గ్రీన్ దీపావళి లక్ష్యానికి అందరూ కృషి చేయాలని రాజమహేంద్రవరం ఎంపీ, వైయస్సార్సీపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ లో నగరపాలక సంస్థ
ఆధ్వర్యంలో బుధవారం పెద్దఎత్తున గ్రీన్ దీపావళి కార్యక్రమాలు దీపోత్సవం, గోదావరి నది హారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ.. గ్రీన్ దీపావళి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ అభిషిక్త కిషోర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
పుష్కర ఘాట్ లో గ్రీన్ దీపావళి లో భాగంగా పదివేల దీపాలు వెలిగించినందుకు కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ దీపావళి నుంచి కరోనా మహమ్మారి భూమండలం నుంచి తొలగిపోవాలని ఆ దేవ దేవుని ప్రార్థిస్తున్నా మని పేర్కొంటూ.. ప్రజలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. నగరపాలక కమిషనర్ అభిషిక్త కిషోర్, అడిషనల్ ఎస్పీ లతా మాధురి, రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్, వైసీపి సీనియర్ నాయకులు టీ.కే. విశ్వేశ్వర రెడ్డి తదితరులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు