– దేశాన్ని అస్థిరపర్చేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు
– కేవలం 24 లక్షల మందికే రుణమాఫీ
– కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యంపై బీజేపీ సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగసభలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె.లక్ష్మణ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని అటకెక్కించింది. కాంగ్రెస్ పాలనకు ఏడాది గడిచింది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. రైతు భరోసా ఇవ్వలేదు. రైతుబంధు ఆపేశారు. 74 లక్షల మంది రైతులు అప్పు తీసుకుంటే కేవలం 24 లక్షల మందికే రుణమాఫీ చేశారు.
దేశంలో ఎక్కడలేనివిధంగా రుణమాఫీ చేశామంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నరు. రాష్ట్రంలో రూ. 17 వేల కోట్ల మేర రుణమాఫీ జరిగిందని.. భవిష్యత్తులో మరో రూ. 14 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని మరో మంత్రి పొంతనలేని మాటలు చెబుతున్నాడు. ఫేక్ ప్రచారాలు, అబద్దాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి.
భారత్ కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు అమెరికాలో కుట్రలు పన్నుతుంటే వారికి రాహుల్ గాంధీ వంతపాడుతున్నారు. భారతదేశంలో అన్నింటా అగ్రగామిగా మారుతోందని, నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడుగా మారుతున్నారనే అక్కసుతో రాహుల్ గాంధీ పార్లమెంటు కార్యకాలాపాలను స్తంభింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా ఆపత్కాలంలో కొవిడ్ బాధితులకు ఊరట కల్పించిన సమయంలో కొవాగ్జిన్ కు వ్యతిరేకంగా జార్జ్ సోరోస్ సంస్థలతో ాటు రాహుల్ ప్రచారం చేశారు. విదేశీ శక్తుల కుట్రలకు ఊతమిచ్చేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. జార్జ్ సోరోస్ -రాహుల్ గాంధీ శరీరాలు వేరు కావచ్చు.. వారిద్దరి ఆత్మ ఒక్కటే.
దేశాన్ని అస్థిరపర్చేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది. బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ, రిజర్వేషన్లు మారుస్తుందంటూ పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఫేక్ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది. తెలంగాణలో మిణుకుమిణుకుమంటున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది.
మూసీ, హైడ్రా, లఘచర్ల భూసేకరణ పేరుతో ప్రజలను పీడిస్తున్న వారికి, రేవంత్ రెడ్డి కి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజలకు అండగా నిలబడేలా.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెవవేర్చేదాకా బిజెపి పోరాటం చేస్తుంది.