Suryaa.co.in

Devotional

గిరి ప్రదక్షిణ

గిరి ప్రదక్షిణ అనేది ఒక పవిత్ర కార్యక్రమం. అరుణాచల గిరి ప్రదక్షిణ సమయంలో మనం ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ అరుణగిరిని ఈశ్వర స్వరూపంగా భావించి తిరుగుతున్నాం. ఈ ప్రదక్షిణ సమయంలో మనం 360 తీర్థాలు,400 శివలింగాలు చూడవచ్చు.

ఈ ప్రదక్షిణకు ఎటువంటి నియమాలు లేవు.ఉపవాసం ఉండనక్కరలేదు. మన సదుపాయం కోసం సూర్యోదయానికి ముందు, సూర్యోదయానికి తర్వాత చేస్తే ఎలాంటి ఎండ వేడిమి తగలదని సూచించారు. మనకు కనిపించని అనేక దేవగణాలు కూడా ఈ పవిత్ర కార్యక్రమం లో పాల్గొంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా మనం కాలిబాట లో నడవాలి. ఒక గర్భిణీ స్త్రీ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా, దారిలో తీర్థాలు, పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు దర్శిస్తూ నడవాలి. ఎక్కడ నుంచి బయలు దేరామో తిరిగి అక్కడికే చేరాలి. కొందరు అరుణాచలేశ్వర ఆలయ ప్రాంగణంలో ప్రారంభిస్తే మరికొందరు శ్రీ రమణాశ్రమం నుంచి ప్రారంభిస్తారు. ఏమైనా విఘ్నేశ్వర దర్శనం తప్పనిసరి.

గిరి ప్రదక్షిణ ఈ క్రింది విధంగా ఉంటుంది.

1,2.అరుణాచలేశ్వర మందిరం
3. కర్పగ వినాయక మందిరం
4. ఇంద్ర లింగం
5. అగ్ని లింగం
6. శ్రీ శేషాద్రి స్వామి ఆశ్రమం
7. శ్రీ రమణాశ్రమం
8. యమ లింగం
9. నైరుతి లింగం
10. సూర్య లింగం
11. వరుణ లింగం
12. మాణిక్య వాచిగర్ మందిరం
13.ఆది అన్నామలై మందిరం
14. వాయు, లింగం
15. కుబేర లింగం
16. ఈశాన్య లింగం
పై తెలిపిన విధంగా ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలి.

– సేకరణ J N RAO

LEAVE A RESPONSE