-230 కలశాల తో స్వామి వారి అభిషేకం
– వైభవంగా నగరోత్సవం
– విశేష పూజలు, అభిషేకం, హోమాలు నిర్వహించిన రాష్ట్ర మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు దంపతులు, శిద్దా పాండురంగరావు దంపతులు,శిద్దా సుధాకర్ దంపతులు,శిద్దా సుధీర్ కుమార్
చీమకుర్తి: హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు,హోమాలు,అభిషేకాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శిద్దా రాఘవ రావు దంపతులు, శిద్దా పాండురంగరావు దంపతులు,శిద్దా సుధాకర్ దంపతులు,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు,ఉభయ దాతలు,భక్తులు రుత్వికుల ఆలయ ధర్మ కర్తల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం శ్రీ గణపతి పూజ, పుణ్యాహవాచనం,అగ్ని ప్రతిష్ట, లక్ష్మి గణపతి హోమము,మూలబింబ మంత్ర హోమములు, మన్య సూక్త హోమము, నవగ్రహ హోమం, శాంతి హోమం, మహా పూర్ణహుతి నిర్వహించారు.
తదుపరి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి 230 కలశములతో మరియు పంచామృత ఫలరస, సుగంధ ద్రవ్యములతో స్వామి వారికి అభిషేకం, అనంతరం స్వామి వారి విశేష అలంకరణ…లక్ష నాగవల్లీ దళార్చన, మహా నైవేద్యం, మహా మంగళ హారతి, మహా మంత్ర పుష్పము, క్షమా ప్రార్థన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
భక్తులచే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ భజన నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం స్వామి వారికి శిద్దా రాఘవ రావు దంపతులు,శిద్దా పాండురంగరావు దంపతులు,శిద్దా సుధాకర్ దంపతులు భక్తులతో కలసి విశేష పూజలు నిర్వహించారు. శ్రీ శిద్దా వెంకట సుబ్బమ్మ,వెంకటేశ్వర్లు ట్రస్ట్ అధ్వర్యంలో భక్తులకు,అన్న ప్రసాదాలు అందజేశారు.
వైభవంగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి నగరోత్సవం
హనుమ జయంతి సందర్భంగా శ్రీ హరిహర క్షేత్రం నుండి చీమకుర్తి పుర వీధుల్లో స్వామి వారి నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.చీమకుర్తి కి చెందిన హనుమాన్ భక్తులు,ఆర్యవైశ్య మహిళలు స్వామి వారి నగరోత్సవంలో పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం ఆలాపన చేశారు.ఈ కార్యక్రమంలో శిద్దా సుధాకర్ దంపతులు,శిద్దా పెద్ద బాబు, శిద్దా వెంకట ప్రసాద్, శిద్దా కాశీ, శిద్దా సాయి బాబు దంపతులు, ఆలయ ఇంచార్జీ ఎమ్.వెంకటేశ్వర్లు, ఆలయ అర్చకులు సుబ్రమణ్య శర్మ,హరి వెంకట కుమారా చార్యులు, హరి కృష్ణ శర్మ, కృష్ణ శర్మ, ఉభయ దాతలు,భక్తులు పాల్గొన్నారు.