ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అస్సాంలో ఘనస్వాగతం లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార మహోత్సవానికి అతిథిగా విచ్చేసిన చంద్రబాబు నాయుడు కి, ఆ రాష్ట్ర మంత్రి రనోజ్ పెగు విమానాశ్రయంలో సాదరంగా ఆహ్వానం పలికారు.
అస్సాం సంస్కృతికి ప్రతీకలైన జాపి టోపీ మరియు గమోసా కండువాతో చంద్రబాబు నాయుడు గారిని గౌరవించారు. ఈ వేషధారణలో ఆయన సరికొత్తగా కనిపిస్తున్నారు. దక్షిణాది రాజకీయ దురంధరుడు అయిన చంద్రబాబు నాయుడు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న హిమంత బిశ్వ శర్మల మధ్య ఉన్న స్నేహబంధాన్ని ఈ పర్యటన ప్రతిబింబిస్తోంది.
తండ్రికి తోడుగా యువనేత నారా లోకేశ్ కూడా ఈ పర్యటనలో కనిపించడం విశేషం. తండ్రీకొడుకులు ఇద్దరూ అస్సాం సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కెమెరాకు చిక్కారు. అస్సాం ఆత్మీయతకు, ఆంధ్ర చురుకుదనానికి ఈ చిత్రం ఒక చక్కని నిదర్శనం!