– లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ… 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా
– అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్దమైన ప్రభుత్వం
– ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
– దీనికోసం రాజకీయ పార్టీలు, మేధావులతో కలిసి పోరాడుతాం
– శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
– మీరు ఈ దోపిడికీ అనుకూలమా?వ్యతిరేకమా?
– బీజేపీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి
: ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ
– రూ.5 వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థలకు జీవీఎంసీ కౌన్సిల్ లో రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్, మేయర్ కి వినతి పత్రం సమర్పించిన వైయస్సార్సీపీ నేతలు.
– శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ విశాఖజిల్లా అధ్యక్షుడు కే కే రాజు, శాసనమండలి సభ్యులు కుంభా రవిబాబు, వైయస్సార్సీపీ కార్పొరేటర్లు, పలువురు వైయస్సార్సీపీ నేతలు.
– అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, విశాఖ జిల్లా అధ్యక్షుడు కే కే రాజు
విశాఖపట్నం: లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ…54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యాసంస్థలకు ఈ భూమని అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్దమైన ప్రభుత్వ తీరును శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. వైయస్సార్సీపీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి విశాఖ జీవీఎంసీ కమిషనర్, మేయర్ కి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే… రాజకీయ పార్టీలు, మేధావులతో కలిసి పోరాడుతామని చెప్పారు. మరోవైపు కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న బీజేపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలో రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఎంపీ భరత్ చేస్తున్న భూదోపిడీకి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్దమైంది. దీనికోసం ఒక కార్యాచరణ రూపొందించాం.
అందులో బాగంగానే ఇవాళ విశాఖ జీవీఎంసీ మేయర్, కమిషనర్, ప్రిన్సిపల్ సెట్రకరీకి వినతిపత్రం సమర్పించి.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న భూదోపిడీని ఆపాలని విజ్ఞప్తి చేశాం. గీతం విద్యాసంస్థల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని.. వారికి రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదనను ఈ నెల 30 వ తేదీన జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ అజెండాలో పెట్టొద్దని కోరాం. నగరంలో మేధావులు సైతం ఈ భూదోపిడీని వ్యతిరేకిస్తున్నారు.
రేపు వైయస్సార్సీపీ నేతలంతా గీతం సంస్థల కబ్జాలో ఉన్న 54 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలిస్తాం. మరలా 30 వ తేదీన జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ భూమి రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం. ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటే తప్ప… పోరాటం ఆగదు. మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తాం.
అధికార పార్టీ ఎంపీ భూ కబ్జాపై కూటమి భాగస్వామ్యులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన తమ పార్టీల వైఖరేంటో చెప్పాలి. ఈ దోపిడీని సమర్ధిస్తున్నారా? లేదా దీన్ని తప్పని వ్యతిరేకిస్తారా? తమ వైఖరేంటో స్పష్టం చేయాలి. స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ అంటే విశాఖలో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు దోచుకోవడంలో స్పీడా? మీకు చేతనైతే విశాఖను అభివృద్ధి చేసి చూపించండి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ నీతి ప్రవచనాలు చెపుతుంటారు. రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమిని దోచుకోవడం నీతివంతమైన పాలనా? ఇది థర్మమా? సమాధానం చెప్పాలి.
ఓ సెంటో, ఓ పది గజాలో పేదల ఆక్రమణలో ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడం పరిపాటి. కానీ ఏకంగా ముఖ్యమంత్రి బంధువులు, స్థానిక ఎంపీ అయి ఉండి ఏకంగా 54 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయమనడం, ప్రభుత్వం దానికి సిగ్గు లేకుండా ఆమోదించడం ధర్మమా? ఇంత భారీ దోపిడీయా? విజ్ఞులైన విశాఖ ప్రజలు, మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా వామపక్ష పార్టీలతో మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఎలా భేషజాలు లేవు.
భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీ నాయకులు, జీవీఎంసీ కౌన్సిల్ లో ఉన్న ఆ పార్టీ సభ్యులతో మాట్లాడుతాం. మీరు ఈ భూకబ్జాను సమర్ధిస్తున్నారా? లేదా అని ప్రశ్నిస్తున్నాం. వాళ్లు కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యులు కావాలనుకుంటే ప్రజలే వారికి తగిన జవాబు చెబుతారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఈ రాష్ట్రం మీద, విశాఖపట్నం మీద, ప్రజల మీద అభిమానం, ప్రేమ ఉంటే రెగ్యులరైజ్ ప్రక్రియను నిలిపివేయాలి.