంత్రి గా రాష్ట్రమే చేసుకోవచ్చు అని చెప్తే ఒక నిమిషంలో అమలు చేసి చూపిస్తాం. బలహీన వర్గాల శాఖ మంత్రి గా కేంద్ర మంత్రి బండి సంజయ్ రిక్వెస్ట్ చేస్తున్న. మీరు రాష్ట్రమే బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని అన్న మాటలకు అనుగుణంగా, కేంద్రం నుండి ఒక మాట ఇస్తే 24 గంటల్లో మా ప్రభుత్వం దానిని అమలు చేసి చూపెడుతుంది.
ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎంపీలు అరవింద్ , లక్ష్మణ్,ఈటెల రాజేందర్ తెలంగాణ నుండి ఉన్నారు. ముస్లింలకు సంబంధించి రిజర్వేషన్లు వర్తించద్దు అని బీజేపీ అనుకుంటే, మీరు అమలు చేస్తున్న ఈడబ్ల్యుఎస్ 10 శాతం రిజర్వేషన్లలో ముస్లింలు కూడా ఉన్నారు కదా? మీరే 10 శాతం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో ముస్లింలను కాదని రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా ?దాని గురించి బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు?
మీరు ఆంధ్రప్రదేశ్ లో టిడిపి తో పొత్తు ఉన్న ప్రభుత్వంలో, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి..దానిని తీసివేసే దమ్ము ఉందా?ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మీరు కూటమి లో ఉన్నారు. రంజాన్ కి కొద్ది సమయం ఉద్యోగులకు రిలీఫ్ ఇస్తే, ఆంధ్రపదేశ్ తెలంగాణ లో జీవో ఇస్తే బండి సంజయ్ మాట్లాడుతున్నారు.
నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 ముస్లిం అల్పదాయక వర్గాల మైనార్టీలకు ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చారు. దీనికి బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఢిల్లీ, మహారాష్ట్ర లో రిజర్వేషన్లు లేవా? అది రద్దు చేసే దమ్ముందా? దూదేకుల ఇతర ముస్లిం వర్గాలు బీసీ లలోకి కొత్తగా వచ్చాయా?42 శాతం రిజర్వేషన్ల లో ఎబిసిడీ పాపులేషన్ ప్రకారం డివైడ్ అవుతాయి.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మేము బిల్లు పెట్టినప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాం.. ఈప్రశ్నలు అన్ని శాసన సభలో చర్చ జరిగాయి.ఏకగ్రీవంగా జాతీయ పార్టీగా మద్దతు ఇచ్చారు.కేంద్రం స్టాండ్ ఒక విధంగా రాష్ట్రం స్టాండ్ ఒక విధంగా ఉండదు. మీ ఎమ్మెల్యేలు శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చారు. అసెంబ్లీ ప్రొసీజర్ ఇస్తాం..కేంద్ర పార్టీ అనుమతి ఇవ్వకుండా జరగలేదు. బీజేపీ ఆర్గ్యుమెంట్స్ డ్రామా. మీరు కూటమి లో ఉన్న ప్రభుత్వం దగ్గర రిజర్వేషన్లు తొలగించి ఇక్కడికి రండి.
బండి సంజయ్,కిషన్ రెడ్డి.. మీరు కేంద్ర మంత్రులుగా బీసీ ప్రధాని అని చెప్పుకునే నరేంద్ర మోడీ e ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు దేశం మొత్తం మీద 13 శాతం ఉన్న వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఇదేం పద్ధతి అందులో మైనార్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయా లేదా? అప్పుడు ఎట్లా ఆమోదం తెలిపారు?
ముక్కు నేలకు రాయాలి.మీరు హిందువుల గురించి మాట్లాడతారు
ఆర్థిక పరమైన అంశాల మేరకే రిజర్వేషన్లు ఇసున్నారు. మతపరమైన అంశాలు లేవు.వాటి ప్రకారమే రిజర్వేషన్లు చేయాల్ని చెప్తున్నాం. తెలంగాణ లో ఉన్న 139 కులాల కు ఎబిసిడి గా ఇవ్వబడ్డాయి.
ఆ ప్రకారమే రిజర్వేషన్లు వస్తాయి. 10 శాతం వాళ్ళకే రిజర్వేషన్లు ఇస్తున్నారు.బాధ్యత గల కేంద్రమంత్రి మాట్లాడే మాటల.? ఉదయం లేస్తే మతం..ఎన్నికలస్తే మతం. మేము ఉదయం లేస్తే గుడికి వెళ్తాం. మొక్కుతాం.
రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల బిడ్డలం. చీము నెత్తురు ఉంది. తెలంగాణ డీఎన్ఏ లో ఉందా అని గతంలో కూడా అడిగాం. గతంలో కూడా తెలంగాణ కు సంబంధించి తలుపులు వేసి తెలంగాణ ఎత్తుకుపోయారు అని చెప్పారు. తలుపులు తీసి తెలంగాణ శాసన సభలో చర్చ చేసి బిల్లు ఆమోదం చేశాం..దీనికి మద్దతు ఇవ్వండి. మీ చిత్తశుద్ధి నిలబెట్టుకోండి.
మీకు హృదయ పూర్వక విజ్ఞప్తి చేస్తున్న. బండి సంజయ్,ఈటెల రాజేందర్,లక్ష్మణ్, ఆర్వీంద్ కుమార్ మీ బాధ్యత. మతం- పేరు వాయిదా వేసే ప్రయత్నం చేస్తున్నారా ? ఈడబ్ల్యూఎస్ లో ముస్లింల లను చేర్చలేదా? ఇందిరా సహనీ సహేతుకమైన లెక్కలు కావాలి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహేతుకంగా లక్ష మంది ఉద్యోగులు క్షేత్ర స్థాయిలో చేసిన లెక్కలు మా దగ్గర ఉన్నాయి.
సి ఎస్ ద్వారా ప్లానింగ్ డిపార్లెంట్ బీసీ కమిషన్ ఆధ్వర్యంలో డెడికేటెడ్ కమిషన్ ద్వారా అప్రూవల్ అయి శాసన సభ లో చట్టం చేసిన తరువాత కూడా శాంటిటి అడిగితే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసినట్టే. శాసన సభలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు పెంచడానికి మీరు మద్దతు ఇచ్చారు.
చాలా రాష్ట్రాల్లో 50 శాతం రిజర్వేషన్ల కాబ్ దాటింది. తెలంగాణ లో ఇంకా 50 శాతం దాటలేదు. బీసీ లకోసం 50 శాతం కాబ్ దాటుతుంది. తెలంగాణ కోసం సకల జనులు కొట్లాడినా మాదిరి బీసీ ల రిజర్వేషన్ల కోసం కొట్లడుతం. తెలంగాణ సాధన స్ఫూర్తి ..తెలంగాణ బీసీ రిజర్వేషన్లు పెంపు దేశానికి రోల్ మోడల్.