నెహ్రు చేసిన నేరం!

చాలామంది జవహర్‌లాల్ నెహ్రు అంటే దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడనుకుంటారు. గొప్ప విదేశాంగ విధానం ఉన్న పాలనాదక్షుడనుకుంటారు. ఆయన పాటించిన విదే శాంగ విధానమే ఇప్పటికీ పరమోతృష్ఠమయినదనుకుంటారు. కానీ.. అదే నెహ్రు.. మన దేశంలో పుట్టి.. మనదేశంలోనే 70 శాతం ప్రవహించే సింధు నదీ నీటిపై, పాకిస్తాన్‌కు పెత్తనం అప్పగించారని ఎంతమందికి తెలుసు? అసలు ప్రపంచంలో ఏ దేశాల మధ్య జరగని ఇలాంటి మతిలేని ఒప్పందాన్ని ఇదే నెహ్రు పాక్‌తో చేసుకున్నారని ఎంతమందికి తెలుసు? మధ్యలో యుద్ధం జరిగితే ఆ ఒప్పందం రద్దవుతుందని రాసుకున్నా, ఇప్పటికీ దానినే అమలుచేస్తున్నారని ఎంతమందికి తెలుసు? ఏంటీ… నమ్మడం లేదా? ఇది చదవండి!
అసలు ఈ సింధూ నదీ నీటి ఒప్పందం ఎంత గొప్పదంటే… ప్రపంచంలో నెహ్రు తప్ప ఇంకెవరూ ఇలాంటి ఒప్పందం చేయలేరు. భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రమే ఇంకో రాష్ట్రానికి నీళ్లు ఇవ్వాలంటే నానా ఇబ్బందులు పెడుతుంటే నెహ్రూ గారు భారత దేశంలో పుట్టి 70% భారత్ లో ప్రవహించి పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలిసే సింధు నది మరియు దాని ఉప నదులైన జీలం చినాబ్ సట్లెజ్ రావి బియాస్ అనే ఈ నదులలో సింధు నది తో సహా జీలం చీనాబ్ నదుల లోని 80% నీటి మీద పాకిస్తాన్ కి హక్కు కల్పించారు.
పైగా భారత దేశం ఈ నదుల పైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న, పాకిస్తాన్ అనుమతితోనే ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణ లో నే చేయాలి. అసలు ఇలాంటి ఒప్పందం ప్రపంచంలో ఏ దేశము ఎవరితో చేసి వుండరు. కానీ మన గొప్ప ప్రధాని నెహ్రు … భారత ప్రయోజనాలను తుంగలో తొక్కి , పాకిస్తాన్ కు ఈ ప్రయోజనాలు కల్పించారు, ఎందుకో ఆ దేవుడికే తెలియాలి?
ఇప్పుడు మోడీ వచ్చాక.. సింధు నది మీద వున్న పెండింగ్ ప్రాజెక్టులు మొదలుపెట్టి, కనీసం మన కోటా అయిన ఆ 20% నీళ్లయినా వాడుకోవడానికి శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు.
దీనికి పాకిస్తాన్, సింధు నది ఒప్పందాన్ని చూపించి అడ్డుకోవాలని చూస్తుంది. ఒకప్పుడు సింధు నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టు, పాకిస్తానీ ప్రతినిధులు చూసినతరువాత గానీ నిర్మించేవాళ్ళు. కాదు . ఇప్పుడు మోడి వచ్చాక ఆ పద్ధతి మార్చారు . మీకు ఇబ్బందిగా ఉంటె దిక్కున్నచోట చెప్పుకోండి అని మొఖం మీదే చెప్పేసారు . ఇప్పుడు ఏంచేయాలో తోచక చస్తున్నారు పాకిస్థాన్ వాళ్ళు .
అసలు ఆశ్చర్యకరమైన విశయం ఏమిటంటే.. మన దేశ ప్రధాని, మనదేశం నష్టపోయే నిర్ణయం తీసుకుని అమలు చెయ్యడం! పైగా యుద్దం వచ్చినప్పుడు ఈ ఒప్పందం రద్దు చేసుకోగల అవకాశం ఉండి కూడా, ఇన్ని యుద్ధాల తరువాత కూడా సంవత్సరాల పాటు ఈ ఒప్పందాన్ని కొనసాగించారు.
అసలు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినప్పుడు కూడా, ఇక్కడి ప్రజలకి ఇంత ద్రోహం చేయలేదు. కానీ ఒక్క కుటుంబం మనల్ని సర్వనాశనం చేసి, ఫైగా మనతోనే గొప్ప నాయకులుగా కీర్తింపబడుతున్నారంటే.. మన భారతీయులలోనే ఎదో లోపం ఉందనుకుంటా !
ఇప్పటికైనా ఈ నెహ్రు కుటుంబం అనే కాన్సర్ నుండి బయటపడదామా? దేశ ఆధునికతకు నెహ్రు దూరదృష్టి అనేవాళ్ళు .. ఇప్పుడు ఏమైనా చెబుతారా?
పేరు కోసం ఒకరు.. అధికారంకోసం ఒకరు.. పాకిస్తాన్ తో లాలూచిపడిన పర్యవసానం!

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply