ఆయన గురించి రాద్దామంటే
కళైమామణి గుర్తురావడంలే..
జెమిని సంస్థ పేరూ
కదిలించడం లేదు..
అసలు ఆయనలోని నటుడే
కనిపించడం లేదు..
మన సావిత్రి కన్నీరు..
ఆ సావిత్రిని అతగాడు
పెట్టిన బాధలు..
కంట నీటి తెర కప్పేసి
అక్షరాలు మసకేసి
గతించిపోయిన కాలం
ముందుకు సాగని కలం..!
జెమిని గణేశన్..
తమిళ తెరను
ఎంజీఆర్…శివాజీ
ఏలుతుండగా
అందంతో మెరిసిన
మరో గణేశన్..
నటుడుగా మంచోడు..
వ్యక్తిగా ముంచేటోడు!
బొమ్మలాంటి సావిత్రికే
బొమ్మ చూపించేసి..
అంతటి మహానటినే
తన నటనతో ముంచేసి..!
కోమాలోని సావిత్రి రూపం..
ఇతగాడి పాపం..
ఆపై విధి శాపం..!
తమిళ సినిమా వేలుపు..
వయసు మళ్ళినా
ఆగని వలపు..
పడుతూ తుళ్ళి తుళ్ళి..
పెళ్లి మీద పెళ్లి…
సావిత్రి నంబరే మూడు..
ఎనభైలో నాలుగు..!
ఈ బిళహరి చేతిలో
సావిత్రి బ్రతుకు చితిలో..
ఆమె వైభోగం..
ఇతగాడి వల్లనే
పోయింది సగం..
ముసలాడైపోయినా
తగని..తగ్గని ఆడపిచ్చి..
నలుగురు భామలకు
నాధుడీ
భామనే సత్యభామనే విశ్వనాధుడు…!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286