Suryaa.co.in

Andhra Pradesh Entertainment

ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ సాయం

గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు  తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ.10 లక్షలను ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు తమవంతు సాయం చేస్తున్నట్లు పేర్కొంది.
ఇలా ఇంతకుముందు ‘గీతా ఆర్ట్స్‌2’ బ‍్యానర్‌లో వచ్చిన ‘గీతా గోవిందం’ సినిమా ఫ్రాఫిట్‌ను కేరళ వరద బాధితులకు సహాయంగా అందించారు. మరోవైపు గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన ‘గని’ చిత్రం ఈ క్రిస్‌మస్‌కి థియేటర్లలో సందడి చేయనుంది.

LEAVE A RESPONSE