Suryaa.co.in

Andhra Pradesh

గిద్దలూరు త్రిబుల్ ఐటీ విద్యార్థి ప్రతిభ

ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన త్రిబుల్ ఐటీ ఫైనల్ ఇయర్ విద్యార్థి పంట దత్తాత్రేయ రెడ్డి.. తన మేధస్సుతో ఓ అద్భుతమైన సోషల్ మీడియా యాప్ తయారు చేశాడు.తనలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ , గ్లాస్ డైరీ అనే పేరుమీద సోషల్ మీడియా యాప్ రూపకల్పన చేశాడు.ఈ యాప్ లో ఓ వ్యక్తి తన వ్యక్తిగత విషయాలతో కూడుకున్న సమాచారాన్ని 16 వేల అక్షరాలతో ఒక పేజీని తయారు చేసుకోవచ్చని అలా ఎన్ని పేజీలైనా తయారు చేసుకొని భద్రపరుచుకోవచ్చు అని తెలిపాడు.
తమ ఫోటోలు భద్రపరచుకోవడమే కాకుండా.. ఆడియో , వాయిస్ మెసేజ్ లను 10 నిమిషాల వరకు యాప్ లో భద్రపరుచుకోవచ్చు . ఇలా ఎన్ని సార్లైనా పది నిమిషాల తో కూడుకున్న ఆడియో వాయిస్ మెసేజ్ లను భద్రపరుచుకోవచ్చు అని చెప్పాడు.
అలానే మీ వ్యక్తిగత సమాచారం అవతలివారికి తెలియకుండా మీ భావాలను ఎదుటివారితో పంచుకోవచ్చు. ఎదుటి వారి భావాలు కూడా తెలుసుకోవడంతో పాటు వారి సలహాలు సూచనలు స్వీకరించడం చేయవచ్చని తెలిపాడు. ఫేస్ బుక్, ట్విట్టర్,ఇంస్టాగ్రామ్ లా పోలి ఉండే ఈ యాప్ తో మీ వ్యక్తిగత సమాచారం ఎవరికీ తెలిసే అవకాశం లేదని.. ఈ యాప్ ఉపయోగించేందుకు ఈమెయిల్ ఐడి ఉంటే చాలు అని, అది కూడా అవతలి వారికి తెలిసే అవకాశం లేదు అని దత్తాత్రేయ రెడ్డి తెలిపాడు.

LEAVE A RESPONSE