– సాయిబాబా – హైందవానికి విపత్తు – 5
సాయిబాబా ఆలయాలు మనకు తెలిసినవే. ఆలయం ఎవరికి నిర్మితం అవుతుంది? దేవతకు ఆలయం ఉంటుంది; సనాతనంలో దైవానికి మాత్రమే ఆలయం ఉంటుంది; ఒక ఆలయం నిర్మాణం అన్నది ఆగమశాస్త్రం ప్రకారం ఉంటుంది.
సాయిబాబా ఆలయాలు ఏ ఆగమ విధుల ప్రకారం నిర్మితమయ్యాయి? సాయిబాబా ఆలయాలు ఏ ఆగమ విధుల ప్రకారమూ లేవు. ఆగమ విధుల ప్రకారం లేనిది ఆలయం అవదు.
కొందఱు విపరీత మనస్కులు, అల్పులు అసాంప్రదాయికంగా, అశాస్త్రీయంగా, అవైదికంగా చేసిన మహాపరాధాలు సాయి బాబా ఆలయాలు. తెలివి, తెలివిడి లేకపోవడం వల్లా, మూర్ఖత్వం వల్లా సాయిబాబా ఆలయాలు వెలుస్తూ వైదిక ద్రోహం జరుగుతోంది.
సాయిబాబా అని అనబడుతున్న వ్యక్తి ఒక ముస్లీమ్ అన్న నిజం అందరికీ తెలిసిందే. ఆ ముస్లీమ్కు వైదిక పూజలు, అర్చనలు, హారతులు, అష్టోత్తరాలు, అభిషేకాలు జరపడం దారుణం, ఘోరం, వికారం. ఆలోచిద్దాం… సాయిబాబాకు హైందవ లేదా వైదిక సంప్రదాయాలకు, ఆలయాలకు ఏ సంబంధమూ లేదు. ఒక వికృత పరిణామంగా సాయిబాబా వైదికంలో కలిసింది.
విజయవాడలో (?) ఒక సాయిబాబా ఆలయం అట. దానికి ఆంజనేయస్వామి క్షేత్రపాలకుడట. ఇంతకంటే హైందవానికి, ఆలయ వ్యవస్థకు పతనావస్థ ఇంకోటి ఉండదు. సాయిబాబా విషయంగా హిందువులు ఎంత పతనం అయ్యారో ఈ పరిణామం తెలియజేస్తోంది. సాయిబాబా అన్న ఒక అహైందవ శక్తికి హైందవ ఆలయం ఏమిటి? ఆ వికృతానికి ఆంజనేయస్వామిని క్షేత్రపాలకుణ్ణి చెయ్యడం ఏమిటి? విజ్ఞత, బుద్ధి, సిగ్గులేని నీచత్వం ఇది.
వైదికం లేదా సనాతనం లేదా హైందవంలో కలిసిన అతి భయంకరమైన కుళ్లు సాయిబాబా! ఈ సత్యాన్ని ప్రతి హిందువూ బుద్ధితో, చదువుతో, విజ్ఞతతో తెలుసుకోవాలి. సాయిబాబా హైందవంలో కలిసిన ఘోరమైన, అవమానకరమైన కుళ్లు!!
అజ్ఞానంతోనూ, అతి తెలివితోనూ, వికృతంగానూ పెంచుకోబడిన సాయిబాబా అన్న అవాంఛనీయమైన మనోభావం ఇవాళ హైందవానికి పెను రోగం అయిపోయింది. కుళ్లు ఆహారం తింటే కడుపులో ఏం జరుగుతుందో ‘సాయిబాబా – కుళ్లు’ వల్ల హైందవంలో అదే జరుగుతోంది. ఆ ‘సాయిబాబా కుళ్లు’ హైందవం లేదా వైదికానికి జరిగిన తీవ్రమైన హాని.
ఎవరు ఎవరికైనా భక్తులు కావచ్చు. ఏ బలహీనతలవల్లో, ఏ మూర్ఖత్వం వల్లో, ఏ అజ్ఞానం వల్లో వచ్చే ఎవరి మనోభావాలు వారివి. కానీ అజ్ఞానం వల్లా, గుడ్డితనం వల్లా, అమాయకత్వం వల్లా, బుద్ధి వక్రత వల్లా, మానసిక రోగం వల్లా సాయిబాబా ఒక కుళ్లుగా వైదికంలో కలవడం అతి దారుణం. జరిగిన ధర్మ ద్రోహం, వైదిక ద్రోహం అది.
ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఎవరినీ నొప్పించే ఉద్దేశంతో నేను ఇక్కడ సాయిబాబా గురించి మాట్లాడడం లేదు. నేను సాయిబాబాను తప్పు పట్టడం లేదు. సాయిబాబా అనే మూలం తెలియని, ముస్లీమ్ వ్యక్తిగా మాత్రమే బతికిన వ్యక్తికి, మనకు తెలియవస్తున్న రూపంలో ఎక్కడా వైదికత్వం, భారతీయ సంప్రదాయం లేని సాయిబాబా అన్న ఒక వ్యక్తికీి వైదిక పద్దతులను ఆపాదించడం, అశాస్త్రీయంగా, అసాంప్రదాయికంగా, అధార్మికంగా సాయిబాబా ఆలయాలు, పూజలు, సాయిబాబా అష్టోత్తరాలు, సాయిబాబా గాయత్రీ, సాయిబాబా యంత్రం వంటి వాటితో వైదికాన్ని కుళ్లు కుళ్లు చెయ్యడం, కుళ్లబొడవడం తట్టుకోలేక ఆవేదనతో ఇలా మీ ముందుకు వస్తున్నాను.
ఆలయాల్లో కలిసిన ఘోరమైన కుళ్లుగా హైందవ ఆలయాల్లో సాయిబాబా మూర్తులు మనకు కనిపిస్తున్నాయి. ముస్లీమ్ సాయిబాబా మూర్తులు వైదిక ఆలయాల్లో ఉండడమే ఆగమ విరుద్ధం. పురాతన ఆలయాల్లో సైతం సాయిబాబా విగ్రహాలను పెట్టి ఆ ఆలయాలను అపవిత్రం చెయ్యడం జరుగుతోంది. ఇది గర్హనీయం మాత్రమే కాదు ఆవేదనకరం.
“సాయిబాబాను మనోభావాలకు సంబంధించిన వ్యక్తి” అని సమర్థించుకునే అజ్ఞానులు, వికృత స్వభావులు, అమాయకులు ఆ సాయిబాబా వల్ల నిజమైన హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయని, సాయిబాబా వల్ల హైందవమే దెబ్బ తింటోందని గ్రహించాలి. ‘సాయిబాబా ఒక అవైదికం’ అనీ, ‘సాయిబాబా హైందవంలో భయంకరమైన కుళ్లు’ అనీ సత్యాన్ని ఉన్నదున్నట్టుగా సాయిబాబా భక్తులందఱూ తెలుసుకోవాలి.
సాయిబాబాకు సంబంధించి మనలో గత కొన్ని దశాబ్దులుగా జరుగుతున్న వికారం, దారుణం ఆగిపోవాలి. సరైన ఎఱుకతో, విజ్ఞతతో మనం సాయిబాబా వికారం నుంచి విముక్తమవాలి. సాయిబాబాకు మన భారతీయ దైవ, భక్తి తత్త్వాలలో, ఆగమాలలో, సంప్రదాయాల్లో మూలాలు లేవు.
ఈ సాయిబాబా పిచ్చి అపాయకరం కూడా! ఇలా కొనసాగితే ఇది హైందవ సామాజిక విధ్వంసంగా పరిణమిస్తుంది. ఇప్పటి నుంచైనా ఈ విపత్తును తప్పించేసే ప్రయత్నం అమలు కావాలి; మన భారతీయతతో మనం వైదికంగా బతకాలి.
“సాయిబాబా ఆలయాలతో సనాతన ఆగమ ఔన్నత్యాన్ని దెబ్బకొట్టవద్దు;
సాయిబాబా పిచ్చితో నిజ హిందువులను, హైందవాన్ని బాధించ వద్దు”
(సాయిబాబా పై అవగాహన వ్యాసాలలో తదుపరి వ్యాసం రేపటి సంచికలో))
– రోచిష్మాన్
9444012279