నీరు ఎంతో విలువైనవని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద మంత్రి ఇంకుడు గుంత పునరుద్ధరణ పనులను చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన జీవితాలను సుసంపన్నం చేసే నిధి భూగర్భ జలాలు అని పేర్కొన్నారు.ఒక వైపు ప్రపంచ జనాభా పెరిగిపోతుండగా, మరో వైపు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భజలాల పెంపు కోసం ప్రతి ఒక్కరు నీటి వృధాను అరికట్టడంతో పాటు నీటి పొదుపు ను అలవర్చుకోవాలి పిలుపునిచ్చారు. ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశం తో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బన్సీలాల్ పేట కార్పొరేటర్ హేమలత, వాటర్ వర్క్స్ CGM ప్రభు, GM రమణా రెడ్డి, పలువురు మేనేజర్లు పాల్గొన్నారు.