(డా.బాత్రిసు-చెన్నై/ కెపి జ్యోతిష్కులు )
మనకి “చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి”,”గొర్రె కసాయిని నమ్ముతుంది”,అనే రెండు మంచి నానుడులు ఉన్నాయి. వీటిని రాజకీయాల్లో పదేళ్ల అనుభవం ఉన్న నాయకులూ సందర్భానుసారంగా ఉపయోగిస్తూ, చిన్నా-చితక పార్టీలతో పాటుగా కొన్ని సమయాల్లో బాగా పాతుకుపోయిన ప్రత్యుర్ధీ పార్టీని కూడా పాతాళంలోకి తొక్కేస్తుంటారు.
ఈ నానుడుల వలన మరో కొత్త నానుడి ఊపిరి పోసుకుని అది సైతం ప్రాచుర్యాన్ని పొందింది అదే “ఓకే దెబ్బకు రెండు పిట్టలు”. ప్రస్తుతం ఒక సీనియర్ పార్టీ మరో కొత్త పార్టీ పైన పై నానుడుల అస్త్రం ప్రయోగించడంతో స్టాలిన్ 50% సఫలీకృతులయ్యారు. అయితే ఈ నానుడుల పట్ల అవగాహనా లేని కొత్త పార్టీ , గొర్రె కసాయిని నమ్ముతుంది అనే దాని పట్ల మక్కువ చూపింది.
ఫలితంగా ఆ కొత్త పార్టీ భవితవ్యం, దాని నాయకుడు భవితవ్యం రెండూ తిరిగి ప్రాణం తో ఉండలేని స్థితికి రానున్నాయని గ్రహాలు హెచ్చరిక చేస్తున్నాయి.తమిళ ఓటర్లు తిరిగి కొత్త పార్టీ వైపుకి చూడ కుండా ఉండేందుకు స్టాలిన్ పావులు కదుపుతున్నారు అనే విషయాన్ని ఆ గెలుపు మత్తు నుంచి ఇంకా బయటపడలేని కొత్త నాయకుడు గ్రహించలేకపోతున్నారు. విష్ణుశర్మ తన పంచతంత్ర కథల్లో మిత్రలాభం-మిత్రభేదం అనే అధ్యాయాల లో” మిత్రుడు శత్రువైన భయపడనవసరం లేదు. కానీ శత్రువు మితృడైతే మాత్రం మనకు మూడినట్టే” అంటారు.
ఈ విషయాన్ని టీవీకే నేత ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. విజయ్ కేవలం 9.50 లక్షల మైనారిటీల ఓట్లతో మాత్రమే సీఎం అయ్యానని భ్రాంతిలో ఉండటం శోచనీయం. ఈ నానుడుల అమలు వెనుక సూత్రధారి స్టాలిన్.. తన పార్టీ మాత్రమే రాష్ట్రంలో బతికి ఉండాలనే సంకల్పంతోనే, మైనారిటీ పార్టీ లను టీవీకే తో పొత్తుకు పురిగొల్పిన విషయాలను గ్రహాల కదలికలు చెబుతున్నాయి.
ఆరు నెలలు విజయ్ ని టచ్ చేయం..గమనిస్తాం అని స్టాలిన్ చేసిన వ్యాఖ్యల వెనుక పెద్ద కథే దాగి ఉంది. పైకి మాత్రం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రానీయకుండా చేయడమే మా ఉద్దేశం అని అయన చెప్పడంలో వాస్తవం లేదు.
2029 జమిలి ఎన్నికల్లో ఎంపీల ఎన్నికల వరకు విజయ్ ను కుర్చీలో ఉండనిచ్చే అవకాశాలు అత్యంత స్వల్పంగా కనిపిస్తున్నాయని గ్రహ గతులు నిర్ధారిస్తున్నాయి. స్టాలిన్ చేతిలో కీలు బొమ్మలు కొనసాగుతున్న వామ పక్ష మరి ఇతర పార్టీలు “మఖలో పుట్టి పుబ్బలో పోయాడు” అనే విషయాన్ని పరిచయం చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్న విషయం టీవీకే నేత కు తెలుసునా ? లేదా?
ప్రశ్న- విజయ్ కి దాగివున్న శత్రువులు , వ్యతిరేకత అయన సన్నిహిత వర్గం నుంచి వస్తున్నారా లేక నమ్మకమైన మిత్రుల నుండి,భాగస్వాముల రూపంలో వస్తున్నారా?అన్న ప్రశ్నకు గ్రహాలు ఇలా వివరణను ఇస్తున్నాయి.
కీలక తర్కం- 6వ – 12వ భావ ఉప-అధిపతి శని విశ్వసనీయ మిత్రులు , భాగస్వాములకు సంబంధించిన 7వ భావానికి స్పష్టంగా అధిపతిగా ఉండి, ద్రోహానికి సంబంధించిన 8వ భావంలో కూడా ఉండటం, ఈ ముప్పు సన్నిహిత సహచరుల నుండే వస్తుందని నిర్ధారిస్తుంది.
అధిక ప్రామాణికత- భాగస్వాములు మరియు సహచరులకు సంబంధించిన 7వ ఇంట్లో చంద్రుడు నేరుగా ఉండడం, తమ విశ్వసనీయ వర్గం పట్ల ప్రశ్నకర్తకు ఉన్న అనుమానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. అంతేకాకుండా, పాలక గ్రహాలు (చంద్రుని రాశికి అధిపతి శని) 7వ ఇంటి విషయాలు అయన దృష్టిని బలంగా ధృవీకరిస్తున్నాయి.
2. ఉపయోగించిన ఇళ్ళు –
వాగ్దాన గృహాలు- 7 విశ్వసనీయ మిత్రులు, రాజకీయ/వ్యాపార భాగస్వాములు, బహిరంగ సహచరులు, 11 -స్నేహితులు, అత్యంత సన్నిహితులు.
సమస్యాత్మక /అడ్డంకి గృహాలు- 6- వ్యతిరేకత, బహిరంగ శత్రువులు, 8 -ద్రోహం, ఆకస్మిక పతనం, నమ్మకద్రోహం, 12 -రహస్య కుట్రలు, అందులో దాగి ఉన్న శత్రువులు.
3. వాగ్దాన పరిశీలన-
CSL విశ్లేషణ ప్రకారం , 6వ ఇల్లు -శత్రువులు- 12వ ఇల్లు రహస్య కుట్రలు రెండింటికీ కస్పిల్ సబ్-లార్డ్ శని. శని 7వ ఇంటి విశ్వసనీయ మిత్రులు భాగస్వాముల అధిపతి అయ్యి 8వ ఇంట్లో చేరి ఆకస్మిక సంక్షోభం ద్రోహాలను చూపిస్తున్నాడు..
ఉప-స్థాయి నిర్ధారణ- శని తన నక్షత్ర అధిపతి అయిన శని ద్వారా పనిచేస్తూ, 7వ 8వ భావాల లోని అంశాలను బలంగా చూపిస్తోంది . దీని అర్థం “శత్రువు” ఖచ్చితంగా “మిత్రుడు” అవుతారు అనే సంకేతం 7వ భావం సూచిస్తోంది..
ఉప-అధిపతి తర్కం: శని యొక్క ఉప-అధిపతి గురుడు, ఇది 12వ ఇంట్లో ఉంటే తెర వెనుక కుట్ర చేసే ఇంట్లో ఉంది ,ఈ గురువు 6వ ఇల్లైన శత్రువుల కి అధిపతి. ఇది వినాశకరమైన 6-7-8-12 చక్రాన్ని పూర్తి చేస్తుంది: నమ్మకమైన భాగస్వాములు-7 ఇల్లు, శత్రువులుగా మారడం -6 వ ఇల్లు , ఆకస్మిక సంక్షోభం లేదా ద్రోహానికి -8 వ ఇల్లు కారణమయ్యే లా రహస్యంగా పనిచేయడం -12.వ ఇల్లు.
పాలక గ్రహ పరిశీలన-: మిత్రులు శత్రువులు గా మారడానికి కీలక సూచిక ఏమంటే ద్వితీయ పాలక గ్రహంగా చంద్ర రాశి అధిపతి కనిపించడం, ఈ నిర్ధారణ అత్యంత విశ్వసనీయ మైనదని ధృవీకరిస్తోంది.
4. సమయ నిర్ధారణ-
ప్రస్తుత దశ-భుక్తి-అంతరం- ప్రస్తుతం కుజ దశ గురు అంతర 2026-05-03 న ప్రారంభమైంది ప్రస్తుత క్రియాశీలత: గురు గ్రహం శత్రు సూచికకు ఉప-అధిపతి కావడం రహస్యాలకు సంబంధించిన 12వ ఇంట్లో ఉండటం వలన, ఈ గురు అంతర సమయంలో విజయ్ సన్నిహిత వర్గం తెర వెనుక కుట్రలు ప్రస్తుతం అత్యంత చురుకుగా ఉన్నాయి.
ప్రేరణ సమయం- శని అంతర 2026-06-21న ప్రారంభమవుతుంది. ఈ శని 7వ ఇంటి మిత్రుడికి ప్రాతినిధ్యం వహిస్తూ, 8వ ఇంటి సంక్షోభానికి,నమ్మక ద్రోహానికి కారణమవుతున్న గ్రహం ఈ కాలం అత్యంత ప్రమాదకరమైనది.ప్రస్తుతం కొనసాగుతున్న రహస్య కుట్ర, బహుశా 2026-06-21న శని అంతర ప్రారంభమైన వెంటనే బహిరంగ ద్రోహం గా లేదా ఆకస్మిక సంక్షోభంగా పరిణమించే అవకాశం ఉంది.
5. మార్గదర్శకత్వం- నక్క వినయాలను అనుమానించాలి
నష్ట నివారణ చర్యలో భాగంగా మీ నమ్మకమైన భాగస్వాములు, సన్నిహిత సలహాదారులు లేదా దీర్ఘకాల రాజకీయ/వ్యాపార మిత్రుల విధేయతను తేలికగా తీసుకోకండి. ఈ ముప్పు అంతర్గతమైనది,బాహ్యమైన కాదు. అని విజయ్ తెలుసుకుంటే మంచిది ..
సమాచార భద్రత- 8వ ఇంటి అనుసంధానం ప్రకారం, భాగస్వాములతో పంచుకున్న సున్నితమైన లేదా గోప్యమైన సమాచారం మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడే అవకాశం ఉందని గట్టిగా సూచిస్తుంది. వ్యూహాత్మక ప్రణాళిక లకు అర్హత-ప్రాప్తత్య లను విజయ్ పరిమితం చేయడం ఎంతైనా అవసరం.
సన్నాహాలు- నమ్మక ద్రోహం ఆకస్మికంగా జరుగుతుందని 8 వ ఇల్లు చూపుతున్నందున , రక్షణాత్మక ప్రణాళికలపై ఎక్కువగా దృష్టి సారించడం అవసరం. జూన్ 2026 చివరి నాటికి విజయ్ తన కార్యాచరణ స్థావరాన్ని సురక్షితం చేసుకోవడం అత్యవసరం..
6. గ్రహ తీర్పు తప్పదు
విజయ్ శత్రువులు నిజానికి అయన అంతరంగిక వర్గం లోని నమ్మకమైన మిత్రులు- భాగస్వాములే నని, వారు ప్రస్తుతం ఆకస్మిక ద్రోహానికి పాల్పడేందుకు రహస్యంగా కుట్ర పన్నుతున్నారని ఈ చార్ట్ బలంగా, స్పష్టంగా ధృవీకరిస్తోంది.ఈ ప్రమాదాన్ని దాటాలంటే విజయ్ అన్నాడీఎంకే తో చేతులు కలపడం తప్ప వేరు మార్గం లేదు.అల్లా చేస్తే అయన కనీసం మూడేళ్ల పాటు సీఎంగా కుర్చీలో కూర్చో కలుగుతారు లేదంటే ఆయనకు అటు సినిమా-ఇటు రాజకీయ భవిష్యత్తు రెండూ ముగిసి పోయినట్లే.అంతే కాదు “ఏక్ దిన్ కా సుల్తాన్” అనే అప్రతిష్టను కూడా భరించాల్సి ఉంటుంది.
(వచ్చే 4 గో భాగంలో- రాజకీయ ధ్రిల్లర్ )