Suryaa.co.in

Features

జ్ఞానవాపితో జ్ఞానోదయమయ్యేనా?

వందల ఏండ్ల హిందువుల నిరీక్షణ ఫలించింది. 350 సంవత్సరాలుగా మరుగున పడ్డ మహాశివుడు లోకానికి దర్శనమిచ్చే శుభ తరుణం ఆసన్నమైంది. వేలాది భక్తుల ప్రాణ త్యాగాలు, కోట్లాది హిందువుల శతాబ్దాల నిరీక్షణకు తెరపడి, ఆ లింగోద్భవం జరిగిపోయింది. ఆ కాశీ విశ్వేశ్వరుడు అజ్ఞాతం వీడి అశేష జనవాహినికి అద్భుత దర్శనమొసగే సమయం ఆసన్నమైంది. ఎట్టకేలకు ఆ కాశీ విశ్వేశ్వర లింగం బయటపడింది.

అయితే జ్ఞానవాపి ఉదంతం మనకు మూడు విషయాలను తేటతెల్లం చేస్తోంది. మొదటగా ముస్లిముల దౌర్జన్యకర, దురాక్రమణ మనస్తత్వాన్ని, వారి పరమత అసహిష్ణుతను ఈ ఉదంతం మరోసారి ప్రపంచానికి వెల్లడి చేస్తోంది. ఇన్ని సాక్ష్యాలు బయటపడ్డ తర్వాత, దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా
jnana1కూడా జ్ఞానవాపిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఈ సమయంలో కూడా తమ తప్పు తెలుసుకుని, లెంపలేసుకుని, చరిత్రలోని నిజానిజాలను పెద్ద మనసుతో అంగీకరించే పరిస్థితిలో ముస్లిములు లేరు. తాము నమ్మిన ఆ జగదీశ్వరుని ఆలయానికి శతాబ్దాల క్రితం జరిగిన అన్యాయంపైన, శతాబ్దాలుగా ఆ విశ్వేశ్వరునికి ఆ లోగిలిలో జరుగుతున్న అవమానంపైన ఆవేదనా భరిత హృదయులై ఉన్న హిందువులకు సహృదయ భావనతో తామే ముందుకు వచ్చి జ్ఞానవాపిని అప్పగించాల్సింది పోయి “జ్ఞానవాపిని మా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు” అంటూ ఇంకా బెదిరింపు ధోరణిలోనే మాట్లాడుతున్నారంటే వారి దౌర్జన్యకర, దురాక్రమణవాద మనస్తత్వం లోకానికి వెల్లడవడం లేదూ?

అదే సమయంలో ఒవైసీ లాంటి నాయకులు ప్రార్థనాలయాలలో 1947 నాటి స్థితిని యధాతథంగా కొనసాగించాలంటూ 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. నిజానికి తమను తాము ఉదారవాద రాజకీయ పక్షాలుగా వెల్లడి చేసుకుంటూ, లోపల లోపల లోపాయికారీగా ముస్లిముల దౌర్జన్యాలకు, దురాక్రమణలకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలచి హిందువులను లౌక్యంగా లోబరుచుకుని దశాబ్దాలుగా మోసం చేస్తూ వచ్చిన లౌకికవాద రాజకీయ పక్షాల ముసుగు కూడా 1991 చట్టం ద్వారా నేటితో తొలగిపోయింది. 1991 నాటికి అయోధ్య ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతోంది. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గాభరా పడిపోయింది. మహమ్మదీయ పాలకులనేకులు దేశంలోని వేలాది దేవాలయాలను కూలగొట్టి మశీదులుగా మార్చిన సంగతి కాంగ్రెస్ కి బాగా తెలుసు. అయోధ్య
jnana2ఉద్యమంలో న్యాయం హిందువుల పక్షాన మొగ్గితే భవిష్యత్తులో అనేక మశీదులను హిందువులకు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతాయనీ కాంగ్రెస్ కి తెలుసు. అందుకే అప్పటికప్పుడు ఆదరాబాదరాగా ఓ చట్టం చేసి పడేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇక భవిష్యత్తులో ఎవ్వరూ, ఏ విధంగానూ వివాదాస్పద మశీదుల జోలికి వెళ్లకుండా ఓ రక్షణ కవచాన్ని ముస్లింలకు ఏర్పరిచిందన్నమాట. ఇదే కాంగ్రెస్ మొదటి నుంచి అనుసరిస్తూ వస్తున్న కుటిల నీతి. ఈ విధంగానే ఎప్పటికప్పుడు ముస్లిముల అరాచకానికి వెన్నుదన్నునిస్తూ వస్తోంది. హిందువులకు మెత్తని మాటలు చెబుతూ సుతిమెత్తగా వెన్నులోకి బాకు గుచ్చుతోంది. ఎప్పుడు చట్టం చేసిందో, ఏమని చేసిందో కూడా ఎవ్వరికీ పెద్ద తెలియకుండానే ఓ నల్ల చట్టాన్ని, ఓ చీకటి చట్టాన్ని రహస్యంగా రూపొందించేసింది జిత్తులమారి కాంగ్రెస్. ఒక్క కాంగ్రెస్ అనే కాదు దేశంలోని మిగిలిన సెక్యులర్ రాజకీయ పక్షాలదీ అదే తీరు. నేడు జ్ఞానవాపి విషయంలో ఒవైసీ ప్రభృతులు పదే పదే 1991 నాటి చట్టాన్ని గురించి ఉటంకిస్తూ ఉండటం చూస్తే ఎంత దీర్ఘ దృష్టితో, ఎంత ద్రోహ బుద్ధితో ఆనాడు ఆ చట్టాన్ని రూపొందించారో మనకు అవగతమవక మానదు. అయితే ఇప్పటికైనా హిందువులు, ముఖ్యంగా తాము సెక్యులర్లమంటూ ముసి ముసి నవ్వులు నవ్వుతూ తెగ మురిసిపోయి, మెలికలు తిరిగిపోయే మూర్ఖ హిందువులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని తమతో స్నేహం నటిస్తూ తమ వెనకే గోతులు తవ్వే భాయ్ ల, తమ అభిమాన రాజకీయ పక్షాల నక్క బుద్ధులు తెలుసుకొని
njana3మెలిగితే మంచిది.వీటన్నిటి కంటే మిన్నగా మరోవైపు హిందువుల సహనశీలతను, పోరాటపటిమను, దీక్షను సైతం ఈ సంఘటన తేట తెల్లం చేస్తోంది. హిందూ సంస్కృతికి మూలాధారమైన, పవిత్ర చిహ్నాలైన మాన బిందువులను రక్షించుకోవడంలో హిందూ సమాజం ఎన్నడూ వెనుకంజ వేయలేదు. శక్తి చాలనప్పుడు, శత్రువు దుర్మార్గాన్ని, కుటిల నీతిని అంచనా వేయలేక పోయినప్పుడు పరాధీనత పొంది ఉంటే ఉండవచ్చుగాక, కానీ ఏనాడూ హిందూ సమాజం వెన్ను చూపి పారిపోలేదు. పోరాటాన్ని ఆపలేదు. పరాభవాన్ని మరచిపోలేదు. పరాయి మతాల భౌతిక, సాంస్కృతిక దురాక్రమణకు బలియైన జాతులెన్నో నేడు ప్రపంచంలో తమ నామ రూపాలను పూర్తిగా కోల్పోయాయి. రోమ్, ఈజిప్ట్, పర్షియా, మెసపటోమియా, ఆఫ్రికా వంటి ఎన్నో ఉదాహరణలు మన కళ్ల ముందున్నాయి. అవి తమ నాగరికతలను, సంస్కృతిని, ఆచార వ్యవహారాలను పూర్తిగా కోల్పోయి తమను దురాక్రమించిన ఎడారి మతాలనే నేడు అవలంబిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చైనా, జపాన్, భారత్, ఇజ్రాయెల్ లు మినహా ప్రపంచంలో మిగిలిన జాతులన్నీ తమ సాంస్కృతిక మూలాలను పూర్తిగా కోల్పోయాయనే చెప్పాలి. తమ ఆరాధన పద్ధతిని కోల్పోయినప్పటికీ తమ సంస్కృతిని మాత్రం కాపాడుకున్న వారిగా ఇండోనేషియన్ లను చెప్పుకోవచ్చు. తమ పవిత్ర పుణ్యక్షేత్రాలను, ఆచార వ్యవహారాలను, ఆరాధనా పద్ధతులను, ఆలయాలను రక్షించుకునే క్రమంలో హిందువులు కూడా తరతరాలుగా నిరంతరం తమ పోరాటపటిమను, పౌరుష పరాక్రమాలను ప్రకటిస్తూనే ఉన్నారు.

2000 ఏళ్ల క్రితం విక్రమాదిత్యుడు నిర్మించిన కాశీవిశ్వనాథ ఆలయాన్ని 1194 లో మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ కూల్చేశాడు. 1211 లో గుజరాత్ కు చెందిన వ్యాపారి ఒకరు ఆ ఆలయాన్ని పునరుద్ధరించారు. మళ్లీ 1500 ప్రాంతంలో సికిందర్ లోఢీ ఆలయాన్ని కూల్చేయగా మళ్లీ రాజా మాన్ సింగ్ దానిని పునర్నిర్మించాడు. చివరిగా 1669 ఏప్రిల్ 4న ఔరంగజేబు ఆ ఆలయాన్ని కూల్చివేసి ఆ ఆలయ గోడల మీదే హడావుడిగా మశీదు నిర్మింపజేశాడు. దానికే జ్ఞానవాపి మసీదు అని పేరు. 1700లో సవాయి జైసింగ్ – 2 మశీదుకు 150 గజాల దూరంలో ఆది విశ్వేశ్వరుని ఆలయాన్ని నిర్మించాడు.1742 తర్వాత రాణి అహల్యాబాయి హోల్కర్ ఆ దేవాలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు.

మశీదు ప్రక్కనే ఆలయం వెలసినా సరే… హిందువుల పోరాటం ఆగిపోలేదు. 150 సంవత్సరాలుగా వ్యాస పరివార్ సంస్థ దానిపై పోరాటం సల్పుతూనే ఉంది. జ్ఞానవాపి ఒకనాటి హిందూ దేవాలయమేననటానికి అవసరమైన ఎన్నో చారిత్రిక ఆధారాలను సేకరించింది. ఆ క్రమంలోనే జ్ఞానవాపి ప్రాంతంలో గుడి కట్టుకుని, పూజలు నిర్వహించుకోవడానికి అనుమతిని ఇవ్వాలని కోరుతూ 1991 అక్టోబర్ 15న వ్యాస పరివార్ కు చెందిన పండిట్ సోమనాథ్ వ్యాస్, డాక్టర్ రామ రంగ్ శర్మ తదితరులు వారణాసి కోర్టును ఆశ్రయించారు. కానీ “అంజుమన్ ఇంతెజామియా మశీద్” దానిపై స్టే కోరుతూ హైకోర్టుకు వెళ్ళింది.1998 నుంచి ఆ కేసు పెండింగ్ లో ఉంది. అలాగే మశీదులో ఆర్కియాలజికల్ సర్వే నిర్వహించాల్సిందిగా కోరుతూ విజయ శంకర్ రస్తోగీ వేసిన పిటిషన్ పై కూడా అలహాబాద్ హైకోర్టు స్టే విధించింది. చివరిగా జ్ఞానవాపిలోని శృంగార గౌరీ, గణపతి, హనుమంతుడి విగ్రహాలకు నిత్య పూజలు జరిపేందుకు అనుమతించాలంటూ ‘విశ్వ వేదిక్ సనాతన సంఘ్’ అనే సంస్థకు చెందిన ఐదుగురు మహిళలు 2021లో కోర్టు మెట్లెక్కారు. దానిపై కోర్టు స్పందించటం, జ్ఞానవాపిలో వీడియోగ్రఫిక్ సర్వేకు అనుమతి ఇవ్వటం, అందులో అనేక ఆధారాలు వెలుగులోకి రావటం మనకు తెలిసిందే.

మధుర, తాజ్ మహల్ ల విషయంలోనూ ఇలాంటి పోరాటమే కొనసాగుతూ ఉంది. అయోధ్యలో అలుపెరగకుండా శతాబ్దాల పాటు హిందువులు సాగించిన పోరాటానికి ఫలితం దక్కింది. పెద్ద పెద్ద అరుపులు, కేకలు, నిరసన ప్రదర్శనలు, వీధి పోరాటాలు, హింస, రక్తపాతం, సవాళ్ళు, ప్రతిసవాళ్లు వంటివేవీ చేయనందున హిందువులను అమాయకులనో, చేతగానివాళ్లనో, పిరికివాళ్లనో అనుకుంటే పొరపాటు. హిందువులు కార్యదక్షులు. మౌనంగా సమయం కోసం వేచి చూసి, సరిగ్గా తగు సమయంలో కార్య సాఫల్యత కోసం ప్రయత్నించే కార్య నిపుణులు. ఈ విషయం అర్ధం కాక చాలామంది హిందువులే, హిందువులను పిరికి వాళ్ళగానో, చేతకాని దద్దమ్మలుగానో అభివర్ణిస్తూ ఉంటారు. జరిగిన, జరుగుతున్న పరిణామాలపై వారి అక్కసు, ఆక్రోశమే అందుకు కారణం కావచ్చు. కానీ హిందువులపై ఆ రకమైన అభిప్రాయం, అంచనా సరియైనది కాదు. హిందువులు కర్తవ్య పరాయణులు. హిందువులు కార్య కుశలురు. హిందువులు కార్యదక్షులు.

మొత్తానికి ముస్లిముల దురాక్రమణ మనస్తత్వాన్ని, సెక్యులర్ పార్టీల నక్క జిత్తులను, హిందువుల పోరాట పటిమను లోకానికి చాటింది జ్ఞానవాపి. ఈ పరిణామాలతోనన్నా అందరికీ జ్ఞానోదయమై, న్యాయ పక్షం, ధర్మ పక్షం వహించి ధర్మాన్ని గెలిపిస్తారేమో చూద్దాం. జై హింద్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి
– vskandhra.org

LEAVE A RESPONSE