Home » అలా అయితే ఎయిర్‌టెల్ ఎందుకు? బీఎస్‌ఎన్నేలే వాడండి..దూరదర్శనే చూడండి!

అలా అయితే ఎయిర్‌టెల్ ఎందుకు? బీఎస్‌ఎన్నేలే వాడండి..దూరదర్శనే చూడండి!

ప్రైవేటు వద్దు. ప్రభుత్వమే ముద్దు. ఇదీ ఇప్పుడు అవకాశవాదుల నయా స్లోగన్. సరే.. అలాగే కానిద్దాం. వారి వాదన ఎందుకు కాదనాలి? వారి ముచ్చట ఎందుకు వద్దనాలి? మరి అన్నీ ప్రభుత్వమే చేయాలనే వాళ్లు.. ముందు తామూ ప్రభుత్వ దారిలో నడవాలి కదా? ఇన్ని ప్రైవేటు చానెళ్లు ఎందుకూ.. ఎంచక్కా దూరదర్శనే చూడవచ్చుగా? నారాయణ, చైతన్య లాంటి ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివించడమెందుకు? హాయిగా ఫ్రీగా గవర్నరమెంటు స్కూల్లోనే వేయొచ్చు కదా? రోగమొస్తే అపోలో, యశోద ఎందుకు? సర్కారీ ఆసుపత్రుల్లో ట్రీట్‌మెంటు తీసుకోవచ్చుగా? మరి ఈ వాదనా నిజమే కదా? ఇలాంటి అడ్డగోలు వాదన వినిపించే మేధావులకు ఇది అంకితం. ప్రైవేటు వాదులూ.. ఇది చదవండి!
ప్రైవేటీకరణ వద్దు అనేవాళ్ళు ముందు Airtel, వొడాఫోనే,Jio నుంచి BSNL లోకి మారండి, దూరదర్శన్ మాత్రమే చూడండి. ,గవర్నమెంట్ ఆసుపత్రికి, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కుల్స్ కు మాత్రమే పంపండి.
ప్రతీదీ ప్రభుత్వరంగ మే చేయాలనడం, ప్రజల సొమ్ముతో కొంతమంది సోమరులను పోషించడాన్ని సమర్థించడమే. ఒక నాలుగుదశాబ్దాలు అంతా ప్రభుత్వరంగమే చేయాలన్నారు, చేసేలా చూశారు, దేశాన్ని వెనక్కి నెట్టేశారు, ఐనా, ఇదే రైట్, ఇదే రైటని, మాదే ఘనత అని భుజకీర్తులు తగిలించుకున్నారు. చంకలు గుద్దుకున్నారు…
కొన్నాళ్లకు, వారే మళ్ళీ.. ప్రైవేటైజేషనే పరమౌషదమని.. ప్రైవేటీకరణ, సరళీకరణ, ప్రపంచీకరణ ల ద్వారా నూతన ఆర్థిక సంస్కరణల ద్వారానే, దేశం అభివృద్ది చెందుతుందనీ, పీవీ,సింగులు ఊదరగొట్టారు.ఫలితాలు చూడమన్నారు,అభివృద్ధి కాంచమన్నారు, మనల్నిచప్పట్లు కొట్టమన్నారు.
అపుడు, ఇపుడూ గొర్రెల్లాగా తలూపమన్నారు. జేజేలు కొట్టుకున్నారు. ఇప్పుడేమో, మోడే అన్నీ ప్రైవేటు చేస్తున్నాడంటారు. ఎందుకుపుడతారో తెలీదు, ఎందుకు బతుకుతారో తెలీదు.
వద్దురా నాయనా..కాంగ్రేసు కమ్యూనిస్టు ఆలోచన!

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply